సాక్షి, తాడేపల్లి : అంతర్వేది రథం కాల్చివేత చాలా బాధాకరమని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. రథం కాల్చివేత జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారని వెల్లడించారు. 95 లక్షల రూపాయలతో కొత్త రథాన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కులాలను మతాలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రథాన్ని తగలబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. (విజయవాడకు మరో వరం ప్రకటించిన సీఎం)
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముసుగులో కొంత మంది విద్రోహులు చర్చ్‌పై రాళ్లు రువ్వారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. చర్చ్, మసీదు, గుళ్లపై దాడులు చేసే వారిని క్షమించమని హెచ్చరించారు. ఇంకా విచారణ జరుగుతుండగానే ఈ విషయంపై కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల సందర్భంగా 40 దేవాలయాలను చంద్రబాబు కూల్చివేశారని, ఈ కూల్చివేతలో బీజేపీ జనసేనకు భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను నిర్మించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. దాడులు చేసే సంస్కృతి చంద్రబాబుదని, హైదరాబాద్‌లో కూర్చొని జూమ్‌లో చంద్రబాబు సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. (అంతర్వేది ఘటనపై స్పందించిన ఏలూరు రేంజ్ డీఐజీ)
‘సోము వీర్రాజును హౌస్ అరెస్ట్ చేయలేదు. అంతర్వేది ఆలయ ఈవోని సస్పెండ్ చేశాము. అంతర్వేది సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షింస్తాం. హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులను మా ప్రభుత్వం వచ్చాక తొలగించామం. మతాలు మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు దెయ్యం మాదిరిగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవకతవకలుపై 30 మంది అధికారులను తొలగించాము. పనికిమాలిన ఎంపీ రఘురామ కృష్ణమరాజు..
ఢిల్లీలో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. (అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్)
సోము వీర్రాజు మాటలను ఖండిస్తున్నాము. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు. పవన్ కల్యాణ్ లాగా ఓట్లు కోసం రాజకీయాలు చేయడం మాకు తెలియదు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన పిల్లలు క్రిస్టిన్ అన్నారు. ఎన్నికలు తరువాత హిందువులు అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడించారు. గత ప్రభుత్వం హయాంలో అంతర్వేది దేవాలయ భూముల అన్యాక్రాంతం చేయాలని చంద్రబాబు చూశారు. టీటీడీ నిధులు ఎక్కడ దారి మళ్లించారో సోము వీర్రాజు సమాదానం చెప్పాలి. చంద్రబాబు షూటింగ్ కోసం 29 మందిని చంపేశారు. పుష్కరాల పేరుతో వందల కోట్లు దోచేశారు. చంద్రబాబు పాపాల్లో బీజేపీ జనసేనకు భాగస్వామ్యం లేదా.’ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని మతాలు, కులాలు ముఖ్యమంత్రికి సమానమేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ‘జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంకు మతాలతో సంబందం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికారంలో లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు. 40 దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబు ఎందుకు నిజానిర్ధారణ కమిటీ వేయలేదు. ప్రభుత్వంకు కులాలు మతాలు అంటగట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులపై కొంత మంది దాడి చేయాలని చూడడం దుర్మార్గం.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment