ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఆదేశాల కారణంగా ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటిని అందించేందుకు మంజూరు చేసిన కుందూ-పెన్నా వరదకాలువ నిర్మాణ పనులు రద్దయ్యాయి. దీంతో ఈ పనులను అధికారులు నిలిపివేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈపనులు మంజూరుకాగా త్వరలో టెండర్లు నిర్వహించాల్సి ఉంది.
అయితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోమంజూరు చేసిన పనులను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఈనెల 4వ తేదీన జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని కుందూ పెన్నా కాలువ నిర్మాణ పనులురద్దయ్యాయి. ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డి తొలుతగా 2007 మే24న రూ.72.53 కోట్ల నిధులు మంజూరుచేయగా రూ.60.59 కోట్లతో కాంట్రాక్టుఅగ్రిమెంట్ జరిగింది. అయితే అసంబద్ధంగా అలైన్‌మెంట్ మార్చి చేపడుతున్నఈ పనులను నిలిపివేయాలని రైతులుకోర్టును ఆశ్రయించడంతోపాటు ఇందుకురాజకీయ కారణాలు కూడా తోడయ్యాయి.
ఈ కారణంగా పనులు సగం కూడా కాకముందే ఆగిపోయాయి. మొత్తం పెద్దముడియం మండలంలోని నాగరాజుపల్లెనుంచి 33.907 కిలోమీటర్ల పరిధిలోపనులు జరగాల్సి ఉండగా కేవలం 12.80కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయి.ఇంకా 21.107 కిలోమీటర్లు పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే కాలువ నిర్మాణంలోభాగంగా 44 స్ట్రక్చర్లకుగాను రెండు కూడాపూర్తిగా నిర్మించలేదు. 924.95 ఎకరాలుభూసేకరణ చేయాల్సి ఉండగా కేవలం503.28 ఎకరాలు మాత్రమే పూర్తయింది.ఇంకా 421.67 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు అయినపనులకు రూ.28.327 కోట్ల నిధులు ఖర్చుచేశారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేనంద్యాల వరదరాజులరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఈపనులను పునరుద్ధరించేలా మళ్లీ కొత్తగాపనులు ప్రారంభించేందుకు అనుమతిమంజూరు చేయించుకున్నారు. జీఓ ఆర్‌టీనెంబర్ 118 ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి6వ తేదీన రూ.183.2197 కోట్లతో ఈ పథకాన్ని పునరుద్ధరించారు. వెంటనే ఎన్నికలురావడంతో పనులు ముందుకు సాగలేదు.త్వరలో ఇందుకు సంబంధించి టెండర్లుపిలవాల్సి ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు దీనిపై ఆంక్షలువిధించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యద ర్శి ఆదేశాలు జారీ చేశారు.
ఈమేరకు గత ఏడాది సెప్టెంబర్ నుంచిమంజూరైన పనులు ఆగిపోయాయి. మిగతా పనులతోపాటే ఆగిపోయాయి..ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మిగతా పనులతోపాటే కుందూ-పెన్నా వరద కాలువపనులు ఆగిపోయాయి. పనులు తిరిగిప్రారంభించాలంటే ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిఉంటుంది.
- పట్టాభి రామిరెడ్డి, ఇన్‌చార్జి డీఈ