ఒక్క హగ్‌తో యెల్లో బ్యాచ్‌కి చెక్‌ | AP Politics: Vijayawada YSRCP Joy Over Vellampalli And Malladi Hug, Details Inside - Sakshi
Sakshi News home page

విజయవాడ: ఒక్క హగ్‌తో యెల్లో బ్యాచ్‌కి చెక్‌.. వైఎస్సార్‌సీపీలో జోష్‌

Published Thu, Jan 25 2024 1:04 PM | Last Updated on Sun, Feb 4 2024 4:33 PM

AP Politics: Vijayawada YSRCP Joy Over Vellampalli Malladi Hug - Sakshi

ఎన్టీఆర్‌, సాక్షి: పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు తప్పవని.. అలాంటప్పుడు అలకలు సహజమని.. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముందు నుంచే చెబుతున్నాయి.  అయితే యెల్లో మీడియా మాత్రం ఈ అలకల్ని భూతద్ధంలో పెట్టి చూపించే యత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ్టి విజయవాడ సెంట్రల్‌ పరిణామాలు.. ఆ బ్యాచ్‌ నోళ్లు మూయించాయి. 

వైఎస్సార్‌సీపీ నుంచి తొలి గెలుపు విజయవాడ సెంట్రల్‌దే కావాలని.. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం పిలుపు ఇచ్చారు. అంతేకాదు విజయవాడలో పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే టీడీపీ అనుకూల మీడియా చానెల్స్‌, పత్రికలు చాలారోజుల నుంచి వీళ్ల మధ్య ఏదో వైరం నడుస్తున్నట్లు చూపించే యత్నం చేసింది. ఒక అడుగు ముందుకేసి ఆయన పార్టీని కూడా వీడుతారంటూ ఊహాజనిత కథనాలు రాశాయి. అయితే ఆ రోతరాతలకు ఒక్క హగ్‌తో చెక్‌ పెట్టారు ఈ ఇద్దరూ. 

విజయవాడ సెంట్రల్‌ సింగ్ నగర్ లో వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్‌ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి ఆఫీస్‌కు ర్యాలీ తన ఆఫీస్‌ నుంచి మల్లాది వచ్చారు. ఈ సందర్భంగా మల్లాదికి వెల్లంపల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. సమిష్టిగా పని చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాతామని ఈ సందర్భంగా ఈ ఇద్దరు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement