antarvedi temple
-
వైభవంగా అంతర్వేది తిరు కళ్యాణ మహోత్సవాలు
-
అంతర్వేది రథం దగ్ధం కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం
కాకినాడ లీగల్: అంతర్వేది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథం అగ్నికి ఆహుతి అయిన కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం ఇవ్వాలని కాకినాడ వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రఘుపతి వసంతకుమార్, సభ్యులు చక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు తీర్పు చెప్పారు. ప్రమాదవశాత్తు రథం దగ్ధమైన కేసులో అంతర్వేది శ్రీలక్ష్మీనారాయణ దేవస్థానం తరఫున ఎగ్జిక్యూటివ్ అధికారులు కాకినాడ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. రూ.84 లక్షల పరిహారం, నష్టాల కింద రూ.15 లక్షలను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలని కోరారు. రథం ఘటన ప్రమాదం కాదంటూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తరఫు న్యాయవాది వాదించారు. కాకినాడ కోర్టు పరధిలోకి ఈ కేసు రాదన్నారు. దీనిపై ఎండోమెంట్ ప్యానల్ న్యాయవాది జీవీ కృష్ణప్రకాష్ వాదిస్తూ భగవంతుడు సర్వాంతర్యామి అని, కాకినాడలో ఎండోమెంట్ కార్యాలయం ఉందని, అందువల్ల కేసును కాకినాడ కోర్టులోనే విచారించాలన్నారు. వాదోపవాదనల అనంతరం రూ.84 లక్షల పరిహారంతో పాటు రూ.30 వేలు ఖర్చుల కింద 45 రోజుల్లోపు బీమా కంపెనీ చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. హెచ్ఆర్సీకి 9 నుంచి సంక్రాంతి సెలవులు కర్నూలు(సెంట్రల్): స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్(హెచ్ఆర్సీకి)కి ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కమిషన్ కార్యదర్శి ఎస్.వెంకటరమణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పాత కేసుల వాయిదా, విచారణ, అత్యవసర కేసుల నిమిత్తం వెకేషన్ కోర్టులను నిర్వహిస్తారు. 9, 10, 11 తేదీల్లో కమిషన్ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, 12, 13 తేదీల్లో కమిషన్ జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వెకేషన్ కోర్టు నడుస్తుంది. 14, 15, 16 తేదీల్లో పూర్తి సెలవు ఉండగా.. 17వ తేదీన కమిషన్ నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెకేషన్ కోర్టు ఉంటుంది. 18వ తేదీ నుంచి యధాతథంగా హెచ్ఆర్సీ కార్యకలాపాలు జరుగుతాయి. ఇదీ చదవండి: TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా! -
శోభాయమానంగా అంతర్వేది రథయాత్ర
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి రథయాత్ర శనివారం అత్యంత శోభాయమానంగా సాగింది. సుమారు లక్ష మందికి పైగా భక్తులు రథ యాత్రలో పాల్గొన్నట్లు అంచనా. శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణం జరిగిన నేపథ్యంలో అనంతరం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో భక్తులు సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం 3 గంటలకు రథ యాత్ర ప్రారంభం కాగా, భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కలిదిండి గోపాలరాజు బహద్దూర్ కొబ్బరి కాయ కొట్టి రథ యాత్ర ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. -
ఈసారీ లాంచీలు లేనట్టేనా!
నరసాపురం (పశ్చిమ గోదావరి): అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 8 నుంచి తిరునాళ్లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే గత పదేళ్లుగా అంతర్వేదికి లాంచీలు నిలిచిపోవడంతో జిల్లా వాసులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఈ ఏడాది కూడా లాంచీలు రప్పించడానికి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. నరసాపురం ప్రాంతంలో ప్రకృతి అందాలకు కొదవ లేదు. వశిష్ట గోదావరి అందాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. అంతర్వేదికి రోడ్డు మార్గంలో వెళ్లేందుకు సౌలభ్యం ఉన్నా.. ప్రతీ ఏటా లాంచీల ద్వారా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చేది. నరసాపురం లాంచీల రేవు నుంచి అంతర్వేది క్షేత్రానికి వెళ్లడానికి గోదావరిలో సుమారు 45 నిమిషాలు ప్రయాణం చేయాలి. నరసాపురం రేవు నుంచి అంతర్వేది రేవు పది కిలోమీటర్లు దూరంలో ఉంది. 2011 నుంచి లాంచీల ప్రయాణాన్ని నిలుపుదల చేసారు. కొన్నేళ్ల క్రితం వరకు అంతర్వేది సమయంలో నరసాపురం నుంచి 150 పైగా లాంచీలు రాకపోకలు సాగించేవి. లాంచీ యజమానులు నష్టాలు వస్తున్నాయని తీసుకురామని చాలాసార్లు మొండికేశారు. స్థానిక అధికారులు చొరవ తీసుకుని లాంచీలు నడిపించేవారు. 2010లో అప్పటి సబ్‌కలెక్టర్ రొనాల్డ్‌రోజ్ పట్టుపట్టి లాంచీలు రప్పించారు. ఒకప్పుడు అంతర్వేది ఉత్సవాల హడావిడి మొత్తం నరసాపురంలోనే ఉండేది. రాష్ట్రంలో ఏమూల నుంచి వచ్చే వారైనా, నరసాపురం వచ్చి లాంచీల్లో ప్రయాణించి అంతర్వేది చేరేవారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులూ ఇక్కడి యాత్రికుల రద్దీతో తీర్థం జరిగేది. నరసాపురం, పాలకొల్లు బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడేవి. నరసాపురం గోదావరి రేవు దారి మొత్తం పుష్కరాల సమయాన్ని గుర్తు చేసేది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. అంతర్వేది హడావిడి నరసాపురంలో ఒకప్పటిలా కనిపించడంలేదు. దీనికి తోడు లాంచీలు లేకపోవడంతో పరిస్థితిలో మరింత మార్పు వచ్చింది. అంతర్వేది శ్రీలక్ష్మీనర్శింహస్వామి ఆలయం 8 నుంచి ఉత్సవాలు అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణ ఉత్సవాలు ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతాయి. 17తో ముగుస్తాయి. 11న రాత్రి కల్యాణం, 12న రథోత్సవం, 16న పౌర్ణమి స్నానాలు ఉంటాయి. ఈ మూడురోజులు ఉత్సవాల్లో కీలకమైనవి. లాంచీలు లేకపోవడంతో బస్సుల్లో, పంటుపై గోదావరి దాటి వెళ్లాల్సిందే. రెవెన్యూ శాఖ చొరవ చూపేది లాంచీల్ని రప్పించడంలో గతంలో రెవిన్యూశాఖ చొరవ చూపేది. దీంతో లాంచీలు వచ్చేవి. లాంచీలో అంతర్వేది వెళుతున్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. వశిష్ట గోదావరి అందాలు పది కిలోమీటర్ల మేర చూస్తూ వెళ్లడం, ఆ ఆనందం చెప్పలేనిది. ఏడాదికోసారి లాంచీలో ప్రయాణించే అవకాశం వస్తుందని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. – విన్నా ప్రకాష్, న్యాయవాది లాంచీలు తిప్పాలి వశిష్ట గోదావరిపై ప్రకృతి అందాలకు కొదవలేదు. ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయాల్లో లాంచీలు తిప్పితే ఉపయోగం ఉంటుంది. ఒకప్పుడు అంతర్వేది తిరునాళ్లు అంటే మొత్తం హడావిడి పట్టణంలోనే ఉండేది. ఆ రోజులు ఎంతో సరదాగా ఉండేవి. – సీహెచ్ రెడ్డప్ప ధవేజీ, సాహితీవేత్త లాంచీల ఓనర్లు సంప్రదించలేదు గతంలో అంతర్వేది తిరునాళ్లకు నరసాపురం నుంచి లాంచీలు తిరిగేవి. భద్రాచలం, కాకినాడ ప్రాంతాల నుంచి లాంచీల యజమానులు ముందుగానే రెవెన్యూ శాఖను సంప్రదించేవారు. కొన్నేళ్ల నుంచి లాంచీలు తిరగడంలేదు. ఈ ఏడాది మమ్మల్ని ఎవరూ సంప్రదించ లేదు. ప్రస్తుతం కరోనా ఉధృతి ఉంది. పై అధికారుల అనుమతితో ఏదైనా జరగాలి. – కందుల సత్యనారాయణ, ఇన్చార్జ్ తహసీల్దారు -
ఫిబ్రవరి 8 నుంచి అంతర్వేది ఉత్సవాలు
సాక్షి, సఖినేటిపల్లి: అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. దేవస్థానం కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో విడుదల చేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఆలయంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు ఉత్సవాల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 8న రథసప్తమి, 11న స్వామి కల్యాణం, 12న రథోత్సవం, 16న పౌర్ణమి సముద్రస్నానం, 17న తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాలరాజా బహద్దూర్, అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జి.ప్రసాద్, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఈఓ బి.వెంకటేశ్వరరావు, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. (చదవండి: తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్) -
నయనానందకరంగా అంతర్వేది 'రథయాత్ర'
అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి రథోత్సవం మంగళవారం నయనానందకరంగా సాగింది. సంపద్రాయబద్ధంగా సాగిన రథయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు అంతర్వేదికి పోటెత్తారు. మెరక వీధిలో మధ్యాహ్నం 2.30 గంటలకు రథయాత్ర మొదలైంది. కళ్యాణమూర్తులను రథం మీద ఉంచి పురవీధుల్లో ఊరేగింపుగా తోడ్కొని వెళ్లారు. స్వామివారు కళ్యాణ అనంతరం రథం మీద వెళ్లి తన సోదరి గుర్రాలక్కకు చీర, సారె పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. మొగల్తూరుకు చెందిన ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్, ముఖ్యఅతిథిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.. కొబ్బరికాయలు కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇటీవల కొంతమంది గుర్తుతెలియని దుండగులు అంతర్వేది రథాన్ని దగ్ధంచేయడం.. రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన కొత్త రథాన్ని తయారుచేయించడం.. అనంతరం కళ్యాణోత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ దీనిని ఇటీవలే ప్రారంభించడం తెలిసిందే. కాగా, కొత్త రథాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారి కళ్యాణ సమయం కన్నా రథయాత్ర సమయంలోనే ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ముస్తాబు చేసిన కొత్తరథాన్ని తాకి పులకించిపోయారు. పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు మరోవైపు.. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున సముద్ర సంగమ ప్రాంతంలో జరిగిన పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. అంతర్వేది బీచ్ నుంచి సంగమ ప్రాంతం వరకు సుమారు కిలోమీటరు మేర భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.13 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సోమవారం అర్ధరాత్రి కల్యాణ వేదిక వద్ద అసంఖ్యాకమైన భక్తుల సమక్షంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో భక్తులు హర్షధ్వానాలు చేశారు. -
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేడుక
-
అంతర్వేదిలో ఉట్టిపడిన ఆధ్యాత్మిక శోభ
-
అల.. అంతర్వేదిలో.. కొంగొత్త 'రథ'సప్తమి
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రథసప్తమి రోజున ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ గావించారు. సీఎం జగన్ ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి రథాన్ని లాగే వరకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబరు 5న స్వామి వారి రథాన్ని దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. కల్యాణోత్సవం నాటికి కొత్త రథం తయారవుతుందని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఐదు నెలల్లోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త రథాన్ని తయారు చేయించారు. కల్యాణోత్సవాల నేపథ్యంలో నూతన రథాన్ని ప్రారంభించారు. స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ సీఎం వైఎస్ జగన్.. ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న రాజగోపురానికి నమస్కరిస్తూ.. గంటా మంటపం, ముఖ మంటపం మీదుగా అంతరాలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతరాలయంలో స్వామికి ప్రీతిపాత్రమైన వింజామర సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. కోవిడ్–19 నేపథ్యంలో మార్చి 20 నుంచి రద్దు చేసిన అంతరాలయ దర్శనాన్ని.. ప్రస్తుతం కల్యాణోత్సవం సందర్భంగా సీఎం ద్వారా తిరిగి పునరుద్ధరించారు. అర్చకులు సీఎం జగన్ గోత్ర నామంతో అర్చన గావించారు. మంత్రపుష్ప సమర్పణ అనంతరం హారతిని సీఎం భక్తి భావంతో కళ్లకు అద్దుకుని నమస్కరించారు. అంతకు ముందు ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి శ్రీనివాస్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితులు చింతా వేంకట శాస్త్రి, అర్చకులు శ్రీను తదితరులు ధ్వజ స్తంభం వద్ద ఉన్న సింహద్వారం వద్ద ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజలు ♦ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం రాజ్యలక్ష్మీ అమ్మవారి ఉపాలయంలోని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ♦ఆశీర్వచన మంటపం వద్ద అర్చకులు, వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. లక్ష్మీనరసింహ స్వామి చిత్ర పటాన్ని అందజేశారు. అర్చకులు అందించిన స్వామి వారి ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలిని ముఖ్యమంత్రి స్వీకరించారు. ♦అనంతరం దేవస్థానంలో సుదర్శన హోమం జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, నూతన రథం తయారీకి సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిలకించారు. కొత్త రథం తయారీలో వినియోగించిన బస్తర్ టేకు సేకరణ మొదలు.. చివరలో సంప్రోక్షణ ప్రక్రియ వరకు ఆయా దశలకు సంబంధించిన ఫొటోలను ఆసక్తిగా వీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన రథం తయారీని ప్రశంసించారు. ♦అనంతరం ఆలయానికి తూర్పు వైపున ఉన్న రాజగోపురం వద్ద నుంచి ఉన్న స్వామి వారి 38 ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను దేవదాయ శాఖ కమిషనర్ అర్జున్‌రావు ముఖ్యమంత్రికి వివరించారు. హారతి తీసుకుని నమస్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి పసుపు, కుంకుమ పెట్టి.. కొబ్బరి కాయ కొట్టి.. ♦స్వామి సన్నిధి నుంచి పశ్చిమ రాజగోపురం ద్వారా సీఎం.. రథం వద్దకు చేరుకున్నారు. స్వయంగా పసుపు, కుంకుమలతో నూతన రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరి కాయ కొట్టారు. ఇతర భక్తులతో కలిసి రథాన్ని కొద్ది దూరం లాగారు. అనంతరం ఆలయానికి నలువైపులా ఉన్న భక్తులకు నమస్కరిస్తూ ముందుకు కదిలారు. ♦ఈ కార్యక్రమంలో సీఎం వెంట దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోష్, వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నృసింహుని రథానికి పూలదండ వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చదవండి: (మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..) (కోనసీమలో పల్లెపోరు) -
అంతర్వేదిలో నూతన రథం ప్రారంభోత్సవం
-
అంతర్వేది: నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం... అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారిని దర్శించుకున్న సీఎం.. అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు. 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు. చదవండి: యోధులారా వందనం : సీఎం జగన్ మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు.. -
రేపు అంతర్వేదికి సీఎం వైఎస్ జగన్
కాకినాడ సిటీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం 10.40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.30 నుంచి 11.35 గంటల వరకూ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 గంటల వరకూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారు. 11.45 నుంచి 11.50 గంటల వరకూ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 11.50 గంటలకు వేద పండితుల నుంచి ఆశీర్వచనం, శేషవస్త్రం, ప్రసాదం స్వీకరిస్తారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని సందర్శించి ప్రారంభిస్తారు. 12.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి తాడేపల్లి వెళతారు. హెలిప్యాడ్ పనుల పరిశీలన సఖినేటిపల్లి: పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో హెలిప్యాడ్ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర జి.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్వేది పర్యటనకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్ద, పరిసరాల్లో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ మాధవరెడ్డి, సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఇతర అధికారులతో సమీక్షించారు. పెట్రోలింగ్‌కు నాలుగు ఇంజిన్ బోట్లు సిద్ధం చేయాలని ఫిషరీస్ జేడీ పీవీ సత్యనారాయణకు ఎస్పీ సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గంలోని ప్రధాన కూడళ్లలో కచ్చితంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రత్యేక భద్రతా సిబ్బంది కోరారు. ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గం, రథం వద్ద కార్యక్రమాలపై కూడా దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులతో ఎస్పీ, జేసీ సమీక్షించారు. సంబంధింత అంశాలను దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, అసిస్టెంట్ కమిషనర్ భద్రాజీ, ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు వివరించారు. ఇదిలా ఉండగా తుది దశకు చేరుకున్న ఉత్సవాల ఏర్పాట్లపై జేసీ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వామి సన్నిధిలో సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ లక్ష్మీరెడ్డి పూజలు నిర్వహించారు. మంత్రి వేణు సందర్శన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న స్వామి కల్యాణోత్సవాల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: అనంతలో అమానుషం: టీడీపీకి ఓటు వేయలేదని.. పేదలపై భారం మోపలేం.. -
19న అంతర్వేదికి సీఎం జగన్
సఖినేటిపల్లి: రథసప్తమి పర్వదినాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 19వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి దర్శనార్థం రానున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం అంతర్వేదిలో సిద్ధమైన కొత్తరథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రథసప్తమి రోజున భక్తుల ద్వారా రథాన్ని బయటకు తీసే అవకాశం ఉందని, ఈ తరుణంలో అంతర్వేదికి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరగా అంగీకరించారని చెప్పారు. రథం దగ్ధమైన ఘటనపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసిన తరుణంలో భక్తుల మనోభావాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిందన్నారు. అయితే, సీబీఐ దీనిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రథానికి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మూడో రోజును పూర్ణాహుతి చేసి, అన్నిరకాల పూజలు చేయిస్తామని చెప్పారు. దీనికి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విచ్చేస్తున్నారన్నారు. -
అంతర్వేది రధానికి ఫిబ్రవరి 13న సంప్రోక్షణ
సాక్షి, కాకినాడ: అంతర్వేదిలో నూతనంగా నిర్మించిన రధానికి ఫిబ్రవరి 13వ తేదీన సంప్రోక్షణ కార్యక్రమం చేపడతామని ఆలయ అధికారులు వెల్లడించారు. సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విశాఖ శారదా పీఠాధిపతులను ఆహ్వానించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 11 నుంచి మూడు రోజుల పాటు సంప్రోక్షణ ప్రక్రియ చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, ఆగమానుసారం చేపట్టాలని స్వామి స్వరూపానందేంద్ర సూచించారు. కాగా, 62 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రధం గతేడాది సెప్టెంబర్ 6న అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
ఆలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నాం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ఆలయాలన్నీ సర్వే చేసి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ, రాష్ట్ర దేవాలయాల పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన సదస్సులో డీజీపీ మాట్లాడారు. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. ఆలయాల్లో వరుసగా ఘటనలు జరుగుతుండటంతో పోలీస్ విభాగం అప్రమత్తమై.. దేవాలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుందని వివరించారు. 13 జిల్లాల్లో ఉన్న 59 వేల ఆలయాలను సర్వే చేసి.. వాటికి జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. 47,734 ఆలయాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 23,832 ఆలయాల్లో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాల్లో ఘటనలకు సంబంధించి.. 1,893 మందిని విచారించామని తెలిపారు. 198 కేసుల్లో 373 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలే మూలమన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పాలక మండళ్లు, ఈవోలు చర్చించుకుని ఆలయాల్లో భద్రత ప్రమాణాలను మెరుగుపరచుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆలయాల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు సూచించారు. గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాలతో పాటు పురాతన ఆలయాలపై తగిన నిఘా ఉంచాలన్నారు. దేవదాయ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ మాట్లాడుతూ.. కార్యనిర్వహణ అ«ధికారులు, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఆలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న డీజీపీ సవాంగ్‌కు దుర్గగుడి ఈవో సురే‹Ù.. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు డీజీపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, నగర పోలీస్ కమిషనర్ బత్తుల శ్రీనివాసులు, సిట్ అధికారి జీవీజీ అశోక్‌కుమార్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ డి.పాల్‌రాజ్, డీసీపీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్వేది నూతన రథానికి ట్రయల్ రన్
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రంలో నూతన రథానికి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. రథాన్ని మలుపు తిప్పేందుకు అమర్చిన హైడ్రాలిక్ జాకీ సిస్టం, రథ చక్రాలకు అమర్చిన బ్రేక్ సిస్టంలను పరిశీలించేందుకు దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆలయాలపై దాడుల ఘటనలపై సిట్ విచారణ వేశాక ప్రతిపక్షాల కుట్రలు భగ్నమవుతున్నాయని చెప్పారు. ఎవరెవరు కుట్రపూరిత ఆలోచనలో ఉన్నారు? ఆ కుట్రలు భగ్నమై ఎవరెవరు బయటపడుతున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఆలయాలపై దాడులు చేసినందుకు గాను ఫలితాన్ని అనుభవించే రోజు ప్రతిపక్షాలకు కచ్చితంగా వస్తుందని మంత్రి హెచ్చరించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణపై ప్రతిపక్ష నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారని, దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ఏపీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ పాల్గొన్నారు. -
అంతర్వేది నూతన రథం ట్రయల్ రన్
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన రథం ట్రయల్ రన్‌ను అధికారులు ఆదివారం నిర్వహించారు. రథం బ్రేకులు, జాకీలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తక్కువ సమయంలో నూతన రథాన్ని తయారు చేయించామని తెలిపారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు’ దేవుళ్లు, ఆలయాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై విచారణను సీబిఐకి అప్పగించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే దేవాలయాల పై ప్రతిపక్షాలు దుష్ట రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్ -
నరసన్న రథం రెడీ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ప్రకటించిన గడువు కంటే ముందుగానే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయించింది. 2021లో జరగబోయే స్వామివారి కల్యాణోత్సవం నాటికి కొత్త రథాన్ని సిద్ధం చేస్తామని భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. అందుకు అనుగుణంగా రెండున్నర నెలల్లోనే రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. రథానికి రంగులు వేసే పని ఒక్కటే మిగిలి వుంది. నరసన్న కల్యాణోత్సవ సమయానికి రథం లేదనే మాట రానివ్వకూడదని ప్రభుత్వం దీని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండున్నర నెలల్లోపే.. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం జూన్ 8 అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దగ్ధమైన విషయం విదితమే. దీనిని ఆసరా చేసుకుని కొన్ని రాజకీయ శక్తులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడితో ఆగిపోకుండా భక్తుల మనోభావాలను పరిరక్షించే లక్ష్యంతో ఘటన చోటుచేసుకున్న రెండో రోజే ప్రత్యేకత కలిగిన కొత్త రథం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విలువైన కలప, ఇతర సామగ్రిని ఆగమేఘాలపై సేకరించి అక్టోబర్ 21న రథం నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు రెండున్నర నెలల్లోపే పూర్తి చేయించారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న జరిగే రథోత్సవం నాటికి పూర్తి చేయాలని సంకల్పించగా.. అంతకంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా తమ మనోభావాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం రథానికి సోమవారం ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతమైంది. సంప్రదాయం ప్రకారం అంతర్వేది పల్లిపాలేనికి చెందిన మత్స్యకారులే రథాన్ని ప్రయోగాత్మకంగా లాగారు. రథానికి వారే పసుపు, కుంకుమ అద్ది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఏడంతస్తులు.. 43 అడుగుల ఎత్తు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 43 అడుగుల ఎత్తున.. 7 అంతస్తులతో రథ నిర్మాణం పూర్తయ్యింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రథానికి బ్రేకులు, జాకీ కూడా ఏర్పాటు చేశారు. జాకీ ఏర్పాటు చేయడం వల్ల రథం సులభంగా మలుపు తిరిగేందుకు వీలవుతుంది. బ్రేకుల ఏర్పాటుతో ప్రమాద రహితంగా ఉంటుంది. మొత్తంగా రథం నిర్మాణం కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. పాత రథానికి బర్మా టేకు వాడగా.. నూతన రథ నిర్మాణంలో 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు. ఇంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం ఇదే తొలిసారి నేను తయారు చేసిన వాటిలో 81వ రథం ఇది. దీనికి 70 రోజులు పట్టింది. నా 21 ఏళ్ల రథాల తయారీ జీవిత ప్రస్థానంలో ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇంత వేగంగా రథాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. – సింహాద్రి గణపతిశాస్త్రి, రథం తయారీదారు చాలా బాగుందయ్యా! ఇంత తక్కువ వ్యవధిలో రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరో 150 ఏళ్ల వరకూ ఈ రథానికి ఢోకా లేదు. – మల్లాడి వెంకటరెడ్డి, మత్స్యకారుడు, అంతర్వేది పల్లిపాలెం -
అంతర్వేది : నూతన రథం ట్రయల్ రన్
సాక్షి, సఖినేటిపల్లి: తూర్పుగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం పూర్తయింది. ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. మూడు నెలల రికార్డు సమయంలో అధికారులు ప్రధాన నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంత్రి వేణు గోపాల కృష్ణ ,జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా రథాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు నేడు రథం ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా నిర్మితమవుతున్న రథాన్ని తాళ్ళుతో లాగుతూ బయటకు తీసుకు వెళ్లారు. రధం సునాయాసంగా కదలడంతో ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. పాత రథానికి భిన్నంగా కొత్త రథంలో బ్రేక్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రధం కింద జాకీలు అమర్చి అవసరమైన చోట సునాయసంగా వెనక్కి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. నాలుగు నెలల క్రితం రథం దగ్ధమైన విషయం సంగతి విదితమే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త రథం నిర్మాణం, రథశాల మరమ్మతులకు తక్షణం రూ.95 లక్షలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో పాత రథం నమూనాలోనే రథం 21 అడుగుల పొడవు,16 అడుగుల వెడల్పు, 41 అడుగుల ఎత్తున, ఆరు చక్రాలతో కొత్త రథం డిజైన్ దేవదాయ శాఖ ఖరారు చేసింది. నూతనరథం తయారీకి సుమారు 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు. కొత్త రథం తయారీ పనులకు సెప్టెంబర్ 27న జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ పనులను దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు 90 రోజుల్లో పూర్తి చేశారు. పెయింటింగ్ మినహా ఇతరపనులన్నీ పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినమైన శుక్రవారం రథానికి శిఖరం కూడా అమర్చారు. -
అంతర్వేది: నూతన రథాన్ని పరిశీలించిన మంత్రి
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన రథాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతోనే రథం పూర్తయిందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిరంతర పర్యవేక్షణ తోనే రథం రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. రథం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరైతే బాగుంటుందన్నారు. నూతన రథాన్ని పాత షెడ్లో ఉంచాలా లేదా అన్న విషయంపై నిర్ణయిం తీసుకోలేదని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. -
ఫిబ్రవరి 23న అంతర్వేదిలో ఉత్సవాలు
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన రథం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున రావు తెలిపారు. డిసెంబరు నెలాఖరు నాటికి రథం నిర్మాణం పూర్తవుతుందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక రథోత్సవం ఫిబ్రవరి 23న వస్తుందని, ఆ రోజు నూతన రథంతో ఉత్సవాలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంప్రదాయ మరియు ఆచార పద్ధతులన్నింటినీ అనుసరించి నూతన రథం రూపుదిద్దుకుంటోందని చెప్పారు. అధిక నాణ్యత గల బస్తర్ టేక్ వుడ్‌ను రథం తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ‘అంతర్వేది’ రథ నిర్మాణం ప్రారంభం) -
‘అంతర్వేది’ రథ నిర్మాణం ప్రారంభం
మలికిపురం: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటీవల దగ్ధమైన రథం స్థానంలో నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానార్చకుడు పి.కిరణ్, అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పనులు ప్రారంభించారు. రథం తయారీకి వినియోగించే టేకు కలపకు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సుమారు రూ. కోటి వ్యయంతో ఈ రథాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే రథం తయారీకి అవసరమైన ఖరీదైన బస్తర్ టేకు కలపను రావులపాలెంలో కొనుగోలు చేసి, ఆలయం వద్దకు తరలించారు. ► రథం పనులు నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుతూ ఆలయం ఎదుట ఉన్న కల్యాణ మండపంలో తొలుత శ్రీ సుదర్శన నారసింహ మహాశాంతి హోమం వైభవంగా నిర్వహించారు. ► మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. రానున్న స్వామివారి కల్యాణోత్సవాల నాటికి ఎటువంటి ఆటంకాలూ లేకుండా రథం తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ► కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎంపీ అనురాధ, ఎమ్మెల్యేలు రాపాక, సతీష్‌కుమార్, చిట్టిబాబు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అంతర్వేది నూతన రథం నిర్మాణానికి శ్రీకారం
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేదిలో దగ్ధమయిన రథం స్థానంలో కొత్త రథం నిర్మాణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. తొలుత తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు కృష్ణదాస్, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ , ఎమ్మెల్యేలు సతీష్, రాపాక వర ప్రసాదరావు హాజరయ్యారు. రథం నిర్మాణానికి ప్రభుత్వం రూ.95 లక్షలు కేటాయించింది. 1330 ఘనపుటడుగుల బస్తర్ టేకు కలప రథం నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. మూడు నెలల్లో రథం నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు సంకల్పించారు. అచ్చం పాత రథాన్ని పోలినట్టే నూతన రధాన్ని నిర్మిస్తున్నామని దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. రోజూ అవసరమైన మేరకు కార్మికులను ఏర్పాటు చేసుకుని నూతన రథాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి కల్లా రధాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అంతర్వేది ఘటనపై విచారణ జరుగుతోందని.. దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధికోసం కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ లోపు రథం నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. -
అంతర్వేది నూతన రథం నిర్మాణానికి శ్రీకారం
-
మత విద్వేషాలే లక్ష్యంగా బాబు ఎల్లో వైరస్
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడికి తన స్క్రీన్‌ప్లేపై గొప్ప నమ్మకం. కానీ తానలా సమర్పించుకున్న సినిమాలన్నీ ఎల్లో స్క్రీన్లపై పదేపదే అరగదీయటం వల్ల జనంలోకి వెళ్లాయి తప్ప అది తన గొప్పతనం కాదని మొన్నటి ఎన్నికల్లో బాగానే తెలిసొచ్చింది. ఆ స్క్రీన్ల సీను అయిపోయిందని కూడా అర్థమయింది. తరవాత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలెన్ని చేసినా కలిసి రాకపోవటంతో ఇపుడు పెద్ద కుట్రకే తెరతీసినట్లు కనిపిస్తోంది. మత సామరస్యానికి ప్రతీకలా ఉండే రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే తప్ప తన పాచికలు పారవనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికోసం ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉండే కొందరిని అవసరార్థం తెరమీదికి తెస్తున్నట్లు కనిపిస్తోంది. జన సంచారం లేనిచోట్ల తన మనుషులతో తరచు ఏదో ఒకటి చేయించటం... దానిపై తనే ట్వీట్ చేయటం... దానికి ఎల్లో మీడియా చిలవలు పలవలు జోడించటం... టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగటం... ఇదే బాబు వ్యూహమని స్పష్టంగా తెలిసిపోతోంది. అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమయినప్పటి నుంచీ బాబు మరింత చురుగ్గా ఈ విద్వేష రాజకీయాలకు ప్రాణం పోస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ఘటనపై ప్రభుత్వం వెనువెంటనే స్పందించి.. ఈవోను సస్పెండ్ చేసి, కొత్త రథానికి నిధులు మంజూరు చేసి... విచారణకు ఆదేశించినా బాబు రాద్ధాంతం మాత్రం ఆగలేదు. టీడీపీతో పాటు జనసేన, బీజేపీల్లోని తమ వారిని ఉపయోగించుకుని స్థానికంగా ఉన్న చర్చిపై రాళ్లు వేయించారు. అద్దాలు పగలగొట్టారు. బాబు సేన హద్దులు మీరటంతో కుట్రను బయటపెట్టడానికి కేంద్రం పరిధిలోని సీబీఐ దర్యాప్తునకూ రాష్ట్రం సరేనంది. దీంతో బీజేపీ మిన్నకున్నా చంద్రబాబు, బీజేపీలోని ఆయన అనుచర గణాలు మాత్రం నిత్యం ఏదో ఒక కుట్రకు తెరతీస్తూనే వస్తున్నారు. నిత్యం ఏదో ఒక మూల ఆలయాలు, చర్చిల వద్ద చిన్నపాటి ఘటనలు జరుగుతుండటం... జనసంచారం లేని ప్రాంతాల్లో దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం, మసిపూయడం వంటి ఘటనలకు వరసగా తెగబడుతున్న ముఠాల వెనక ఎవరున్నారన్నది రాజకీయంగా విశ్లేషిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఘటనలు జరిగిన కాసేపటికే టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లి పరిశీలించడం, చంద్రబాబు వెంటనే దాన్ని హైదరాబాద్ నుంచి జూమ్ ఆన్లైన్ సమావేశంలోనో, ట్విట్టర్లోనో ఖండించడం, రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతింటోందని, హిందూ మతాన్ని రక్షించాలని కోరడం, ఎల్లో మీడియా దానిపై చర్చలు సైతం నిర్వహిస్తూ ఆజ్యం పోయటం ఇవన్నీ వారి ఉద్దేశాల్ని చెప్పకనే చెబుతున్నాయి. – విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయమైన ఘటనలోనూ మత రాజకీయాలు రాజేసేందుకు చంద్రబాబు, టీడీపీ నాయకులు విశ్వప్రయత్నం చేశారు. – కర్నూలు జిల్లా పత్తికొండలోనూ ఇదే వరస. ఇలా వరుస ఘటనలు జరగటం... ఎక్కడ ఏమైనా ముందుగా చంద్రబాబుకు అనుకూలంగా ఉండే వ్యక్తులు, టీడీపీ నేతలే ఆగమేఘాలపై వెళ్ళి హడావుడి చేయటం కుట్రల్ని తేటతెల్లం చేసేదే. వీటిపై చంద్రబాబు వెనువెంటనే స్పందించడం, విచారణ కోరడం, ప్రతిరోజూ అదే అంశంపై మాట్లాడడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నది నిపుణుల మాట. డిక్లరేషన్‌పై ఇప్పుడెందుకు రాద్ధాంతం తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి వెళ్లిన సందర్భంలోనూ చంద్రబాబు ఇలాంటి విద్వేషాలకే ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. డిక్లరేషన్ పేరిట రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నిజానికీ సంప్రదాయం అనాదిగా రాజుల కాలం నుంచీ కొనసాగుతున్నదే. అదిప్పుడు ముఖ్యమంత్రులకూ వర్తిస్తోంది. అత్యున్నత స్థాయిలోని వ్యక్తులు ఆలయానికి వెళితే దానివల్ల మరింత మంది ముఖ్యులు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారని... రాజులు, ముఖ్యమంత్రులు ఇలా పూజలు చేయటం రాజ్యాలకు, రాష్ట్రాలకు... అక్కడి ప్రజలకు మంచిదని ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నానేది ఆధ్యాత్మిక వేత్తల మాట. “్ఙఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గతేడాది కూడా ఇది చేశారు. మరి అప్పుడెప్పుడూ మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు లేవనెత్తారంటే ఆయన లక్ష్యం మత విద్వేషాలు రెచ్చగొట్టడం, రాజకీయయం చేయటమేనని తెలియటం లేదా?’’ అన్నది వారి ప్రశ్న. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు కూడా ప్రతిపక్ష నేతగా పలుమార్లు తిరుమల వెళ్లి శాస్త్రోక్తంగా స్వామిని దర్శించుకున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు, పాదయాత్ర ముగిశాక కూడా తిరుమల వెళ్లారు. అప్పుడెప్పుడూ లేని డిక్లరేషన్ అంశాన్ని ఈ బ్రహ్మోత్సవాల ముందు తెచ్చారని కూడా వారు గుర్తుచేస్తున్నారు. ఇక మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల విషయంలో కూడా ఆయన ఏ సందర్భంలో అన్నారనేది ఏమాత్రం పట్టించుకోకుండా కొంత భాగానే పట్టుకుని రాద్ధాంతం చేయటం వెనక బీజేపీ– వైసీపీ మధ్య అర్జెంటుగా చిచ్చు రేపాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేమీ కనిపించటం లేదని వారు పేర్కొంటున్నారు. దీనికి బీజేపీలోని బాబు మనుషులుగా ముద్రపడ్డవారు మాత్రమే స్పందించటం... ఆధ్యాత్మిక వేత్తల పేరిట కొందరిని అర్జెంటుగా తెరపైకి తెచ్చి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయించటం ఇవన్నీ బాబు స్కెచ్‌లో భాగమనేది జనం కూడా గ్రహిస్తున్నారనేది విశ్లేషకుల భావన. ► తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని మద్యం సేవించిన కొందరు వ్యక్తులు కూలదోశారు. కళాశాలలో తమను ఉండనివ్వలేదన్న కోపంతో మద్యం మత్తులో వారు ఈ పనిచేసినట్లు తేలింది. కానీ టీడీపీ నాయకులు అక్కడికెళ్లి మతం రంగు పులిమి నానా రాద్ధాంతం చేశారు. ► రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ఓ వ్యక్తి ఇంటి ముందున్న విఘ్నేశ్వరుడి ప్రతిమను మలినం చేశారని టీడీపీ నాయకులు అక్కడికెళ్లి గొడవ చేశారు. కానీ ఆ ఇల్లు టీడీపీ మద్దతుదారుడిదే. దీన్నిబట్టి కుట్ర ఎవరిదో తెలియకమానదు. ► గుంటూరులో టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ కుటుంబం తమ ఇంట్లోని హనుమాన్ విగ్రహాన్ని కావాలని బయటపడవేసి ఎవరో చేసినట్లు హడావుడి చేశారనేది సోషల్ మీడియా వేదికగా బయటపడింది. -
అంతర్వేది రథం నిర్మాణానికి వేగంగా ఏర్పాట్లు
-
శరవేగంగా నూతన రథం నిర్మాణ పనులు
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది నూతన రథం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా రావులపాలెం టింబర్ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్ టేకు కలప దుంగలను అధికారులు గుర్తించారు. 21 అడుగుల పొడవైన దూలాలుగా వాటిని కోయించే ప్రక్రియ ప్రారంభమైందని, రథం నిర్మాణానికి 1330 ఘనపుటడుగుల కలప వినియోగిస్తున్నామని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. (చదవండి: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు) పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇటీవల వివరించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం) -
అందుకే ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: దేవాలయాలలో అక్కడక్కడ జరిగే కొన్ని ఘటనలతో రాజకీయ ప్రయోజనం పొందాలనుకుని కొన్ని శక్తులు ఏకమవుతున్నట్లు అనిపిస్తోంది అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ, ‘దేవాలయాల్లో కావాలనే ఇలాంటి సంఘటనలు సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతుందని అనిపిస్తోంది లేకపోతే రోజు దేవాలయాలలో ఏదో ఒకటి ఎందుకు జరుగుతుంది. అంతర్వేది ఘటన విషయంలో దేశంలో ఏ ప్రభుత్వం స్పందించని విధంగా ఏపీ ప్రభుత్వం స్పందించింది. అధికారులపై చర్యలు తీసుకుంది. విచారణ జరుపుతోంది. కొత్త రాజధాని నిర్మాణానికి ఆదేశించింది. అలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే పథకాలను చూసి ఓర్వలేక వాటిపై ప్రజల్లో జరిగే చర్చను అడ్డుకోవడానికి ప్రతి పక్షాలు ప్రయత్నిస్తున్నాయని అనిపిస్తోంది. ప్రతిపక్షాల పాచికలు వేస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ గోదావరిలో వేణుగోపాల స్వామి రథం తగలబడింది. అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజలే చందాలు వేసుకుని రథాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలపై పోరాటాలు, చేసి ప్రజల కోసం నిలబడి ఓట్లు తెచ్చుకోవాలి కానీ ఇలాంటి ఘటనల ద్వారా అడ్డదారుల్లో ఓట్లు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రతిపక్షాలో కనిపిస్తుంది. ప్రతిపక్షాలు చేసే దుష్ట రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు’ అని అన్నారు. చదవండి: ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి -
‘ఛలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదు’
సాక్షి, పశ్చిమగోదావరి : సెప్టెంబరు అయిదో తేదిన అంతర్వేది రథం కేసును సీబీఐకు అప్పగించడం జరిగిందని ఏలూరు రేంజ్ డీఐజీ మోహానరావు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పరంగ కొత్త రథం తయారు అవుతుందని వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు ఛలో అమలాపురం అంటు పిలుపునిస్తున్నాయని, ఛలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కోనసీమ ప్రశాంతమైన జిల్లా అని, కోవిడ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదన్న విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీఐజీ ఈ కేసులో అనుమానితులని విచారిస్తున్నామన్నారు. (‘గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదు’) -
అంతర్వేది: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు
సాక్షి, అమరావతి: పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసింది. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. అంతర్వేది ఆలయ రథం నిర్మాణానికి సంబంధించి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ అర్జునరావుతో సమీక్షించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు జరగనున్నాయని.. అప్పటిలోగా కొత్త రథ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు వివరించారు. అంతర్వేదిలో దర్శనాలు నిలుపుదల సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 20 వరకు అధికారులు దర్శనాలను నిలిపివేశారు. అంతర్వేది, పరిసర ప్రాంతాల్లో కరోనా ఉధృతి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ సోమవారం తెలిపారు. స్వామి వారికి నిత్యం జరిగే కైంకర్యాలు ఏకాంతంగా అర్చకులు నిర్వహిస్తారని చెప్పారు. చదవండి: టీడీపీ దుష్ర్పచారాన్ని నమ్మొద్దు -
ఏడంతస్తులు.. 41 అడుగుల ఎత్తుతో నిర్మాణం
సాక్షి, విజయవాడ: వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా అందరి అభిప్రాయాల మేరకు.. ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాలని అధికారులను అదేశించిన్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం బ్రాహ్మణ వీధి దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ పి.అర్జునరావుతో మంత్రి వెలంపల్లి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు. రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించామన్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించామన్నారు. (చదవండి: ఈ అలజడి ఎవరి మనోరథం?) ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తులుగా రూపొందిస్తున్నమని వెలంపల్లి తెలిపారు. కొత్త రథం నిర్మాణంతో పాటు.. రథశాల మరమ్మతుల నిమిత్తం 95 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు మంత్రి వెలంపల్లి. సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావు, ఎస్ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అందుకే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ
సాక్షి, తిరుపతి: అంతర్వేది ఘటనలో నిజాలు నిగ్గు తేలాలి అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. అందుకే దీనిపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. చంద్రబాబులా పిరికిపంద రాజకీయాలు సీఎం జగన్‌కు తెలియవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు గతంలో రాష్ట్రానికి సీబీఐ అవసరం లేదన్నారు. టీడీపీ పాలనలో 40 ఆలయాలను కూల్చివేశారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టన పెట్టుకున్నారు. బాబు హయాంలో దుర్గగుడి, శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్రపూజలు జరిగాయి. చంద్రబాబు పాలనలో తిరుమలలో వేయి కాళ్ల మండపం కూల్చేశారు. కానీ ఎన్నడూ చంద్రబాబు సీబీఐ విచారణ కోరలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు’ అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: 100 ఏళ్లు ఉండేలా కొత్త రథం) -
100 ఏళ్లు ఉండేలా కొత్త రథం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/మలికిపురం: తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కొత్త రథం నిర్మాణం కోసం రూ.95 లక్షల అంచనాతో దేవదాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇందుకోసం నియమించిన దేవదాయ శాఖ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్ రెండు రోజులుగా అంతర్వేది ఆలయాన్ని పరిశీలించి కొత్త రథం నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. దేవదాయ, అగ్నిమాపక, ఇతర శాఖల సమన్వయంతో వారం, పది రోజుల్లో డిజైన్‌కు తుది రూపమివ్వనున్నారు. 1,300 ఘనపుటడుగుల టేకు అవసరం ► రథం నిర్మాణం కోసం 1,300 ఘనపుటడుగుల నాణ్యమైన ముదురు టేకు కలప అవసరమని లెక్క తేల్చారు. రథం 21 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో తయారు చేయాలని నిర్ణయించారు. ► విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో టేకు కలప కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలో టింబరు డిపోను పరిశీలించారు. సింహాచలం అడవుల్లోని 25 నుంచి 30 సంవత్సరాల కిందట తీసిన పాత కలప కోసం ప్రయత్నిస్తున్నారు. ► దగ్ధమైన రథానికి వినియోగించిన టేకు బర్మా నుంచి తెచ్చారు. ఆ రథం నిర్మాణం జరిగి 54 ఏళ్లు పూర్తయినా చెక్కు చెదర లేదు. అందుకు తగ్గట్టుగానే కొత్త రథం సుమారు 100 సంవత్సరాల మన్నిక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► కొత్త రథానికి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రంలో 80 ర«థాల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించిన గణపతి ఆచారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించి... ► ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరుగా రథానికే నీటి సరఫరా ఉండేలా ప్రత్యేక పైపులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రథం ఉంచే షెడ్డుకు కూడా అవసరాన్ని బట్టి నిరంతరం నీటి సరఫరా జరిగేలా పైపులుండేలా డిజైన్‌ను రూపొందిస్తున్నారు. ► నాణ్యత, రక్షణ విషయంలో రాజీపడకుండా రథం నిర్మాణానికి రూ.1.10 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దగ్ధమైన రథం 39.7 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు ఉండేది. ప్రస్తుత కొత్త రథం 40 నుంచి 41 అడుగులతో నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ► వచ్చే ఫిబ్రవరిలో జరిగే స్వామి ఉత్సవాల కంటే ముందుగానే రథం సిద్ధం చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. 10 రోజుల్లో కొత్త డిజైన్ కొత్త రథం డిజైన్ కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో దేవదాయ, అటవీ, అగ్నిమాపక, పోలీసు శాఖ ప్రతినిధులు ఉన్నారు. పది రోజుల్లో కొత్త రథం డిజైన్ కొలిక్కి వస్తుంది. నాణ్యమైన కలప లభ్యతను బట్టే కొత్త రథం డిజైన్ ఉంటుంది. – వై భద్రాజీ రావు, ఈవో, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, అంతర్వేది -
దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా
సాక్షి, అమరావతి: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీలను డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను జియో ట్యాగింగ్ చేయాలని సూచించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీజీపీ ప్రకటనలోని అంశాలు.. ► పెట్రోలింగ్‌ను పటిష్టపరచడంతో పాటు సోషల్ మీడియా పుకార్లపై నిఘా పెట్టాలి. మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతిభద్రతలు కాపాడేందుకు సహకరించేలా అన్ని చర్యలు తీసుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం– 2013 ప్రకారం దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు అమర్చాలి. సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. దేవాలయాలకు ఫైర్, ఎలక్ట్రిసిటీ ఆడిట్ నిర్వహించడంతో పాటు రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలి. ► ఈ అంశాలపై నిర్వాహకులకు పోలీసు సిబ్బంది అవగాహన కల్పించాలి. ► అంతర్వేది ఆలయంలో స్వామి వారి రథం అగ్నికి ఆహుతవ్వడం అత్యంత దురదృష్టకరం. ► ‘ఈ ఘటనను ఆసరాగా చేసుకుని మత సామరస్యానికి ప్రతీకగా ఉండే రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. అని డీజీపీ పేర్కొన్నారు. ఈమేరకు ట్వీట్ కూడా చేశారు. -
నిజం నిగ్గు తేలాల్సిందే
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కె. పెంటపాడు గ్రామంలో చారిత్రక శ్రీగోపాలస్వామి ఆలయ రథం దగ్ధమైంది. 2018 జనవరిలో విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయి. అమ్మవారి గర్భాలయంలో అర్ధరాత్రి ఒక అపరిచిత వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ రెండు ఘటనల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్పందించనే లేదు. అయితే నిన్నటి అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెనువెంటనే పలు నిర్ణయాలు తీసుకుంది. కానీ, కొన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనకు రాజకీయ రంగు పూసి లబ్ధి పొందాలని చూస్తున్నాయా? అన్న ప్రశ్నకు పలువురి నుంచి ‘అవును’ అనే సమాధానమే వస్తోంది. సాక్షి, అమరావతి: అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి, వేగంగా దర్యాప్తు చేయించడంతో పాటు కొత్త రథం తయారీకి నిధులు కేటాయించినప్పటికీ కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న రాజకీయంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నాయని అధికార వర్గాలు, భక్తుల్లో సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలి రోజు నుంచి ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా అన్నది నిగ్గు తేల్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. అప్పటి ఘటనలపై వివరాల సేకరణ ► 2017 అక్టోబర్ 19న కె.పెంటపాడు గ్రామంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆలయ రథం దగ్ధమైనప్పుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పని చేయలేదు. పగటి పూట ఘటన జరిగినా.. తాడేపల్లి గూడెం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా ఆ రథం పూర్తిగా దగ్ధమైంది. ఈ మేరకు అప్పడు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలపై పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.ఎన్.వీ.డీ.వీ ప్రసాద్ శుక్రవారం దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదికను అందజేశారు. ► ఈ ఘటనపై అప్పటి ప్రభుత్వం సరైన విచారణ జరపలేదు. కొత్త రథం నిర్మాణానికీ చర్యలు తీసుకోలేదు. స్థానికంగా ఉండే భక్తులే రూ.24 లక్షలు చందాలు వసూలు చేసి, కొత్త రథం తయారు చేయించారు. ► విజయవాడ దుర్గ గుడిలో, శ్రీకాళహస్తి ఆలయంలో తాంత్రిక పూజలతో పాటు 2014–19 మధ్య దేవదాయ శాఖ పరిధిలో ఉండే అన్ని ఆలయాల్లో చోటు చేసుకున్న వివిధ రకాల ఘటనలపై ఈవోల ద్వారా దేవదాయ శాఖ కమిషనర్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆయా ఘటనలన్నింటిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఎవరిది అవకాశవాదం? ► టీడీపీ ప్రభుత్వంలో పగటి పూట ఆలయ రథం దగ్ధమైతే ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటనపై ఈ ప్రభుత్వం ఆలయ ఈవో సస్పెన్షన్‌తో పాటు ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. ► గత ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా కొనసాగిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ 2017లో జరిగిన కె.పెంటపాడు ఆలయ రథం దగ్ధం ఘటన, 2018లో దుర్గ గుడిలో తాంత్రిక పూజలు, ఇతరత్రా ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఏ ఒక్కదానిపై ఒక్క మాటా మాట్లాడలేదు. ► పైగా ఎన్నికల ముందు బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మతాల మధ్య చిచ్చు రేపి ఓట్లు చీల్చాలని కుట్రలు చేస్తున్నది హిందూ నాయకులే అన్నారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ► 2017లో అప్పటి దేవదాయ శాఖ మంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఘటన చోటు చేసుకుంది. ఆ మంత్రి బీజేపీ నేత. అప్పట్లో ఆ ఘటనపై అప్పటి బీజేపీ పెద్దలు కూడా నోరు విప్పలేదు. నాడు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల తీరు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ప్రజలకు వివరించి చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: అంతర్వేది ఘటన వెనుక ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరుల కుట్ర ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరామని చెప్పారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. ► ఘటనలో పెదబాబు, చినబాబు హస్తం ఉందన్న విషయం విచారణలో బయటపడుతుంది. హైదరాబాద్, గుంటూరు వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. ► చంద్రబాబు ప్రవాసాంధ్రుడిలా హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి బీజేపీ, జనసేన మత రాజకీయాలు చేస్తున్నాయి. ► గత సార్వత్రిక ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైంది. ► కాగా, కరోనా నుంచి కోలుకున్న అనుభవాలతో విజయసాయిరెడ్డి రాసిన ‘మన ఆరోగ్యం మన చేతుల్లో’ పుస్తకాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్‌రాజ్, గొల్ల బాబూరావు, చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. -
నాడు వద్దని.. నేడు సీబీఐ విచారణ కోరుతున్నారు
సాక్షి, తాడేపల్లి: ‘అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు నాయుడు ప్రవేయం ఉంది. గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగలబెట్టించిన ఘనత చంద్రబాబుది. సీబీఐ రాష్టానికి రావద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు నేడు సీబీఐ విచారణ కోరుతున్నారు. మా చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు’ అన్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వైఎస్సార్ ఆసరా పథకం గురించి మాట్లాడుతూ.. ‘డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు నేడు పండగ రోజు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా ద్వారా హామీ నిలబెట్టుకున్నారు. మహిళలు కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. 90 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా మేలు జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్పప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగనన్నకు తెలియదు’ అన్నారు రోజా. (చదవండి: ‘మాకు చిరకాలం మీరే సీఎంగా ఉండాలి’) ఆమె మాట్లాడుతూ.. ‘మహిళలు, విద్యార్థులు కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ఆడవారికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి మహిళలు అందరూ రుణపడి ఉంటారు. మహిళలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రజలను తమ సొంత కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుంది. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించారు. స్త్రీల ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తున్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్నారు. ఆడవారి కోసం చంద్రబాబు ఒక మంచి పథకం కూడా ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్ ఆసరా మీద చంద్రబాబు నిందలు వేస్తున్నారు. కులాలు, మతాలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు’ అని ప్రశంసలు కురిపించారు. -
అంతర్వేది రథం కేసు సీబీఐకి అప్పగింత
సాక్షి, అమరావతి : అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. సెక్షన్ 6, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది. కాగా, సెప్టెంబర్ 5వ తేదీ శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిజాలు నిగ్గుతేల్చాలనే ఉద్ధేశ్యంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చదవండి : ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఉండవు -
ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఉండవు
సాక్షి, విజయవాడ : అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం దగ్నం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే పని తీరులో ఏపీ పోలీసు వ్యవస్థ ముందుందని అన్నారు. సంవత్సర కాలంపైగా రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా పోలీసులు త్వరితగతిన ఛేదించారని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అంతర్వేది ఘటనను టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి రాజకీయ పరమైన అవకాశంగా తీసుకుని ప్రజలను రెచ్చగొడుతున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీలో, హైదరాబాద్‌లో, ఇళ్లలో కూర్చుని దీక్షలు చేయటం దేనికి సంకేతం..? అంతర్వేది ఘటనపై ప్రభుత్వం, మంత్రులు, అధికారులు వెంటనే స్పందించి, విచారణకు ఆదేశించారు. ( ‘రథాన్ని తగలబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదు’ ) ఛలో అంతర్వేది అనేది ఒక రాజకీయ కుట్ర. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్ నాయకత్వం కావాలని.. కులం, మతం, చూడకుండా సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకున్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు 50 శాతం మెజార్టీ ఓట్లు వేసి ప్రజలు గెలిపించిన నాయకుడికి, ఆ ప్రభుత్వనికి మతాలను, కులాలు అంటకట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఘోర పరాజయం చెందిన పార్టీలు సైతం మా గురించి మాట్లాడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడే ఘటన జరిగినా తక్షణం స్పందించే నాయకుడు సీఎం జగన్. సీబీఐకి ఇచ్చిన నెల రోజుల సమయంలో నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నాము. సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించడం మా చిత్తశుద్ధికి తార్కాణం. ఎవరైనా తప్పు చేస్తే సీబీఐ ఎంక్వైరీ వేస్తారా ? టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కులాలను, మతాలను రెచ్చ గొడుతున్నాయి. ( కుట్రకోణంపై దర్యాప్తు జరుగుతోంది ) వారు ఏనాడైనా అంతర్వేది వెళ్లి స్వామిని దర్శించుకున్నారా ? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో అంతర్వేది వెళ్లి స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. మా ప్రభుత్వంలో హిందు ధర్మ పరి రక్షణను ముందుకు తీసుకు వెళుతున్నాము. హిందువుల మనోభావాలను రెచ్చ గొట్టి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. గత ప్రభుత్వాన్ని మాతో పోలుస్తూ బీజేపీ నాయకులు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఉండవు. మత రాజకీయాలు, కుల రాజకీయాలకు ఏపీలో తావులేదనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాము. ప్రభుత్వంపై బురద జల్లే వారిని సీబీఐ ఎంక్వైరీ నోరు మెదపలేని స్థితికి నెట్టింది. రాష్ట్రంలో అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం జగన్ కోరుకుంటున్నారు. ప్రతిపక్షాల కుట్రలకు కుతంత్రాలకు సీబీఐ ఎంక్వైరీ ఒక అడ్డుకట్ట లాంటిద’’ని అన్నారు. -
‘అంతర్వేది’పై సీబీఐ..
సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం వైఎస్ జగన్ గురువారం నిర్ణయించారు. ఈ ఘటనను సీఎం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తరువాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆపోహలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. పలు రాజకీయ పార్టీల సంఘాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీఓ శుక్రవారం వెలువడనుంది. సీబీఐతో విచారణ జరిపించండి : డీజీపీ లేఖ కాగా, రథం దగ్థం కేసును సీబీఐతో విచారణ జరపించాల్సిందిగా కేంద్ర హోంశాఖకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ గురువారం లేఖ రాశారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ ఈ లేఖ రాశారు. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే.. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. మంత్రులూ క్షేత్రస్థాయిలో పర్యటించి రథం దగ్థం సంఘటనపై సమీక్షించారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. స్థానిక అధికారులూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతేకాక.. ఆలయ ఈవో చక్రధరరావును సస్పెండ్ కూడా చేసింది. పాత రథం స్థానంలో కొత్త రథం తయారీకి ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా రూ.95లక్షలను మంజూరు కూడా చేసింది. ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపట్టే ఇన్ని చర్యలు స్పష్టంగా ఉన్నా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మత విద్వేషాల ముసుగులో రాజకీయంగా లబ్ధిపొందేందుకు, సర్కారుకు వ్యతిరేకంగా రాద్ధాంతం చేసే కుట్రలకు తెరలేపాయి. ‘సంక్షేమం’ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. నిజానికి అంతర్వేది రథం దగ్థం ఘటనలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాల్సిన అవసరం ఏమీ లేకపోయినప్పటికీ ప్రతిపక్షాలు అనవసరంగా నానాయాగీ చేస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు.. అన్ని రకాలుగా రాష్ట్రంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్ సర్కారు ఇటీవలే టీటీడీ లెక్కల్నీ కాగ్ ఆడిట్ పరిధిలోకి తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొన్ని దుష్టశక్తులు ఎప్పటికప్పుడు తమ వక్రబుద్ధిని ప్రదర్శించుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతర్వేది దుర్ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం రాజకీయ పరిశీలకులు, మేధావులు, తటస్థులు తదితర అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. -
అంతర్వేది ఘటన.. సీబీఐ దర్యాప్తుకు నిర్ణయం
-
అంతర్వేది ఘటన.. సీబీఐ దర్యాప్తుకు నిర్ణయం
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు సవాలుగా తీసుకున్నారు. అయినా కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లలోను, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. (చదవండి: రథం చుట్టూ రాజకీయం!) అంతేకాక కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించడమైనది. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం హోం శాఖకు లేఖ పంపింది. ఇందుకు సంబంధించి రేపు (శుక్రవారం) జీవో వెలువడనుంది. -
బాబువి నిన్న కుల, నేడు మత రాజకీయాలు
సాక్షి, తాడేపల్లి: అంతర్వేది రథం దగ్ధం విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియోతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఎవర్నీ ఉపేక్షించాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. దీన్ని చంద్రబాబు లాంటి వారు రాజకీయాలకు వాడుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. నిన్నటి వరకు కుల రాజకీయాలు చేసి, నేడు మత రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారి ఆశలు నెరవేరవని, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సంఘటనపై స్పందించిందని గుర్తు చేశారు. అధికారులను సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తోందని తెలిపారు. కొత్త రథానికి నిధులు కూడా కేటాయించిందని చెప్పారు. చదవండి: (రథం చుట్టూ రాజకీయం!) ఆనాడు చంద్రబాబు సమక్షంలోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. విజయవాడలో దేవాలయాలను కూల్చి వేసింది మర్చిపోయారని అనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఆ రోజు పరిశీలనకు వచ్చిన స్వామీజీలను అరెస్ట్ చేసింది చందబాబు కాదా అని నిలదీశారు. నిన్నటి వరకు పవన్ కల్యాణ్ బాబు బాటలో నడిచారని, నేడు బీజేపీ బాటలో నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరైనా సరే ప్రభుత్వం ఎక్కడ లోపం లేకుండా విచారణ చేస్తోందని వివరించారు. మత రాజకీయాలు చేయాలనుకునే వారి ఆశలు నెరవేరవని తెలిపారు. -
రథం చుట్టూ రాజకీయం!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అంతర్వేదిలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరం. ఈ విషయంలో రెండో మాటకు తావు లేదు. ఉండకూడదు కూడా. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు దిగితే..? రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే..? అది ప్రజాస్వామ్యమా? మతాల్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం... మనుషుల మధ్య చిచ్చు పెట్టడం ఏ మేరకు ధర్మం? అసలు అంతర్వేది ఘటనలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాల్సిన అవసరమేమైనా ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాద్ధాంతాలకు దిగాల్సిన అవసరం ఉందా? జరిగిన ఘటనల్ని చూస్తే ఎవరికి వారే ఓ స్థిరాభిప్రాయానికి రావచ్చు కూడా. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ నెల 5 అర్ధరాత్రి దాటాక ఆలయ రధం దగ్ధమయింది. కారణాలేంటన్నది ఇంకా ఎవరికీ తెలియదు. విచారణలో బయటపడక మానవు కూడా!!. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగింది. దీన్ని దురదృష్టకర, అవాంఛనీయమైన ఘటనగా వర్ణించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా స్థానికంగా ఆ పుణ్యక్షేత్రంలోని సంఘటనలకు బాధ్యుడైన ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) చక్రధరరావును విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేసింది. కొత్త రథం తయారీకి, ఇతరత్రా పనులకు రూ.95 లక్షలు మంజూరు చేసింది. అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి మంత్రులను పంపింది. స్థానిక అధికారులకూ అక్కడే ఉండి సమీక్షించేట్టుగా తగు ఆదేశాలిచ్చింది. ఇవన్నీ ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టంగా చెప్పేచర్యలు. ఎక్కడా తాత్సారానికి తావులేకుండా వెనువెంటనే చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం... విచారణలో దోషులెవరో తేలితే కఠిన చర్యలు తీసుకోవటానికి కూడా సిద్ధమవుతోంది. దాపరికానికి తావే లేదు.. మొదటి నుంచీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పారదర్శకతకే పెద్దపీట వేస్తూ వస్తోంది. టెండర్లలో పారదర్శకత కోసం ముందే న్యాయ సమీక్షకు పంపించటమనేది చరిత్రాత్మకం. ఇటీవల టీటీడీ జమా ఖర్చుల్ని కాగ్ ఆడిట్ పరిధిలోకి తేవాలనుకోవటమూ మున్నెన్నడూ చూడనిదే. ఈ చిత్తశుద్ధే కొన్ని రాజకీయ పక్షాలకు మింగుడుపడటం లేదు. ఏ సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేస్తూ... ప్రభుత్వానికి పూస్తూ రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్నాయి. తమ కుట్రబుద్ధిని బయటపెట్టుకుంటున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రులను అడ్డుకుని రచ్చకు ప్రయత్నించటం... అదే వ్యక్తులు అక్కడికి కొద్ది దూరంలోని వేరొక మతానికి చెందిన ప్రార్థన మందిరంపై రాళ్లు రువ్వటం, అద్దాలు పగలగొట్టడం ఈ కుట్రను స్పష్టంగా బయటపెట్టేవే. ఈ విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించేవారికి కలిగే సందేహమొక్కటే? ఇలాంటి చర్యల ద్వారా వీళ్లు సాధించాలనుకుంటున్నదేంటి? ఏం చేయాలని రాళ్లేశారు? అసలిలా మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏ మేరకు ధర్మం? రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంతలా దిగజారుతారా? ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటివి ధర్మమేనా? ఇది ప్రభుత్వ ధర్మాగ్రహం. విచారణలో బయటపడే దోషులు... మతాల మధ్య చిచ్చుతో రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్న కుట్రదారులు ఈ ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనే అనుకోవాలి!. చదవండి: ఈ అలజడి ఎవరి మనోరథం? -
‘పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు’
సాక్షి, అమరావతి : అంతర్వేది ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రమాదానికి కారుకులు ఎవరైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో.. రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. అంతర్వేది ఘటనలో దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త రథం తయారీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ రూ.95 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. (‘ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పాడు’) మరో ట్వీట్లో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు.’ అంటూ విమర్శించాడు. -
‘రథాన్ని తగలబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదు’
సాక్షి, తాడేపల్లి : అంతర్వేది రథం కాల్చివేత చాలా బాధాకరమని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. రథం కాల్చివేత జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారని వెల్లడించారు. 95 లక్షల రూపాయలతో కొత్త రథాన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కులాలను మతాలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రథాన్ని తగలబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. (విజయవాడకు మరో వరం ప్రకటించిన సీఎం) విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముసుగులో కొంత మంది విద్రోహులు చర్చ్‌పై రాళ్లు రువ్వారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. చర్చ్, మసీదు, గుళ్లపై దాడులు చేసే వారిని క్షమించమని హెచ్చరించారు. ఇంకా విచారణ జరుగుతుండగానే ఈ విషయంపై కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల సందర్భంగా 40 దేవాలయాలను చంద్రబాబు కూల్చివేశారని, ఈ కూల్చివేతలో బీజేపీ జనసేనకు భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను నిర్మించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. దాడులు చేసే సంస్కృతి చంద్రబాబుదని, హైదరాబాద్‌లో కూర్చొని జూమ్‌లో చంద్రబాబు సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. (అంతర్వేది ఘటనపై స్పందించిన ఏలూరు రేంజ్ డీఐజీ) ‘సోము వీర్రాజును హౌస్ అరెస్ట్ చేయలేదు. అంతర్వేది ఆలయ ఈవోని సస్పెండ్ చేశాము. అంతర్వేది సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షింస్తాం. హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులను మా ప్రభుత్వం వచ్చాక తొలగించామం. మతాలు మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు దెయ్యం మాదిరిగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవకతవకలుపై 30 మంది అధికారులను తొలగించాము. పనికిమాలిన ఎంపీ రఘురామ కృష్ణమరాజు.. ఢిల్లీలో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. (అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్) సోము వీర్రాజు మాటలను ఖండిస్తున్నాము. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు. పవన్ కల్యాణ్ లాగా ఓట్లు కోసం రాజకీయాలు చేయడం మాకు తెలియదు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన పిల్లలు క్రిస్టిన్ అన్నారు. ఎన్నికలు తరువాత హిందువులు అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడించారు. గత ప్రభుత్వం హయాంలో అంతర్వేది దేవాలయ భూముల అన్యాక్రాంతం చేయాలని చంద్రబాబు చూశారు. టీటీడీ నిధులు ఎక్కడ దారి మళ్లించారో సోము వీర్రాజు సమాదానం చెప్పాలి. చంద్రబాబు షూటింగ్ కోసం 29 మందిని చంపేశారు. పుష్కరాల పేరుతో వందల కోట్లు దోచేశారు. చంద్రబాబు పాపాల్లో బీజేపీ జనసేనకు భాగస్వామ్యం లేదా.’ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలు, కులాలు ముఖ్యమంత్రికి సమానమేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ‘జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు మతాలతో సంబందం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికారంలో లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు. 40 దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబు ఎందుకు నిజానిర్ధారణ కమిటీ వేయలేదు. ప్రభుత్వంకు కులాలు మతాలు అంటగట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులపై కొంత మంది దాడి చేయాలని చూడడం దుర్మార్గం.’ అని పేర్కొన్నారు. -
అంతర్వేదిలో 30 పోలీస్ యాక్ట్
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది అగ్ని ప్రమాద సంఘటన స్థలం వద్ద డీఐజీ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావు తెలిపారు. పరిసరప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది అని వెల్లడించారు. ఫోరెన్సిక్ శాఖకు చెందిన నిపుణులు సంఘటన స్థలంలో అనువనువునా నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. కొంత మంది శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నించారన్నారు. అంతర్వేది పరిసరప్రాంతాలలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఇతరులు ఎవ్వరు ఈ ప్రాంతానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఉండాలని ప్రజలను కోరారు. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథాన్ని కొంతమంది దుండగలు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: అవసరమైతే సీబీఐ విచారణ -
అవసరమైతే సీబీఐ విచారణ
సఖినేటిపల్లి/సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్థమైన çఘటనలో అవసరమైతే సీబీఐ విచారణకు వెనుకాడబోమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ దుర్ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని.. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని చెప్పారు. మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దేవదాయ కమిషనర్ అర్జునరావు, ఆర్జేసీ భ్రమరాంబ, రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావులతో కలిసి ఘటనా స్థలాన్ని వెలంపల్లి మంగళవారం సందర్శించారు. ఈ సమయంలో వీహెచ్‌పీ. భజరంగదళ్, హిందూ ధార్మిక సంఘాలు, హిందూ చైతన్య వేదిక, ధర్మవీర్ ఆధ్యాత్మిక వేదిక, సంఘ్ పరివార్ కార్యకర్తలు అక్కడకు వచ్చి ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రులు ఆందోళనకారుల తరఫున ధార్మిక సంఘ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రవికుమార్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. ఈ ఘటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా చర్యలకు వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. శ్రీశైలంలో గత ఐదేళ్లల్లో జరిగిన అవినీతికి సంబంధించి 30 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన విషయాన్ని వెలంపల్లి వారికి గుర్తుచేశారు. ఆలయ ఈవోపై ప్రభుత్వం వేటు కాగా, రథం ఉన్న పరిసరాల్లో పర్యవేక్షణ లోపం ఉండడంతో ఈవో ఎన్ఎస్ చక్రధరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఆలయానికి కొత్త రథం తయారీ, రథశాల మరమ్మతుల నిమిత్తం కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నుంచి రూ.95 లక్షలను ఆయన మంజూరు చేశారు. -
అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్
సాక్షి, తూర్పు గోదావరి : అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం మంగళవారం సీరియస్ అయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో చక్రదరరావును సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యేవరకు అన్నవరం ఆలయ ఈవో అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా గత శనివారం అర్థరాత్రి తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి : స్వామి వారి రథం దగ్ధం.. మంత్రి దిగ్భ్రాంతి) -
హిందుత్వం అప్పుడు గుర్తుకురాలేదా..?
సాక్షి, విశాఖపట్నం: కృష్ణా పుష్కరాల్లో పలు దేవాలయాలను టీడీపీ నేలమట్టం చేసిందని.. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి హిందుత్వం గుర్తుకు రాలేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీకి మాట్లాడే హక్కు లేదన్నారు. కృష్ణా పుష్కరాలలో 17 రకాల దేవాలయాలను తెలుగుదేశం ప్రభుత్వం నేలమట్టం చేసిందని గుర్తు చేశారు. ఆ సమయంలో విజయవాడ గోశాల ప్రాంతాన్ని తాము సందర్శించినపుడు తమపై బుద్దా వెంకన్న దాడికి ప్రయత్నించలేదా అని అన్నారు. ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్క ఆలయాన్ని అయినా కట్టారా అని ప్రశ్నించారు. ‘‘కృష్ణా పుష్కరాలలో ఆలయాలు కూల్చేసినపుడు చినరాజప్ప ఎక్కడున్నారు. ఆ రోజు మాట్లాడని ఈ రాజప్ప ఇపుడు అంతర్వేది ఘటనపై ఎలా మాట్లాడతారు’’ అంటూ సోము వీర్రాజు విమర్శించారు. (చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు) ‘‘అంతర్వేది ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాం. అనిల్‌కి బంధువంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై బుచ్చయ్యచౌదరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 1996లో లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి చంద్రబాబుని బుచ్చయ్య చౌదరి నానాతిట్లూ తిట్టారు. ఆయనలా మేము పార్టీలు మారలేదు. గత 40 ఏళ్లుగా నేను బీజేపీలోనే కొనసాగుతున్నాను. దేశంలో రాజధాని నిర్మాణాలు ఎక్కడ జరిగినా అమరావతి అంత హైప్ ఎక్కడా లేదు. చైనా, జపాన్, సింగపూర్‌లా అమరావతి రాజధాని నిర్మిస్తామంటూ చంద్రబాబు గత ఐదేళ్లూ హైప్ క్రియేట్ చేశారు. జపాన్, సింగపూర్, చైనా అన్నావు కదా.. ఎందుకు అమరావతి నిర్మించలేదని అందరూ చంద్రబాబుని ప్రశ్నించాలి. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన 7,200 కోట్లు ఏం చేశావని చంద్రబాబుని నిలదీయాలి. మాటతప్పిన చంద్రబాబును మీడియా ఎందుకు ప్రశ్నించదు’’ అంటూ సోము వీర్రాజు దుయ్యబట్టారు. (చదవండి: ‘ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పాడు’) (చదవండి: ఫిబ్రవరిలోగా అంతర్వేది రథ నిర్మాణం) -
అంతర్వేది స్వామివారి సన్నిధిలో హీరో ఆది..
సాక్షి, సఖినేటిపల్లి: ప్రముఖ సినీనటుడు సాయికుమార్, ఆయన తనయుడు హీరో ఆది కుటుంబ సమేతంగా అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సాయికుమార్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జనసంద్రమైన అంతర్వేది క్షేత్రం
-
అంతర్వేదికి పోటెత్తిన భక్తులు
తూర్పు గోదావరి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సుమారు 3 లక్షల మంది సముద్ర స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. ఆలయ పరిసరాల్లో సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంతర్వేది ఆలయపాసులపై ఏసుక్రీస్తు బొమ్మ
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ క్షేత్రం అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు మీడియా ప్రతినిధులకు జారీ చేసిన పాసుల వెనుక ఏసుక్రీస్తు బొమ్మ ఉండడం వివాదానికి దారితీసింది. దీనిపై ఆగ్రహించిన బీజేపీ, వీహెచ్‌పీ నేతలు అన్యమత ప్రచారానికి అవకాశం కల్పించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఆలయం వద్ద ధర్నా నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జనవరి 26 నుంచి స్వామి వారి కల్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి ఈ నెల 4 తో ముగుస్తాయి. ఈ కార్యక్రమాలను కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులకు ఆలయ అధికారులు జనవరి 26నే పాసులు జారీ చేశారు. వీటిలో కొన్నింటి వెనుక ఏసుక్రీస్తు ఫొటో, కొన్నింటి వెనుక క్రైస్తవ మత సాహిత్యం ముద్రితమై ఉండడంతో ఆ విషయం బీజేపీ, వీహెచ్‌పీ నేతలకు తెలిసింది. దాంతో వారు కొన్ని పాసులను తీసుకుని ఆదివారం ధర్నాకు దిగడంతోపాటు, ఆలయ అధికారులపై రాజోలు సీఐ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. కాగా, పాసుల తయారీ, ప్రింటింగ్ బాధ్యతలను ఆలయ అధికారులు నరసాపురంలోని ఓ ప్రింటింగ్ సంస్థకు ఇచ్చినట్లు తెలిసింది. సదరు సంస్థ చెన్నై నుంచి ముడి సరుకు తెప్పించి దేవస్థానం సూచించినట్లుగా ముద్రించి పంపించింది. అయితే, వాటి వెనుక ఏసుక్రీస్తు ఫొటో ఉండడాన్ని తాము గమనించలేదని ఆలయ అధికారులు అంటున్నారు. (సఖినేటిపల్లి)