
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర పూర‍్తయి మూడేళ్లయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్‌రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
దేశంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత వైఎస్ జగన్‌ది అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అన్ని వర్గాల ప్రజల కష్ట, నష్టాలు తెలుసుకున్న నాయకుడు జగన్. అందుకే సీఎం అయిన తర్వాత ప్రజామోదయోగ్యమైన పాలన చేస్తున్నారు. అందుకే పాదయాత్ర ముగిసి మూడేళ్లయినా జనం మర్చిపోలేదు' అని అన్నారు.
చదవండి: ('ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది')
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా కోట్లమందిని జగన్ కలిశారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేసిన పాదయాత్ర ఒట్టి బూటకం. ప్రజలతో మమేకం కావడమనేది వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఆరోగ్యశ్రీ నుంచి పెన్షన్ల పెంపు వరకు ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల వారికీ పథకాలు అందిస్తున్న మనసున్న నేత సీఎం జగన్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన ఘనత జగన్‌ది అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎండ, వాన, చలి ఏదీ లెక్కచేయకుండా జనం సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. జనం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment