
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన రథం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున రావు తెలిపారు. డిసెంబరు నెలాఖరు నాటికి రథం నిర్మాణం పూర్తవుతుందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక రథోత్సవం ఫిబ్రవరి 23న వస్తుందని, ఆ రోజు నూతన రథంతో ఉత్సవాలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంప్రదాయ మరియు ఆచార పద్ధతులన్నింటినీ అనుసరించి నూతన రథం రూపుదిద్దుకుంటోందని చెప్పారు. అధిక నాణ్యత గల బస్తర్ టేక్ వుడ్‌ను రథం తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ‘అంతర్వేది’ రథ నిర్మాణం ప్రారంభం)