YS Jagan Mohan Reddy Padayatra
-
Yatra- 2 Teaser.. తూటాల్లా పేలుతున్న డైలాగ్స్
యాత్ర- 2 టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్-1కు చేరిపోయింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి స్టార్ హీరోలు లేరు.. కానీ టీజర్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది వైఎస్సార్ అభిమానులు తమ మొబైల్స్‌లలో వాట్సప్ స్టేటస్‌లుగా యాత్ర-2 టీజర్ డైలాగ్స్‌ను పెట్టుకుంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర-2 సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వైఎస్ఆర్, ఆయన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారందరూ యాత్ర-2 టీజర్‌తో పండుగ చేసుకుంటున్నారు. టీజర్లో చూపించిన ప్రతి అంశం గడిచిన రోజుల్లో మన కళ్ల ముందు జరిగినవే.. కానీ డైరెక్టర్ మహి వి రాఘవ అద్భుతంగా తెరకెక్కించారు. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అసలు టీజర్ స్టార్ట్ కావడమే ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమైంది. ఆ షాట్ కూడా పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్దే జరిగింది. ఈ టీజర్లో సీఎం జగన్ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలనే తెరపైకి తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్ గారిని బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. వైఎస్ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అవుతుంది. అనుకున్నట్లే వైఎస్ జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారు.. రోజురోజుకూ ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన కొందరు తండ్రి పోయాడనుకుంటే వారసుడొచ్చాడని.. దీనిని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్‌తో జత కట్టి దొంగదెబ్బ తీసేందుకు వార్నింగ్‌లు జారీచేశారు. అప్పుడు టీజర్లో వినిపించిన డైలాగ్ ఇదే... 'ఉన్నది అంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం' ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇదే. ఎవరికీ తలవంచని ధైర్యం.. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. పెద్ద దిక్కు తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలో వచ్చిందే ఈ డైలాగ్ 'నాకు భయపడడం తెలియదు.. నేను వైఎస్సార్ కొడుకుని' అని చెప్పడం. వైఎస్ జగన్ గారిపై అన్యాయంగా సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయించి, టీడీపీతో కుమ్మక్కై రాజకీయంగా మొగ్గదశలోనే వైఎస్సార్ వారసుడిని అంతమొందించేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టిన తీరును యాత్ర- 2లో చూపించనున్నాడు డైరెక్టర్ మహీ. జగన్ గారి ఓదార్పు యాత్రకు ముందు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు.. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర ప్రకటన వచ్చిందో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వచ్చాయి. రాజకీయంగా వైఎస్సార్ వారసుడిని లేకుండా చేయాలని కుట్ర పన్నిన వారందరికీ వైఎస్ జగన్ అభిమానులు తగిన బుద్ధి చెప్పారు. ఆయన వెంట ఒక సైన్యంలా జనం కదిలారు. తండ్రి మాదిరే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా.. పోరాడి నిలబడిన యోధుడిలా జగన్ జీవితం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. అందుకే రాజన్నతో పాటు ఆయన బిడ్డ వైఎస్ జగన్ జీవితం గురించి సినిమాలు వస్తున్నాయి. వారి అసలైన జీవితాన్ని నేటి తరం యువకులకు తెలిసేలే కొందరు దర్శకనిర్మాతలు పూనుకున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది.. ఫిబ్రవరి 8న యాత్ర- 2 విడుదల కానుంది. -
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం
-
మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట
Mahesh Babu Mass Dialogues In Sarkaru Vari Pata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్లో మహేశ్ బాబు లుక్స్, డైలాగ్‌లు, డైలాగ్ డెలివరీ అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైలర్లో మహేశ్ చెప్పిన డైలాగ్‌లు బాగా పేలాయి. 'నువ్ నా ప్రేమను, స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బును దొంగలించలేవ్', 'నేను విన్నాను.. నేను ఉన్నాను', 'వంద వయగ్రాలు వేసి శోభనానికి ఎదురుచూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చార్రా', 'దిస్ ఈజ్ మహేశ్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలుప్పాడ బీచ్ సర్' వంటి తదితర డైలాగ్‌లు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాటలను.. కూడా ఈ మూవీలో వాడారు. చదవండి: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. -
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు
-
'ప్రజలతో మమేకం కావడం వైఎస్ కుటుంబానికే సాధ్యం'
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పూర్తయి మూడేళ్లయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్‌రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. దేశంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత వైఎస్ జగన్‌ది అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అన్ని వర్గాల ప్రజల కష్ట, నష్టాలు తెలుసుకున్న నాయకుడు జగన్. అందుకే సీఎం అయిన తర్వాత ప్రజామోదయోగ్యమైన పాలన చేస్తున్నారు. అందుకే పాదయాత్ర ముగిసి మూడేళ్లయినా జనం మర్చిపోలేదు' అని అన్నారు. చదవండి: ('ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది') మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా కోట్లమందిని జగన్ కలిశారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేసిన పాదయాత్ర ఒట్టి బూటకం. ప్రజలతో మమేకం కావడమనేది వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఆరోగ్యశ్రీ నుంచి పెన్షన్ల పెంపు వరకు ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల వారికీ పథకాలు అందిస్తున్న మనసున్న నేత సీఎం జగన్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన ఘనత జగన్‌ది అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎండ, వాన, చలి ఏదీ లెక్కచేయకుండా జనం సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. జనం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారు
-
ప్రజాసంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు
-
రాష్ట్రంలో అద్భుతమైన పాలనకు ప్రజాసంకల్పయాత్ర నాంది పలికింది
-
చంద్రబాబు పాలనలో ప్రజలు కష్టాలు చూశారు
-
‘మానవత్వమే నా మతం’ పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ‘మానవత్వమే నా మతం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో చోటు చేసుకున్న పలు మానవీయ ఘటనలు, ఆ సందర్భంగా అప్పుడు వైఎస్ జగన్ చూపిన దృక్పథంతో పాటు, ఆయన చిన్నతనం నుంచి ప్రదర్శించిన మానవీయ కోణాలను ఆవిష్కరింప చేస్తూ గాంధీపథం పక్షపత్రిక ఒక ప్రత్యేక పుస్తకం ప్రచురించింది. ‘మానవత్వమే నా మతం’ అన్న పేరుతో ప్రచురించిన ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా గాంధీపథం పక్షపత్రిక ఆ పుస్తకం ప్రచురించింది. (ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..) చిన్ననాటి నుంచే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, పాదయాత్రలో ఒక వృద్ధురాలి చెప్పు తెగిపోతే సరిచేసి ఇవ్వడం ,ముఖ్యమంత్రిగా ఒక పోలీసు అధికారికి పతకం ప్రదానం చేస్తుండగా, అది జారిపోతే స్వయంగా ఒంగి తీసి ప్రదానం చేయడం, విశాఖ పర్యటనలో కొందరు విద్యార్థులు తమ సహచరుడి అనారోగ్యం గురించి ప్లకార్డులు ప్రదర్శిస్తే వెంటనే ఆగి, వారి సమస్య తెలుసుకుని ఆ విద్యార్థి వైద్య సహాయం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయడం.. వంటి పలు మానవీయకోణ విశేషాలను ‘మానవత్వమే నా మతం’ పుస్తకంలో పొందుపర్చినట్లు గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ తెలిపారు. (జీవితకాల మధుర‘యాత్ర’) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, ముఖ్యమంత్రి సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు)ఆర్ ధనంజయ్ రెడ్డి, గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ పాల్గొన్నారు. (ఏపీ వ్యాప్తంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’) -
పృథ్వీతేజ్ సంకల్పం.. వైఎస్ జగన్ ప్రశంసలు
సాక్షి, ద్వారకాతిరుమల: ప్రజలకు సేవ చేయాలన్న ఆ యువకుడి సంకల్పం.. రూ.కోటి జీతాన్ని వదులుకునేలా చేసింది. పట్టుదలతో తాను ఎంచుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించి తొలి ప్రయత్నంలో ఐఏఎస్ అయిన ఆ యువకుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు. కన్నవారికి, పుట్టిన గడ్డకు మంచి పేరు తెచ్చి, ఇటీవల కడప జిల్లాలో రెవెన్యూ డివిజన్ సబ్‌కలెక్టర్‌గా పోస్టింగ్ పొందిన ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్ విజయగాథ.. సివిల్స్‌లో 24వ ర్యాంక్ బంగారు నగల వ్యాపారి యిమ్మడి శ్రీనివాసరావు, రాణి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఏకైక కుమారుడు పృథ్వీతేజ్ చిన్ననాటి నుంచి చదువులో రాణించారు. ప్రజాసేవ చేసే ఉన్నత ఉద్యోగం చేయాలనే లక్ష్యాన్ని చిన్నతనంలో ఎంచుకున్నారు. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ లక్ష్య సాధనవైపు దూసుకెళ్లారు. 24 ఏళ్ల వయసులోనే సివిల్స్‌లో 24వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్)కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న ఆయన ఇటీవల కడప జిల్లా రెవెన్యూ డివిజన్ సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ పొందారు. కుటుంబసభ్యులతో పృథ్వీతేజ్ జగన్ ప్రశంసలు పొంది.. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో 2018 మే 19న ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పృథ్వీతేజ్, ఆయన తండ్రి శ్రీనివాసరావు కలుసుకున్నారు. అప్పటికే సివిల్స్‌లో సత్తాచాటిన పృథ్వీతేజ్ను జగన్మోహన్రెడ్డి అభినందించారు. రూ.కోటి ప్యాకేజీని వదులుకుని.. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే సౌత్ కొరియాలోని సామ్సంగ్ కంపెనీలో ఏడాదికి రూ.కోటి ప్యాకేజీతో ఏడాదిపాటు పృథీ్వతేజ్ ఉద్యోగం చేశారు. అయితే ఉద్యోగం, సంపాదన ఆయనకు సంతృప్తి కలిగించలేదు. తాను కోరుకున్నది సాధించాలన్న దృఢ సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్ దిశగా అడుగులు వేశారు. కుటుంబసభ్యులతో పృథ్వీతేజ్ విద్యాభ్యాసం పృథ్వీతేజ్ 3వ తరగతి వరకు ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట సెయింట్ గ్జేవియర్ పాఠశాలలో, ఆ తర్వాత 6వ తరగతి వరకు డీపాల్ పాఠశాలలో చదివారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్ గూడవల్లి శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ 2011లో ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఆల్ఇండియా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముంబైలో ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కోచింగ్ తీసుకోకుండానే.. ఐఏఎస్ సాధించేందుకు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే పృథ్వీతేజ్ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. పట్టుదలతో చదివి, పరీక్ష రాసిన ఆయన 2018లో విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియాలో 24వ ర్యాంక్‌ను సాధించారు. ఐఐటీలో ర్యాంకు సాధించిన పృథ్వీతేజ్ అనతికాలంలోనే సివిల్స్‌లో సత్తాచాటుతారని ఎవరూ ఊహించలేదు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం గెలుపును ముందే ఊహించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, నమ్మకం, పృథ్వీతేజ్ పట్టుదల, కృషి ఆయన్ను ఈస్థాయిలో కూర్చోబెట్టింది. -
‘వైఎస్సార్ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం తెలుసుకోవచ్చు. అలాగే సదరు పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రజల కోసం కొత్తగా రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా సరైన సమయంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యాప్‌లో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈ-క్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణతోపాటు పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్దం చేయడం, రైతులకు ఇన్పుట్స్ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనిని ఉన్నతస్థాయిలోని అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. (రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్: సీఎం జగన్) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) డిజిటల్ రిజిస్టర్‌ను నిర్వహించడం, ఆర్బీకే ఆస్తులను పరిరక్షించడం, ఎక్కడైనా పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సకాలంలో రిపోర్ట్ చేయడం, డాష్‌బోర్డ్‌లో ఆర్బీకే కార్యక్రమాలను పర్యవేక్షించడం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వే చేయడం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్నులను తీసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యపడుతుంది. ఆర్‌బికె పెర్ఫార్మ్న్స్ డాష్‌బోర్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్బీకే పనితీరును పరిశీలించడం, సరిపోల్చడం, మెరుగైన పనితీరు కోసం ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్ధేశం చేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. (ధనికులకు బాబు.. పేదలకు జగన్) రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి అవసరాలను తీర్చడం, వారికి మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాచారం పొందేలా ఈ యాప్ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(ఆర్బీకేల నుంచే పండ్లు, కూరగాయల విత్తనాలు, మొక్కలు) -
వ్యవసాయంపై అవగాహనలేని లోకేష్ మాట్లాడుతున్నారు..
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల రోజుల పాలనలో ఎన్నో ప్రజా ప్రయోజన నిర్ణయాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. పాదయాత్ర సమయంలో ఆయన ఏవైతే హామీలను ఇచ్చారో.. అవి అమలు చేస్తున్నారని సర్వేపల్లి ఎం.ఎల్.ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నదీ జలాలను సద్వినియోగ పర్చుకునేందుకు తెలంగాణా ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన కారణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనను చూసి ఓర్వలేక టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. భద్రత పై చంద్రబాబు గగ్గోలు పెట్టడం సరికాదు. ఆయనకు నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను కల్పిస్తోందన్నారు. వ్యవసాయం పై కనీస అవగాహన లేని లోకేష్ మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. -
వైఎస్ జగన్‌కు పట్టుదల చాలా ఎక్కువ
-
మాలో యాత్ర
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని, ఎనలేని జనాదరణను సొంతం చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి పథకాలకు పాదయాత్రలో ఎలా అంకురార్పణ జరిగిందనే విశేషాలను చాలా అర్థవంతంగా మహి చూపించారని కూడా వీక్షకులు అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు మరోసారి ఆ మహానేతను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం కానుంది. ‘యాత్ర’ చిత్రం ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘స్టార్‌మా’ చానెల్లో ప్రదర్శితం కానుంది. -
చేనుకి పోయిన మనిషి చితికిపోతే ఎలా?
చేనుకి పోయిన మనిషి ఇంటికి ఏ రూపంలో తిరిగొస్తాడో తెలియదు. రైతు తనని తాను చంపుకోవాల్సిన పరిస్థితులు కొన్నయితే విధాన నిర్ణేతల తప్పిదాలు మరికొన్ని. ఈ కోవలోదే చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన విద్యుత్ సరఫరా హామీ... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మందాడి గ్రామానికి చెందిన యువ కౌలు రైతు వంకద్వత్ అంజి నాయక్ మిర్చి పంట పండిస్తుంటాడు. వాన మొఖం చాటేసింది. మబ్బులు కిందికి దిగిరానంటున్నాయి. బోరు బావులే దిక్కయ్యాయి. వీటికి ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో సర్కారు వారి దయ. దీంతో అంజి నాయక్ ఇటీవల ఓరోజు అర్ధరాత్రి దాటింతర్వాత చేనుకి నీళ్లు కట్టుకుందామని వెళ్లాడు. వెళ్లినవాడు పొద్దు బారెడెక్కినా ఇంటికి రాలేదు. ఏమైందో తెలియక తల్లడిల్లిన ఇల్లాలు చేనుకి పోయి చూసేసరికి గుండె గుభిల్లుమంది. విద్యుద్ఘాతం అంజిని పొట్టన పెట్టుకుంది. ఇలాంటివి ఎన్నో... కర్నూలు జిల్లా సంజామల మండలం మిక్కినేని గ్రామంలో ఒకేరోజు ముగ్గురు రైతులు మబ్బుల్లో పొలానికి పోయి మళ్లీ తిరిగి రాలేదు. ఆ చీకట్లో తెగిపడిన కరెంటు తీగె వారి ప్రాణాలను మిగేసింది. రైతు వ్యథాభరిత చిత్రానికి ఇవన్నీ రుజువులు.వేళకాని వేళల్లో ఇచ్చే కరెంటు కోసం వెళ్లి రైతులు చచ్చిపోతున్నారు. గత నాలుగేళ్లుగా ఇదే తీరు. ఈ దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతన్నలకు ఓ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే నవరత్నాలలో భాగంగా పగటిపూట నిరంతరాయంగా హెచ్చుతగ్గులు లేని నాణ్యమైన కరెంటును 9 గంటల పాటు సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయన మాటను అన్నదాతలు విశ్వసించారు. ఎందుకో తెలుసా.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్‌పై సంతకం చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. పాత బకాయిలు రద్దు చేసిన పెద్దమనసు ఆయనది. ఆవేళ ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల బోర్లకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసి మాట నిలుపుకున్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో ఆయా రైతులకు భూమి ఎంత, ఎటువంటి పంట, పంప్‌సెట్ సామర్థ్యం ఎంత, పేదరైతా? పెద్ద రైతా అనేది చూడలేదు. కస్టమర్ సర్వీస్ చార్జీలనూ నయాపైసా వసూలు చేయలేదు. రాష్ట్ర ఖజానాకు అది భారమవుతుందేమో అని యోచించలేదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేసిన మహానేత వైఎస్సార్. అటువంటి ఆయన కడుపున పుట్టిన జగన్ మాట తప్పడన్న ధీమా రైతన్నది. అందుకే పాదయాత్రలో అంతలా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. జగన్ హామీతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 16 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ వస్తుంది. 17 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందుతాయి. వీళ్లందరికీ 9 గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంది. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూపాయిన్నరకే విద్యుత్ వస్తుంది. – ఎ.అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
ప్రజాసంకల్పయాత్ర అద్వితీయం.. అపూర్వం..
-
జన యాత్ర
-
విజయ శంఖారావం
-
వైఎస్ జగన్‌ను కలిసిన సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు
-
ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది: ధర్మాన
-
వైఎస్ జగన్‌ను కలిసిన కవిటి మండలం కిడ్నీ వ్యాధి బాధితులు
-
‘సేవారత్న’ పుస్తకావిష్కరణ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిపై ‘సేవా రత్న’ (ప్రేరణ, ప్రాణం, వైఎస్ అనేది ట్యాగ్ లైన్)అనే పుస్తకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన వైఎస్సార్ జిల్లా పార్టీ నాయకులు ఆయనతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి, వైఎస్ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉందని.. ఆ విషయాలన్నీ ఈ పుస్తకంలో ప్రచురించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాయచోటి, రైల్వేకోడూరు, కడప ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజద్‌బాషా పాల్గొన్నారు. -
తూర్పున సంకల్ప సూరీడు
-
పశ్చిమ ఒడిలో రాజన్న బిడ్డ
-
కృష్ణమ్మ ఒడిలో జన్ పరవళ్ళు
-
ఏ పార్టీతో పొత్తు ఉండదు : వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ ఇంటర్వ్యూ : మేం ఎవరితో పొత్తు పెట్టుకోం..
-
కరువు నేల ప్రకాశించేలా..
-
వైఎస్ జగన్ ఇంటర్వ్యూ: అందుకే అసెంబ్లీ బహిష్కరించాం
-
సింహపురిలో సింహనాదం
-
వైఎస్ జగన్‌ను కలిసిన రాజమండ్రికి చేందిన రుద్ర కుటుంబం
-
సింహంలా సింగిల్‌గానే : వైఎస్ జగన్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
జగన్ ఇంటర్వ్యూ : హామీలు నెరవేర్చకపోతే.. రాజీనామా
సాక్షి, శ్రీకాకుళం : త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పాదయాత్రలో ఎదురైన అనేక అనుభవాలతో పాటు రాజకీయాలు, తానిచ్చిన హామీలు, అధికార పార్టీ వైఫల్యాల వంటి అనేక విషయాలెన్నింటినో ఆయన వివరించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంలోని ఆంతర్యాన్ని విడమరిచి చెప్పారు. చంద్రబాబు నాయుడు చవకబారు రాజకీయాలను ఎండగట్టారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రత్యేకహోదా విషయంలో మాటమార్చడం, నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి అధికారం పంచుకుని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ తో కలిసి కాపురం చేయడం వంటి చంద్రబాబు ద్వంద వైఖరులను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఏపీలో చంద్రబాబు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించారు. ప్రస్తుతం సాక్షి టీవీలో ప్రసారం అవుతున్న ఈ స్పెషల్ ఇంటర్వ్యూ కోసం ఇక్క డ క్లిక్ చేయండి. లైవ్.. వైఎస్ జగన్ స్పెషల్ ఇంటర్వ్యూ.. స్పెషల్ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అందుకే అసెంబ్లీ బహిష్కరించాం.. ‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం. అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మోదీతో కలిసి ప్రచారం చేశారు. జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని ప్రచారంలో చెప్పారు. గత ఐదేళ్లలో మేం ఎక్కడా కాంగ్రెస్‌తో కలిసింది లేదు. చంద్రబాబు మాత్రం నాలుగన్నరేళ్లు బీజేపీతో సంసారం చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ కేంద్రంలో పెట్టిన బడ్జెట్‌ను సైతం పొగిడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో మళ్లీ చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు బీజేపీని తిడుతూ.. మళ్లీ కాంగ్రెస్ పార్టీతో జోడి కట్టారు. గతంలో బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్నారు. రెండు పార్టీలతో జతకట్టిన చంద్రబాబు.. వాళ్లతో కలిశారు.. వీళ్లతో కలుస్తారు అని మా పై విమర్శలు చేస్తున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం రాలేదు. కానీ వడ్డీలు కట్టమని నోటీసులు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన మోసంతో రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయారు. కేసీఆర్ ముందుకు రావడం హర్షణీయం.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. ఇక ఏపీలో ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది. హోదా ఇవ్వగలిగే స్థానంలో ఉండి ఇవ్వకుండా బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. ప్రత్యేక హోదాకు అనుకూలంగా కేసీఆర్ మాట్లాడిన దానిని స్వాగతించాలి. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని ముందుకు రావడం హర్షణీయం. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలతో పోరాటం చేసి కేసీఆర్ గెలిచారు. గత ఐదేళ్లలో కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీతో ఎక్కడా సంసారం చేయలేదు. హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకుని.. కలిసి పోటీ చేద్దామని కేటీఆర్‌తో చంద్రబాబు మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ఒప్పుకున్నారు. మేం ఎవరితో పొత్తు పెట్టుకోం.. చంద్రబాబుకు ఓటేయమని పవన్ కల్యాణ్ ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంలో చంద్రబాబు, బీజేపీ, పవన్ ముగ్గురికి పాత్ర ఉంది. మేం గతంలో ఎవరితోను పొత్తు పెట్టుకోలేదు.. ఈ సారి కూడా ఎవరితోను పొత్తు పెట్టుకోము. మాకు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకం ఉంది. ఇప్పటికీ చాలాసార్లు మోసపోయాం. నేను ఏపీ ప్రజల ప్రతినిధిగా మాట్లాడుతున్నా. ఇస్తాం.. ఇస్తాం.. అని చెప్పి చాలా మంది మోసం చేశారు. కాంగ్రెస్ చేస్తామని చేయలేదు.. పవన్, మోదీ వచ్చి అదే మోసం చేశారు. అందుకే ఏపీ ప్రజలు మరోసారి నమ్మి మోసపోయే స్థితిలో లేరు. 25 మంది ఎంపీలను మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత ఎవరు హోదాకు సంతకం పెడతారో వారికే మద్దతిస్తాం. హామీలు నెరవేర్చకపోతే.. రాజీనామా చేస్తా.. ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ పునాదులు దాటలేదు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతప్రతాలు ఒక బూటకం. ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. రైతు రుణమాఫీని సమర్ధించను అని ఎప్పుడు చెప్పను. రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించే నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే.. ముందుగా సంతోషించేది నేనే. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతా. పాదయాత్ర మొదలు పెట్టక ముందే.. రైతు భరోసా గురించి చెప్పాను. ప్రతి రైతు కుటుంబానికి మే నెలలో రూ.12,500 ఇస్తాం. నాలుగు దఫాలుగా రూ.50 వేలు చొప్పున ఇస్తాం. మన రాష్ట్రంలో చిన్న కమతాలు ఉన్న రైతులే ఎక్కువ. అందుకే రైతు భరోసా రైతు కుటుంబాన్ని ఒక యునిట్‌గా తీసుకున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని.. చంద్రబాబు తన హెరిటేజ్ ద్వారా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. నాలుగేళ్లు కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగినా.. చంద్రబాబు పొగుడుతూ వచ్చారు. చంద్రబాబు అవినీతి చేస్తున్నా.. మన భాగస్వామియే కదా అని మోదీ వదిలేశారు.’ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన కడప జిల్లా ఉల్లి రైతులు
-
3600 కి.మీ పౌలురాయిని దాటిన వైఎస్ జగన్ పాదయాత్ర
-
కాసేపట్లో 3600 కి.మీ చేరుకోనున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
ప్రజాసంకల్పయాత్రలో మరో కీలక ఘట్టం
సాక్షి, శ్రీకాకుళం : ప్రజాసంకల్పయాత్ర మరో కీలక ఘట్టానికి చేరుకుంది. అలుపెరుగుని పాదయాత్రికుడు మరో చరిత్రకు నాంది పలికారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి అరాచక పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది కాలంగా చేస్తున్న ప్రజాసంకల్పయాత్రలో శనివారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాసంకల్పయాత్ర@3600 : వెల్లువలా జనం వెంటనడువగా... శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని బారువ జంక్షన్ వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 3600 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా జననేత.. ఈ మైలురాయికి గుర్తుగా వేప మొక్కను నాటి, పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కీలక ఘట్టంలో భాగమయ్యేందుకు ప్రజలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు జననేత అడుగులో అడుగేశారు. శనివారం ఉదయం వైఎస్ జగన్ సోంపేట మండలంలోని తురకశాసనం నుంచి 337వరోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రాజన్నతనయుడి పాదయాత్ర పాలవలస, కొర్లాం మీదుగా బారువ కూడలి వరకు కొనసాగింది. అక్కడి నుంచి లక్కవరం చేరుకోగానే నేటి పాదయాత్ర ముగుస్తోంది. జనం మద్దతుతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్న జగన్ పాదయాత్ర.. 9న ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో ముగియనుంది. -
ఇడుపులపాయ - ఇచ్ఛాపురం విజయసంకల్పం
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు
-
వైఎస్ జగన్‌ను కలిసిన జీడిపిక్కల కార్మికులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన యాదవ సంఘాల నాయకులు
-
ముగిసిన 334వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఆశా వర్కర్లు
-
శవాలమీద పేలాలు ఏరుకునే రకం చంద్రబాబు : వైఎస్ జగన్
-
వైఎస్ జగన్‌ను కలిసిన నవ్వులరేవు గ్రామ మత్స్యకారులు
-
పలాస శ్రీకాకళం జిల్లా వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఆగ్రిగోల్డ్ బాధితులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన భవనపాడు పోర్టు నిర్వాసితులు
-
‘అందరి ఆరోగ్యం చూసుకొనే తమకే భద్రత లేదు’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆరోగ్యమిత్రలు ఆదివారం కలిశారు. 2003 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నా తమను రెగ్యులర్ చేయడం లేదని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమను రెగ్యులర్ చేయకపోగా ఏ విధమైన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయడంలేదని చెప్పారు. ఫలితంగా అందరికీ ఆరోగ్యం అందించేందుకు పనిచేసే తమకే ఆరోగ్య భద్రత లేకుండా పోయిందని వాపోయారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు తమ గోడును తెలియజేస్తూ జననేతకు వినతిపత్రం ఇచ్చారు. నేటి పాదయాత్ర ఇలా.. ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 333వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం పలాస నియోజకవర్గంలోని ఉండ్రుకుడియ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటాపురం, మహదేవిపురం క్రాస్, గరుడఖంది వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ లంచ్ విరామం తీసుకుంటారు. విరామం అనంతరం చినబాదాం మీదుగా పలాస-కాశిబుగ్గ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం పలాస-కె.టి రోడ్డులో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. -
వైఎస్ జగన్‌ను సన్మానించిన కళింగ వైశ్యులు
-
ముగిసిన 332వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
పలాస నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ పాదయాత్ర
-
గిరిజన సంక్షేమ సంఘాల జేఏసీ శిబిరాన్ని సందర్శించిన వైఎస్ జగన్
-
ఆటోవాలా పథకంపై జననేతకు కృతజ్ఞతలు తెలిపిన ఆటోడైవర్లు
-
332వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 332వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలంలోని రంగడి ఘాటి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి తూముకొండ, పెద్దమాడి స్కూల్, హేరాపురం, పెద్దమాడి గ్రామం మీదుగా చీపురుపల్లి వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ లంచ్ విరామం తీసుకుంటారు. విరామం అనంతరం పలాస నియోజవర్గంలోని రేగులపాడు, టెక్కలిపట్నం, మోదుగులపుట్టి మీదుగా ఉండ్రుకుడియా క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. -
వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు నేను తోడుగా ఉంటాను..
-
చంద్రబాబు హయాంలో అన్నీ గోవిందా..
-
ముగిసిన 329వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
వైఎస్ జగన్‌ను కలిసిన విశ్వ బ్రాహ్మణులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన టెక్కిలి ఆర్టీసీ కార్మిక సంఘాలు
-
పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశంచిన ప్రజా సంకల్పయాత్ర
-
వైఎస్ జగన్‌ను కలిసిన సమస్యలు చెప్పుకున్న గూడెం గ్రామస్తులు
-
వైఎస్ జగన్ చేతుల మీదుగా వడ్డెర సంఘం ప్రారంభించిన ప్రతినిధులు
-
ముగిసిన 328వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే
-
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ టెక్కిలి
-
బాబు నవగ్రహాలను కంట్రోల్ చేస్తున్నానని మాట్లాడుతున్నాడు
-
సిపిఎస్ రద్దు చేస్తామని పకటించిన వైఎస్ జగన్
-
పచ్చ చొక్కాలు ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారు
-
చంద్రబాబు.. ప్రత్యేకంగా శాటిలైల్ను ఆకాశంలోకి పంపారా?
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, టెక్కలి/శ్రీకాకుళం: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన అనుచరులు శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కోలగట్ల వీరబ్రహ్మేంద్రస్వామి పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 328వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని దామోదరపురం క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రావివలస, నౌపడ క్రాస్, జయకృష్ణాపురం, గోపినాథపురం మీదుగా టెక్కలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం టెక్కలిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మరో మైలురాయి.. ప్రజాక్షేత్ర యాత్రికుడు, జననేత వైఎస్ జగన్ అలుపెరుగని పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. రావివలస వద్ద 3500 కిలోమీటర్ల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి మొక్కను నాటారు. -
‘జగన్ అన్న ఫర్ సీఎం’
సాక్షి, అమరావతి: ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు నవరత్న కార్యక్రమాలు సహా అనేక పథకాలను అమలు చేయడానికి నిర్ణయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వీటిపై సమగ్ర సమాచారంతో ‘జగన్ అన్న ఫర్ సీఎం’ అనే నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజా సంకల్పయాత్రలో ఈ వెబ్‌సైట్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించింది. నవరత్నాలు, మీడియా, గ్యాలరీ, ప్రజా సంకల్ప యాత్ర, వైఎస్సార్ కుటుంబం, జగన్ స్పీక్స్ విభాగాలుగా ఇందులో ఆయా అంశాలను పార్టీ పొందుపరిచింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నవరత్న కార్యక్రమాలు, ఇతర పథకాల అమలు ద్వారా ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని పంచేందుకు వీలుగా అందరి తోడ్పాటుకు పిలుపునిచ్చింది. ఆయా కార్యక్రమాలపై సవివరంగా సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచారు. వైఎస్సార్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, అందరికీ పక్కా ఇళ్లు, వైఎస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్లు, మద్యవిధానం ఇలా ఆయా అంశాలను వివరించారు. ఈ వెబ్సైట్లో డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అభిమానులు, ప్రజాశ్రేయస్సుకోరే వారంతా కార్యక్రమాల అమలుకు చేయూతనందించవచ్చు. ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పార్టీ నేతల సమక్షంలో వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేలా భగవంతుడి ఆశీస్సులు లభించాలని వేదపండితులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భూమన కరుణాకరరెడ్డి, తలశిల రఘురాం, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి, పీఏసీ సభ్యులు పాలవలస రాజశేఖరం, ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ పాతపట్నం, ఎచ్చెర్ల, టెక్కలి, పలాస నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్టీ నేతలు నర్తు రామారావు, ప్రధాన రాజేంద్ర, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, దువ్వాడ వాణి, చింతాడ మంజు, హనుమంతు కిరణ్‌కుమార్, తమ్మినేని చిరంజీవి నాగ్, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి భారీగా టీడీపీ శ్రేణులు శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కలమట వెంకటరమణ మరదలు, టీడీపీ నాయకురాలు కలమట సుప్రియ తన అనుచరులతో కలిసి పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ నేతలు కూడా పార్టీలో చేరారు. సుప్రియ మాట్లాడుతూ టీడీపీ పాలనలో అర్హులకు పథకాలు అందడం లేదన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు. కాశీపురంలో కలమట సుప్రియకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రతిపక్ష నేత కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షుడి చేరిక అలాగే మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షుడు బి.మునుస్వామి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. -
327వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 327వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. -
జనధాత్రిపై జగన్ కేతనం
జననేత వైఎస్ జగన్ జన్మదినం నేడు. ఓ ఉత్సాహం... పట్టుదల, పోరాటాల బాట, అకుంఠిత దీక్షకు సంకేతం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో తెలుగు ప్రజలకు ఆయన ఒక ఆశాజ్యోతి. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎదుర్కొని ఎదిగిన పోరాట యోధుడు జగన్. ఒకానొక సందర్భంలో ఆళ్లగడ్డ బహిరంగ సభలో ప్రసంగిస్తూ తనపై దాడి చేయవచ్చని తన కాళ్లు, చేతులు విరగ్గొట్ట వచ్చని తనను విగతజీవిని చేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నించవచ్చని.. అయినా, తాను సముద్రం లోని కెరటంలా ఉవ్వెత్తున ఎగసిపడుతూ మళ్లీ ప్రజ లతో కలసి పోరాటం చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. నేడు జన్మదినం జరుపుకుంటున్న జగన్‌ను భారత న్యాయ వ్యవస్థలో కనీవినీ ఎరుగని రీతిలో 16 నెలలు బెయిల్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వం కలిసి ఆయనను నిర్బంధించాయి. ఒకవైపు తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటూ వైఎస్సార్సీపీని బలమైన ప్రతిపక్షంగా జగన్ తీర్చిదిద్దారు. తొమ్మిదేళ్ల రాజ కీయ ప్రస్థానంలో ఇంత విస్తృతంగా ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు దక్షిణ భారతదేశంలోనే అరుదుగా కనిపిస్తారు. ఆయన ఓదార్పుయాత్ర, రైతు భరోసాయాత్ర, ప్రత్యేక హోదాపై పోరు ఇందుకు నిదర్శనం. 10 కిలోమీటర్ల పరిధిలో రెండు భారీ బహిరంగ సభలు జరిపిన చరిత్ర ఎవరికీ లేదు. ఆయన జరుపుతున్న ప్రజాసంకల్పయాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రత్యేకహోదా ఆవశ్యకతను జగన్ గుర్తించినంతగా వేరే ఏ పార్టీ నాయకులు గుర్తించలేదు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చిన పార్టీకే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ధైర్యంగా ప్రకటించిన ధీశాలి జగన్. అలాగే పోలవరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలను జగన్ ఎండగట్టినంతగా మరెవరూ వెలుగులోకి తేలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ లాంటి అనేక విభజన హామీలు అమలుపరచలేదని కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకున్న నిఖార్సైన నాయకుడు జగన్. రాజధాని నిర్మాణంలో అవి నీతి అక్రమాలను ప్రశ్నించిన నాయకుడు కూడా వైఎస్ జగనే. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ప్రాంతాల మధ్య సమతుల్యత జరగాలని నినదించిన నాయకుడు జగనే. నేడు పోరాటాలకే జగన్ స్ఫూర్తి. కాంగ్రెస్ పార్టీని ఆయన వదిలిన తీరూ, తను, తన తల్లి పార్లమెంట్, అసెంబ్లీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసి నేడు ఒక బలమైన పార్టీగా ఎదిగి వచ్చిన తీరు రాజకీయ పార్టీలకు ఓ ఆదర్శం. తన పార్టీలోని 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచులను బాబు కొనుగోలు చేసి జగన్‌ను దెబ్బతీయాలనుకున్నా ఆయన చలించలేదు. తనపై భౌతి కంగా దాడి జరిగినప్పుడు కూడా ఆయన నిబ్బరంగా వ్యవహరించారు. రాష్ట్రంలో జగన్ అంటే జనం.. జనం అంటే జగన్.. ఇదే నేడు మనకు కనిపిస్తున్న వాస్తవం. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని రైతులకు ద్రోహం చేయడాన్ని, నిరుద్యోగ యువతను మోసగించడాన్ని, డ్వాక్రా మహిళలకు ద్రోహం చేయడాన్ని ఆయన వందలాది సభలలో బట్టబయలు చేశారు. వైఎస్సార్ తనయుడిగా ఆ మహా నుభావుడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల దివిటీని కొనసాగించే ధీశాలిగా జగన్ ఎదిగారు. నేడు జగన్ నిరంతరం ప్రజల్లో ఉండి రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేక వాతావరణం కల్పించగలిగారు. ప్రజలల్లో వైఎస్సార్సీపీ పట్ల సానుకూల వాతావరణ కల్పించారు. నేడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థి జగనే. 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో అభ్యర్థి జగనే. ఈ భావనతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్ సమన్వయకర్తలు పని చేయాలి. రాష్ట్ర ప్రజలు జగన్‌ను ఆశీర్వదించి సీఎంగా ఎన్నుకోవడానికి కృషి చేయాలి. దివంగత నేత వైఎస్‌కు నివాళిగా తనయుడు జగన్‌ను సీఎం చేయడం ద్వారా ఆయనకు శుభాభినందనలు అందించినవారమవుతాం. వ్యాసకర్త : ఇమామ్, కదలిక సంపాదకులు మొబైల్ : 99899 04389 -
326వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 326వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం దుర్గమ్మ పేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లక్ష్మీపురం క్రాస్, సవరపేట క్రాస్, శివరాంపురం క్రాస్, సంతబొమ్మళి, బోరభద్ర క్రాస్, జగన్నాథపురం క్రాస్, వడ్డి తాండ్ర మీదుగా దండుగోపాలపురం వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు. -
‘జగన్‌కు జనాదరణ చూడలేకే ఇలా చేస్తున్నారు’
సాక్షి, ఆముదాలవలస: ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణను ఓర్వలేక టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుటుంబంపై చేస్తున్ననిరాధార ఆరోపణలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఆముదాలవలస బహిరంగ సభలో వైఎస్ జగన్ అసత్యాలు మాట్లాడారన్న ప్రభుత్వ విప్ కూన రవి వ్యాఖ్యలను తమ్మినేని ఖండించారు. ‘సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ నాయకులు మా నాయకుడిపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే. అందుకే న్యాయదేవత ముందు ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. దైర్యముంటే కూన రవి అక్రమాలపై విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి బహిరంగ విచారణకు రావాలి. టీడీపీ నేతల ఆరోపణలపై చర్చించడానికి మేము సిద్దం. ల్యాండ్ మాఫియా, స్యాండ్ మాఫియా చేసిన చరిత్ర తెలుగుదేశం నేతలది. వెన్నెల వలసలో త్రిపుల్ ఐటీకి 50 ఎకరాల స్థలం లేదన్న కూన రవి.. పూల సాగుకు కోసం 99 ఎకరాలు కేటాయించడానికి ఎలా ప్రతిపాదన చేసారు’ అని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
ఆముదాలవలసలో అవినీతి రాజ్యం : వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం : ఆముదాలవలసలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 319వ రోజు మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగన్నరేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్.. ప్రజలు అవినీతి పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా.. ‘చంద్రబాబు సీఎం కాగానే ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ నష్టాలకు వెళ్లింది. ఆదుకోవాల్సిన చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీని రూ. 6.40 కోట్లకు కావాల్సిన వారికి అమ్ముకున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. రైతులంతా కోర్టు మెట్లు ఎక్కితే.. హైకోర్టు ఆపమని ఆర్డరిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. మళ్లీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ కేసును సుప్రీం నుంచి ఉపసంహరించారు. 2014 ఎన్నికల్లో ఆ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి ఆ హామీని నిలబెట్టుకోలేదు. మీ అందరి దీవెనెలతో అధికారంలోకి రాగానే ఆ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాను. అవినీతిలో చంద్రబాబు డాన్ అయితే.. ఆయన అవినీతి సామ్రాజ్యంలో ఇక్కడున్న ఎమ్మెల్యే చోటా డాన్. జిల్లాలో ఇసుక దోపిడీకి అడ్డుఅదుపే లేకుండా పోయింది. ఈ దోపిడీ బయటకు తెలియజేయడానికి వంశధార నది ఉగ్రరూపం దాల్చి వరదతో ముంచెత్తింది. అక్రమంగా ఇసుకు తీసుకెళ్లడానికి ఉన్న లారీలు, జేసీబీలు.. నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో ఇసుక లూటీ ప్రపంచం మొత్తానికి తెలిసింది. అయినా ఆ లూటీ చేసిన ఎమ్మెల్యే, చిన్నబాబుల మీద ఏలాంటి చర్యలుండవు. ఖాళీ స్థలం కనబడితే పాపం.. కొత్త ఉద్యోగాల గురించి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలన్నీ ఊడిపోతున్నాయి. ప్రభుత్వ భూమి కనబడితే కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆముదాలవలస పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ప్రభుత్వస్థలాన్ని కొట్టేసి టీడీపీ కార్యాలయం కట్టాలని చూస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ ఆందోళన చేయాల్సి వచ్చింది. వంశాధార, నాగవళి అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. వైఎస్సార్ తర్వాత కరకట్టల నిర్మాణం కోసం కనీసం చంద్రబాబు ఆలోచన కూడా చేయలేదు. నారయణపురం ఆనకట్టతో 37 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. శిథిలావస్థకు చేరిన ఆనకట్టను పునర్ నిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎక్కడైనా ఆనకట్ట పునర్నిర్మాణం కనిపించిందా? చంద్రబాబు పాలనలో అంతా మోసం.. తిత్లీ తుపాన్ వస్తే రూ. 3435 కోట్ల నష్టమని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. బాధితుల కోసం చంద్రబాబు ఖర్చు చేసింది కేవలం రూ. 520 కోట్లేనని, బాధితులను పూర్తిగా ఆదుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. నిజంగా తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకున్నారా? జాబు రాకుంటే నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు రూ. 1000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. రుణాల మాఫీ పేరుతో రైతులను దగా చేశారు. డీలర్ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మెలను మోసం చేశారు. ఆరోగ్య శ్రీని పాతరేశారు. జన్మభూమి కమిటీలు రాష్ట్రాన్ని దోచేస్తున్నాయి. ఆముదాలవలస నియోజవర్గంలో పెన్షన్లలో అక్రమాలు పెరిగాయి. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఇలాంటి అన్యాయమైన పాలన పోవాలంటే మీ సహకారం కావాలి.’ అని అధికారంలోకి రాగానే నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
‘ఆయన పాలనెప్పుడు ముగుస్తుందా అని చూస్తున్నారు’
సాక్షి, తణుకు/పశ్చిమగోదావరి : నాలుగు సంవత్సరాల టీడీపీ అరాచక పాలనలో ప్రజలందరూ విసిగి పోయారనీ, చంద్రబాబు పాలనెప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వడానికే తమ నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. గత 13 నెలలుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలు చెప్తున్నారని అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని సుబ్బారెడ్డి అన్నారు. తణుకులో జరిగిన కార్తీక వన సమారాధన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని మండిపడ్డారు. ‘ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే ప్రజలకు ఉపయోగపడాలి. కానీ, ఏపీలో పచ్చ చొక్కా లీడర్లు దోచుకోవడానికే పథకాలు తెస్తున్నారు’అని విమర్శలు గుప్పించారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఇంటిట్రేడ్ స్కామ్ బాధితులు
-
307వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
నా కొడుకుని చంపేశారు
శ్రీకాకుళం , వీరఘట్టం: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుకున్న తమ కుమారుడు ఉగిరి హర్షవర్ధన్‌ను ఈ ఏడాది జూలై 24న కళాశాలకు చెందిన కొందరు వ్యక్తులు మేనేజ్మెంట్తో కలసి హత్య చేయించారని తల్లిదండ్రులు వెంకటరమాప్రసాద్, నాగమణిలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వీరఘట్టం వచ్చిన వైఎస్ జగన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. టెక్కలి సమీపంలో రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కళాశాల యాజమాన్యం సృష్టించారని తెలిపారు. హర్షవర్దన్ మృతి చెంది మూడు నెలలు గడిచినా పోలీసుల దర్యాప్తు మొక్కుబడిగానే మా రిందని తల్లిదండ్రులు వాపోయారు. నేటికీ ఈ కేసు గురించి ఏమీ తెలియలేదని చెప్పారు. తమ కుమారుడిని కళాశాలకు చెందిన కొందరు సీనియర్ విద్యార్థులు, యాజమాన్యంతో కలసి హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించారని హర్షవర్ధన్ తండ్రి వెంకటరమాప్రసాద్ అన్నారు. గత మూడు నెలలుగా ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్‌ను, పోలీసు ఉన్నతాధికారులందరినీ కలసి విన్నవించుకున్నామని చెప్పారు. సాక్షాత్తు ఎస్పీ హామీ ఇచ్చినా దర్యాప్తు సమగ్రంగా జరగడం లేదని వాపోయారు. గత నాలుగు నెలలుగా తాము పడుతున్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదని, తమకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని వైఎస్ జగన్‌ను కోరారు. -
సీపీఎస్ రద్దు చేయాలి’
శ్రీకాకుళం ,వీరఘట్టం: ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, పదవీ విరమణ అనంతరం ఆర్థిక భరో సా లేక ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వీరఘట్టం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విక్రం పురం సమీపంలో కలిసి వినతి పత్రం అందించారు. జిల్లాలో సుమారు 12 వేల మంది పైబడి ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ విధానంలో ఉన్నారని వీరి భవితకు ఈ విధానం వల్ల తీవ్ర ముప్పు వాటిల్లనుందని అన్నారు. వైఎస్సార్ సీపీతో ఈ విధానం రద్దు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
జగన్‌తోనే పేదలకు న్యాయం
శ్రీకాకుళం :‘నాయనా.. నాకు వస్తున్న పింఛన్ నా మందులకే సరిపోవడం లేదు. పింఛన్ డబ్బు పెంచితే మా బతుకు మెరుగుపడుతుంది. మాలాంటి వృద్ధులను ఆదుకోవాలి నాయనా..’ అని వీరఘట్టం మండలం విక్రంపురం గ్రామానికి చెంది న పిన్నింటి నారాయణమ్మ అనే వృద్ధురాలు కోరారు. దీనికి స్పందించిన జగన్ మన ప్రభుత్వం రాగానే పింఛన్ డబ్బును రూ.2వేలు చేస్తామవ్వా అని సమాధానమిచ్చారు. రేషన్ కార్డు లేదన్నా.. నా భర్త తాలాబత్తుల గణేష్ మూడేళ్ల కిందట నాటుబండి కింద పడి చనిపోయారు. కనీసం బీమా కూడా రాలేదు. ఇంతవరకు ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేయలేదు. కొత్త రేషన్ కార్డు కూడా రాలేదు. కూలి చేసుకుంటూ పిల్ల ల్ని చదివించడం కష్టంగా ఉంది. నా లాంటి వాళ్లను ఆదుకోవాలి.– తాలబత్తుల రాజేశ్వరి, కొత్తపల్లి గ్రామం,గరుగుబిల్లి మండలం, విజయనగరం జిల్లా. రూ.1500 రావడం లేదన్నా.. ‘అన్నా.. నేను దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాను. మా అమ్మ, నాన్న సాదు గోవింద, కృష్ణవేణిలు చెన్నై పట్టణానికి వలస వెళ్లి కూలిపనులు చేసుకుంటున్నా రు. నాకు రూ.వెయ్యి మాత్రమే పింఛన్ వస్తోందన్నా.. రూ.1500 వస్తే గానీ నా మందులకు సరిపోదు’ అని వీరఘట్టం మండలం నడుకూరు గ్రామానికి చెం దిన సాదు భారతి విన్నవించగా.. కలెక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. తోటపల్లి నీరు రావడం లేదు.. తోటపల్లి ఎడమ కాలువ ఒకటో బ్రాంచి చానల్ పిల్ల కాలువ ద్వారా గడిచిన పదేళ్లుగా మా పంటపొలాలకు సాగునీరు అందడం లేదు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఏటా 300 ఎకరాల్లో పంట కు నష్టం కలుగుతుంది. మా సమస్య పరిష్కరించాలన్నా.– కురిటి సిద్ధార్థ, రైతు, నడుకూరు గ్రామం, వీరఘట్టం కారుణ్య నియామకం చేపట్టాలి కారుణ్య నియామకం చేపట్టి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. మా నాన్న అన్ను సత్యం వీఆర్ఏగా పనిచేసి 2013 లో మరణించారు. ఇంతవరకు కారుణ్య నియామకాల్లో భాగంగా మా కుటుం బంలో ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నా. మా అమ్మ తవిటమ్మ, లేకపోతే ఉన్నత చదువులు చదువుకున్న మా అన్నదమ్ములు అన్ను మహేశ్వరరావు, అన్ను ప్రసాద్, అన్ను నారాయణల్లో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించండన్నా.– అన్ను గోవిందమ్మ, వీరఘట్టం జగన్‌తోనే పేదలకు న్యాయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అన్యాయం చేస్తున్నారు. అందుకే జగన్ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. ఆయనను చూడడానికే వచ్చాం. ఆయన అధికారంలోకి వస్తే మా బతుకులు బాగు పడతాయన్న ఆశ ఉంది. – పైల లక్ష్మి, విక్రంపురం,వీరఘట్టం మండలం -
అన్నపై అభిమానంతో..
శ్రీకాకుళం :ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం నుంచి జగనన్నను ఫాలో అవుతున్నారు పాలకొండ పట్టణానికి చెందిన రాగోలు ప్రసన్న. యాత్ర ప్రారంభం నుంచి ఇప్పటివరకు వివిధ పత్రికల నుంచి క్లిప్పింగ్‌లు సేకరించి 12 ఆల్బమ్‌లు తయారు చేశారు. ఆ ఆల్బమ్‌లను జగన్‌కు చూపించి మురిసిపోయారు. తనపై చూపిన అభిమానానికి జగన్ ఆనందం వ్యక్తం చేశారు. -
ఏ ఆధారం లేదన్నా..
శ్రీకాకుళం :‘నా భర్త చనిపోయాడు. ఆరేళ్ల కుమార్తె పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఏ ఆధారం లేకపోవడంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాను. డిగ్రీ చదివినా ఎలాంటి ఉద్యోగావకాశాలు రాలేదు. కూతురి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది’ అంటూ వీరఘట్టం మండలం విక్రంపురానికి చెందిన కోటేశ్వరి జగన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె సమస్యలను విన్న జగన్ త్వరలోనే న్యాయం చేస్తానని ధైర్యం చెప్పారు. -
వస్తున్నాడయ్యో...సామి!
సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శనివారం కురుపాం నియోజకవర్గంలో పునఃప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రికే ఆయ న జియ్యమ్మవలస శిఖబడివద్ద ఏర్పాటుచేసిన రాత్రిబసకు చేరుకున్నారు. శనివారం ఉదయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలో గడచిన రెండు నెలలుగా పాదయాత్ర కొనసాగుతోంది. ఆయన్ను చూసిన ప్రతి పల్లె నిలువెల్లా పులకిం చింది. తొమ్మిది నియోజకవర్గాల్లో వేలాది బాధితులు తమ కష్టాలను కలబోసుకున్నారు. సమస్యలను నివేదించారు. వినతులు అందించారు. వారందరి వేదన కూలంకషంగా తెలుసుకుని మరికొద్ది రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందనిభరోసా కల్పిస్తున్నారు. తొమ్మిది నియోజకవర్గాల్లోనూ జనసందోహం ఇంతవరకు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఆయన ప్రసంగంతో ఉత్తేజితులయ్యారు. సెప్టెంబర్ 24న జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర మరో రెండు రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు చేరుకోనుంది. ఇన్నాళ్లూ తమలో కలసి మెలసి తిరిగిన జననేత జిల్లా దాటి వెళ్తున్నారని తెలుసుకున్న జనం భారంగానే ఆయనకు ఘన వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. నేటి ప్రజాసంకల్పయాత్ర ఇలా.... జననేత జగన్మోహన్రెడ్డి శనివారంనాటి పాదయాత్ర వివరాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. శనివారం ఉదయం 7.30 గంటలకు జియ్యమ్మవలస మండలం శిఖబడి క్రాస్ రాత్రిబస వద్ద ప్రారంభమై తురకనాయుడువలస వరకు సాగుతుందన్నారు. శిఖబడి క్రాస్ వద్ద ప్రారంభమై బి.జె.పురం, గెడ్డతిరువాడ మీదుగా ఇటికకు చేరుకుంటుందని చెప్పారు. అక్కడి నుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం కుందర తిరువాడ క్రాస్, చినకుదమ క్రాస్ మీదుగా తురకనాయుడువలసకు చేరుకుని అక్కడ రాత్రి బసచేస్తారని వివరించారు. -
బహిరంగ సభను విజయవంతం చేయండి
శ్రీకాకుళం,పాలకొండ: ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పాలకొండలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పాలకొండలో పర్యటించి సభ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు అందించారు. జూనియన్ కళాశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మధ్యలో సభ ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవల విక్రాంత్ వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. వడమ రహదారి కూడలి వరకూ పాదయాత్ర నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. 29న అన్నవరం నుంచి పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు సభ ఏర్పాట్లు పరిశీలించారు. వీరితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
పాదయాత్రకు సన్నద్ధం కావాలి
శ్రీకాకుళం రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సన్నద్ధం కావాలని ఆ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 25న వీరఘట్టం మండలంలోని కెల్ల గ్రామానికి పాదయాత్ర చేరుకోనుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజా సంకల్ప యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ రెండో వారంలో శ్రీకాకుళానికి యాత్ర చేరుకుంటుందని, ఆ సమయంలో ఘన స్వాగ తం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జగన్ రాక సందర్భంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేద్దామని కా ర్యకర్తలను ఉత్సాహపరిచారు. పాదయాత్ర చరిత్రగా నిలిచిపోవాలని సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ఎన్నికల షె డ్యూల్ ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని ధర్మాన తెలిపారు. జగన్ పాదయాత్ర కూడా జనవరి 10న ఇచ్ఛాపురంలో ముగిం చే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం వెళ్లని గ్రామాలకు తర్వాత మరో యాత్ర ద్వారా జగన్ వెళ్తారని చెప్పారు. ప్రజా సంకల్ప పా దయాత్రలో కమిటీలు కీలక పాత్ర పోషిం చాలని సూచించారు. సోషల్ మీడియాను కూడా సమర్థంగా వాడాలని సూచిం చారు. టీడీపీ అవినీతిని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో యు వజన విభాగపు నాయకులు ధర్మాన రామ్మనోహర్ నాయుడు, పార్టీ నాయకులు ఎంవీ పద్మావతి, హనుమంతు కిరణ్, డీసీఎంఎస్ గొండు కృష్ణమూర్తి, అంబటి శ్రీనువాసరావు, చల్లా రవికుమార్, అంధవరపు సూరిబాబు, మార్పు ధర్మారావు, అల్లు లక్ష్మీనారాయణ, సాధు వైకుంఠం, పీఏసీఎస్ గొండు కృష్ణ, బరాటం రామశేషు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గిరిసీమల్లో జనబాంధవుడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చుట్టూ కొండలు... మధ్యలో పచ్చని పంట పొలాలు.. సుందరమైన ప్రకృతి... ఆ ప్రకృతి ఒడిలో ప్రధాన మార్గాలకు దూరంగా... ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నిశ్శబ్దంగా ఉండే ఆ పల్లెల గుండె గడపకు పండగొచ్చింది. జన హృదయం ఉప్పొగింది. జగమంత అభిమానం వెల్లువెత్తింది. చెరగని చిరునవ్వుతో తమ కష్టాలు వినేందుకు ముంగిటకు వచ్చిన రాజన్న బిడ్డను చూసి ఆనందపారవశ్యమైంది. ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్సార్సీపీ అ«ధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రకు అడుగడుగునా నీరాజనం లభిస్తోంది. పూలబాటలు వేసి... మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఠీవిగా సాగుతూ... ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర బుధవారం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం కురుపాం నియోజకవర్గ కేంద్రం క్రాస్ వద్ద ప్రారంభమై దాసరిపేట, తాళ్లడుమ్మ, చినమేరంగి, అల్లువాడ వరకూ సాగింది. అక్కడి నుంచి మధ్యాహ్న భోజనానంతరం పెదతుంబలి, చినతుంబలి, జోగులడుమ్మ మీదుగా శిఖబడి క్రాస్ వరకూ చేరుకుని ముగిసింది. మధ్యాహ్న భోజనా నంతరం చినమేరంగి చేరుకున్న జననేతకు అపూ ర్వ రీతిలో అభిమానులు స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఊరువాడా కదలివచ్చారు. పెద్ద సంఖ్యలో సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు మంగళహారతులు పట్టారు. పలువురు గ్రామస్థులు నోట్ల దండలతో స్వాగతం చెప్పగా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పరీక్షిత్‌రాజు దంపతులు మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు విగ్రహాన్ని జననేతకు బహూకరించా రు. యాదవులు గొర్రెపిల్లను బహూకరించి జననేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అన్నా మా వేదనను తీర్చండి: జననేత వద్ద ఆపన్నులు బారులు తీరుతున్నారు. అన్నా... మా వేదన తీర్చండి అంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. షాదీముబారక్ పథకం అమల్లో లోపాలపై ముస్లిం మహిళలు ఫిర్యాదు చేశారు. అర్హులకు ఈ పథకం అందటం లేదని, అప్పులు చేసి పెళ్ళిళ్లు చేసుకోవాల్సి వస్తోందని వాపోయారు. దాసరిపేటలో చినమేరంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాలలోని అసౌకర్యాలను వివరించారు. చినమేరంగిలో పలువురు యువత, విద్యార్థులు బాబు వస్తే జాబు వస్తుందని నమ్మి మోసపోయామన్నారు. అల్లువాడ శివారులో పలువురు గిరిజన రైతులు మహానేత హయాంలో పక్కాగా అమలైన అటవీ హక్కుల చట్టం ఇప్పుడు పూర్తిగా నీరుగారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని 36 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి, పండించిన పంటను నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. శెట్టిబలిజ కులస్తులు తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్ధిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయ్యరకుల సంఘం నాయకులు బీసీ–డీలో ఉన్న తమను బీసీ–ఏలోకి మార్చినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. తమకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక సాయం చేయాలన్నారు. పాదయాత్రలో పార్టీ శ్రేణులు: పాదయాత్రలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కురుపాం, కడప ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, హమ్జాత్బాషా, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు, విజయనగరం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, బెల్లాన చంద్రశేఖర్, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, ఎస్‌కోట, పార్వతీపురం, పాతపట్నం నియోజకవర్గాల సమన్వయకర్తలు కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, రెడ్డి శాంతి, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కావలి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంటరీ రైతు విభాగం అధ్యక్షుడు బూరుగుపల్లి సుబ్బారావు, పశ్చిమగోదావరి యువజన విభాగం అధ్యక్షుడు యోగేంద్రవర్మ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి మహానందరెడ్డి, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, కురుపాం జెడ్పీటీసీ శెట్టిపద్మావతి, కురుపాం ఎంపీపీ ఇందిరాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
జీవనం దుర్భరం..
ప్రజా సంకల్పయాత్ర బృందం: అటవీ ప్రాంతంలో లభించే ఫలసాయంతో పాటు పోడు వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ ఉన్నా జీవనం కష్టంగానే ఉందని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేశారు. జీసీసీ గిరిజన ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జియ్యమ్మవలస మండలం అలువాడ జంక్షన్ వద్ద పోడు వ్యవసాయం చేసే గిరిజనులు ఏర్పాటుచేసిన స్టాల్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు కె. దీనమయ్య, జి. గిరిబాబు, ఆర్. సత్తిబాబు, ఎన్. వెంకటరా వు, టి. కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు ఆరిక జగన్నాథం, తదితరులు మాట్లాడుతూ, ఎత్తైన కొండల్లో తాము చింతపండు, జీడి, తదితర పంటలు సేకరిస్తునే... మరోపక్క ఆలు బియ్యం, సామ బియ్యం, కొర్ర బియ్యం, జొన్నలు, రాగులు, గంటెలు సాగు చేస్తున్నామన్నారు. సామ, ఆలు, కొర్ర బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా కొనుగోళ్లుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 36 రకాల ఉత్పత్తులను పండిస్తే జీసీసీ కేవలం 2 రకాల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తుందనీ, అదీ అరకొరగానేనని వాపోయారు. తాము సేకరించిన చింతపండును జీసీసీ కిలో రూ.20 చొప్పున కొనుగోలు చేస్తుంటే అదే చింత పండును హెరిటేజ్ వంటి సూపర్మార్కెట్లలో కిలో రూ.180 లెక్కన విక్రయిస్తున్నారని తెలిపారు. అలాగే సుగంధ ద్రవ్యాలు, ఆరోగ్యానికి ఉపయోగపడే ఉత్పత్తులు సేకరిస్తున్నా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాయని జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు కోల్ట్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలన్నీ సావదానంగా విన్న జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎనిమిది గంటలే పని.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ సెక్టార్లో కూడా 8 గంటలే పనివిధానం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ ఉద్యోగులను ఆయా యాజమాన్యాలు వేధిస్తున్నాయి. ప్రతిఏటా డీఎస్సీ తీసి నిరుద్యోగులను ఆదుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. వైఎస్సార్సీసీ అధికారంలోకి రాగానే అన్నివర్గాలకూ మేలు చేయాలి. – గంధవరపు రాంబాబు, బిత్తరపాడు బిల్లులు ఇవ్వలేదు.. మరుగుదొడ్డి నిర్మించుకుంటే బిల్లులు ఇస్తానన్నారు. సుమారు రూ. 20 వేలు అప్పు చేసి మరుగుదొడ్లు కట్టా. ప్రభుత్వం 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కాని ఒక్క రూపాయి కూడా అందలేదు. – బాలసింగి రాధమ్మ,ఎం. అలువాడ -
శెట్టి బలిజలకు కార్పొరేషన్..
ప్రజా సంకల్పయాత్ర బృందం: శెట్టిబలిజ కులస్తుల అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని శెట్టి మహానడు రాష్ట్ర కన్వీనర్ కుడుపూరు సూర్యనారాయణరావు కోరారు. మాజీమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో సూర్యనారాయణరావు తన కార్యకర్తలతో కలిసి జియ్యమ్మవలస మండలం శిఖబడి క్రాస్ వద్ద ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న జగన్మోహన్రెడ్డిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉందన్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గంలో చాలా పేదవారు ఎక్కువగా ఉన్నారని.. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే శెట్టిబలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జననేత దృష్టికి తీసుకువచ్చారు. దీనికి జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ ప్రతి సామాజికవర్గానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి, కుడిపూడి బాబు, యూత్ రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, గుత్తుల శ్రీను, రాష్ట్ర నాయకులు గుబ్బల తులసికుమార్, గెద్దాడ వేంకటేశ్వరరావు, పితాని ప్రసాద్, విజయనగరం గౌరవ అధ్యక్షుడు గండిబోయిన ఆది, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సూరిబాబు,తదితరులున్నారు. -
జగనన్న మేలు మరువలేం..
విజయనగరం: వెఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆటోవాలాలకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఐదేళ్లలో రూ. 50,000 ఆర్థిక సాయం చేస్తామన్న జగన్మోహన్రెడ్డి మేలు మరువలేం. ఆటో కార్మికుల కష్టాన్ని గుర్తించిన నాయకుడు జగనన్న ఒక్కడే. పోలీసులు తరచూ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని జగన్మోహన్రెడ్డిని కోరాం.– జీవీ శ్రీనివాసరావు, పి. నాగేశ్వరరావు, జి. శివ, ఎం. రాంబాబు, జి. కృష్ణ, తదితరులు -
పాకలు తొలగించారు..
విజయనగరం: కురుపాం పంచాయతీ సమీపంలో 24 కుటుంబాల వారు వేసుకున్న పాకలను బియ్యాలవలస గ్రామస్తులు తొలగించారు.ఆ స్థలం బోడికొండ రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందినదైనప్పటికీ బియ్యాలవలస వాసులు దౌర్జన్యం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మాకు బాపన్నగూడలో ఇళ్లు, చెరువులు, శ్మశానవాటికలకు స్థలం కేటాయించాలి. – ఎం. గణేష్, ఎం. అప్పారావు, ఎం. అరుణకుమారి, వేపన్నగూడ,జియ్యమ్మవలస మండలం -
రెగ్యులర్ చేయాలి
విజయనగరం:ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలి. పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా విద్యార్థులకు ఎం.సెట్, ఐఐటీ, ఒలింపియాడ్, నీట్, తదితర పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నాం. ఉదయం ఏడు గంటల నుంచి 9 వరకు ఎటువంటి సెలవులు లేకుండా శిక్షణ ఇస్తున్నాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే గురుకుల విద్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులను ఆదుకోవాలి.– కె. శ్రీధర్, జి. మురళీమోహన్, ఎం. హరిబాబు, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు -
వేతనాల్లేవ్..
విజయనగరం:ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆదుకోవాలి. రైతులకు చేరువగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు చేపడుతున్న పీఏసీఎస్ ఉద్యోగులకు సరైన వేతనాలు లేవు. వేతన సవరణ కోసం జీఓలు విడుదలైనా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. జగన్మోహన్రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకెళ్లాం. ఆయన హయాంలో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది.– కె. గంగరాజు, ఎస్. చంద్రశేఖర్, రామిరెడ్డి, ఎం. వినోద్‌కుమార్,రామచంద్రరెడ్డి, ఎ. రామాంజనేయులు పీఏసీఎస్ అసోసియేషన్ ప్రతినిధులు, వైఎస్సార్‌కడప జిలా -
సైకిళ్లు ఇస్తామని మోసం చేశారన్నా...
విజయనగరం:హైస్కూల్ చదువుతున్న బాలికలకు సైకిళ్లు ఇస్తామన్నారన్నా. కానీ నేటికీ ఇవ్వలేదు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేం చాలా దూరం నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీని వల్ల స్కూల్లో చెప్పే తరగతులకు ఆలస్యమవుతున్నాం. మీరు ముఖ్యమంత్రి అయ్యాక సైకిళ్లు నిర్ణీత సమయానికే ఇవ్వండన్నా...–ఇచ్ఛాపురం భారతి, లావణ్య, శిరీష, ఏలూరు లోకేశ్వరి, చినమేరంగి విద్యార్థులు -
అన్న సీఎం కావాలని పూజలు
విజయనగరం:జగనన్న ముఖ్యమంత్రి కావాలని రోజూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ చినమేరంగి గ్రామానికి చెందిన ముదిలి ప్రత్యూష చెప్పింది. ఆయన తప్పక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ రూ.పది విలువైన 20 నోట్లను దండగా చేసి జగన్ మెడలో హారంగా వేసింది. అన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి అక్క.. ప్రతి చెల్లికి మంచి చేస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. -
ఓసీ కావడమే శాపమా
విజయనగరం: చదువుకోవాలన్న ఆశ ఉన్నా ఓసీ కావడంతో ఆటంకంగా ఉందన్నా.. అంటూ జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన జి.శృతి ఆవేదన వ్యక్తం చేసింది. ఓసీ విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి ఉపకార వేతనాలు అందించకపోవడంతో ఉన్నత చదువుకు దూరమౌతున్నారన్నా అని తెలిపింది. ఓసీల్లోనూ చాలామంది పేదలున్నారు.. ఆడబిడ్డలను చదివించలేక, వివాహాలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. -
అర్థంతరంగా తొలగించారు
విజయనగరం: ుమ్మల్ని 58 ఏళ్ళ వరకు విధుల్లో ఉంచుతామని చెప్పి మూడేళ్ళకే తొలగించేశారన్నా.. అని పెదమేరంగి, రామునాయుడు వలస గ్రామాలకు చెందిన అంగనవాడీ లింక్ వర్కర్లు, క్రిషీ వర్కర్లు కేతిరెడ్డి శ్రీదేవి, అల్లు కరుణ వాపోయారు. పార్వతీపురం డివిజన్లో 2014లో 134 మంది లింకు వర్కర్లను నియమించారని, 2017 డిసెంబర్లో విధుల్లోంచి తొలగించారని చెప్పారు. అధికారంలోకి రాగానే మమ్మల్ని ఆదుకోవాలన్నా.. అని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే సభ సక్సెస్
ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత వల్లే కురుపాం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేశారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గ కేంద్రం శివారులో బుధవారం ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్రలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలను బిడ్డల్లా ఆదరించి అన్ని సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలు చేసిన ఘనత మహానేత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. అదే నమ్మకాన్ని ఆయన తనయుడు, ప్రతిపక్ష నేత వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రజల పట్ల చూపిస్తున్నారన్నారు. కురుపాంలో జరిగిన బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డి రాక కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల వారికి అమలు చేసే సంక్షేమ పథకాల హమీలను ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజల కష్టాలను తీర్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
ప్రజా సంకల్ప యాత్ర చారిత్రక ఘట్టం కావాలి
శ్రీకాకుళం, పాలకొండ/పాలకొండ రూరల్: జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజాసంకల్ప యాత్ర చారిత్రక ఘట్టంగా నిలిచిపోవాలని, ఎన్ని తరాలు మారినా మర్చిపోలేని రీతిలో స్వాగతం పలికి చిరస్థాయిలో గుర్తుం డిపోయేలా ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 25 పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కెల్ల గ్రామం అడుగుపెడుతున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధ్యక్షతన పాలకొండలో సన్నాహక సభ నిర్వహించారు. ఈ సం దర్భంగా భూమన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజల కోసమే అహోరాత్రాలు పోరాడుతున్నారని అన్నారు. ఏడాది కాలంగా జనమే కుటుంబంగా ముందుకు కదులుతున్నారని తెలిపారు. 12 జిల్లాల్లో సంకల్పయాత్ర విజయవంతంగా జరిగిందని, ఇంత కంటే శ్రీకాకుళం జిల్లాలో సంకల్ప యాత్ర ప్రభంజనంలా మారాలని కోరారు. కుట్రలు, కు తంత్రాలకు ప్రజా సమూహమే సమాధానం కా వాలని తెలిపారు. సిక్కోలు పాదయాత్ర వైఎ స్సార్ సీపీ అధికారం చేపట్టేందుకు నాంది కావా లని ఆకాంక్షించారు. పార్టీ అధ్యక్షుడే అంత కష్టపడుతున్నప్పుడు కార్యకర్తలు, నాయకులు ఇంకెంత కష్టపడాలో తెలుసుకోవాలన్నారు. పాలకొండలో ఈ నెల 28న జరగనున్న బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాలని కోరారు. పాలకొండ రెవెన్యూ డివిజన్లోని మూడు నియోజకవర్గాల్లో సంకల్పయాత్ర విజయవంతం చేయాల్సిన బాధ్యతలు రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ చేపట్టాలని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు సీదిరి అప్పలరాజు, పేడా డ తిలక్, గొర్లె కిరణ్, తమ్మినేని చిరంజీవినాగ్, చల్లా రవికుమార్, చింతాడ మంజు, మామిడి శ్రీకాంత్, కామేశ్వరిలతో పాటు నియోజకవర్గ నాయకులు దమలపాటి వెంటరమణనాయుడు, కనపాక సూర్యప్రకాష్, జి.సుమిత్రరావు, పి.సింహాచలంలతో పట్టణ నాయకులు వెలమల మన్మధరావు, కడగల రమణ, తుమ్మగుంట శంకరరావు, నీలాపు శ్రీనివాసరావు, నల్లి శివప్రసాద్, చందక జగదీష్, పాటు జిల్లాలో మండల కన్వీనర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. అభిమానం చూపండి వైఎస్ కుటుంబంపై జిల్లా వాసులకు ఎనలేని మక్కువ ఉంది. రెండుసార్లు వైఎస్సార్‌ను ముఖ్యమంత్రి చేయడంలో జిల్లావాసులు కీలకపాత్ర పోషించారు. అదే అభిమానాన్ని మళ్లీ జగన్‌పైనా చూపండి. ఆయన జిల్లాలో అడుగు పెట్టగానే ఇచ్చే స్వాగతం అందరికీ స్ఫూర్తి కలిగించాలి. జిల్లా శ్రేణులు అంతా 25న వీరఘట్టం మండలం చేరుకోవాలి. – ధర్మాన ప్రసాదరావు,పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గ్రామస్థాయిలో కదిలిరావాలి ప్రజా సంకల్ప యా త్రకు ప్రతి గ్రామం నుంచి జనం కదిలి రావాలి. గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలను స్వాగత సభ కు ఆహ్వానించాలి. పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ఏర్పాటు చేయాలి. స్థానిక ఎమ్మెల్యే కళావతిపై ఉన్న అభిమానం అందరికీ తెలియాలి.– తమ్మినేని సీతారాం, పార్టీ శ్రీకాకుళం పార్లమెటరీ జిల్లా అధ్యక్షుడు సిక్కోలు అభిమానం చూపుదాం కడప తర్వాత వైఎస్ కుటుంబానికి సిక్కోలుతో అంత అనుబం ధం ఉంది. రాష్ట్రంలో అరాచక పాలన అంతం కావాల్సి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అది సాధ్యం. ప్రజలంతా జగన్‌ను ఆశీర్వదించాలి. – కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే స్ఫూర్తిగా నిలవాలి ప్రతి నియోజకవర్గం తమ సొంత నియోజకవర్గంలా భావిం చి నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనాలి. జిల్లాలో పాదయాత్ర ముగింపు కానున్న నేపథ్యం స్ఫూర్తిగా నిలవాలి. – పాలవలస రాజశేఖరం, వైఎస్సార్ సీపీరాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాయకులై నడిపించండి ప్రజల కోసం అలుపు లేకుండా పాదయాత్ర చేస్తున్న జగన్‌కు మనం ఉన్నామనే భరోసా కల్పించాలి. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు బాధ్యత తీసుకుని నాయకత్వం వహించి యాత్ర విజయవంతం చేయాలి. – పాలవలస విక్రాంత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిల్లా సత్తా చూపించాలి జిల్లాలో వైఎస్సార్ సీపీ సత్తాను పాదయాత్రలో చాటిచెప్పాలి. ప్రజల్లో జగన్‌పై ఉన్న అభిమానం పాదయాత్రలో చూపించాలి. పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారిని ఆహ్వానించాలి. – దువ్వాడ శ్రీనివాసరావు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త విజయ ఢంకా మోగించాలి ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తితో జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పార్టీ విజయఢంకా మోగించాలి. సంకల్ప యాత్ర విజయంతోనే విజయం అందుకోవాలి. ప్రజలు జగనన్న కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వారి అభిమానం అందుకోవాలి.– రెడ్డి శాంతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వకర్త కంకణబద్ధులు కావాలి ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలో ముందుగా నా నియోజకవర్గంలో ప్రారంభం కావడం నా అదృష్టం. జగనన్న మనపై ఉంచిన నమ్మకానికి బహుమతిగా జన సందోహం పాదయాత్రకు తరలిరావాలి. నభూతోనభవిష్యతి అన్న విధంగా పాదయాత్ర జరగాలి.– విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే వజ్రసంకల్పం సడలిపోకుండా.. వజ్ర సంకల్పం సడలి పోకుండా జిల్లాలోని మిగిలిన 9 నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వాగత సభకు హాజరుకావాలి. పాలకొండ నియోజకవర్గంలో బహిరంగ సభ విజయవంతంగా జరిపించాలి. ఇందుకు అన్ని స్థాయిల్లో పార్టీ నాయకులు పనిచేయాలి.– ధర్మాన కృష్ణదాస్, పీఏసీ సభ్యుడు -
కురుపాం గడ్డ... వైఎస్సార్ కుటుంబం అడ్డా...
సాక్షిప్రతినిధి విజయనగరం: ‘‘కురుపాం గడ్డ.. వైఎస్సార్ కుటుంబం అడ్డా’’అని మరోసారి రుజువైంది. కురుపాంలో జరిగిన జననేత భారీ బహిరంగ సభ ఇందుకు వేదికగా నిలిచింది. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కురుపాంలో మం గళవారం జరిగిన భారీ బహిరంగ సభకు గిరిపుత్రులు వేలాదిగా తరలివచ్చారు. తమ కష్టాలను తెలుసుకునేందుకు వచ్చిన అభిమాన నాయకుడి వెంట అడుగులు వేశారు. కురుపాం మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జన సందోహంతో కిక్కిరిసిపోయింది. రోడ్లన్నీ జనంతో కళకళలాడాయి. మేడలు, మిద్దెలు జనాలతో కిటకిటలాడాయి. ఏ మేడ చూసినా జనంతో కనిపించగా వారందరికీ జననేత అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సభ జరుగుతుండగా కురుపాం సభæ జిల్లాలో చివరిది కావడం విశేషం. ఈ సభలోనూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జననేత ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే దంపతులకు జననేత ప్రశంసలు కురుపాం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, పరీక్షిత్‌రాజు దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. నా చెల్లెలు ఎమ్మెల్యే పుçష్పశ్రీవాణి రాజకీయాల్లో తులసి మొక్క అంటూ కొనియాడారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువులను కొన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బుతో కొనుగోలు చేస్తే ఎమ్మెల్యే శ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌రాజు మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చిన్నవారైనా విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని అభినందించారు. ఎమ్మెల్యే దంపతులకు తన మనసులో ఎప్పటికీ స్థానం ఉంటుందని జననేత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వ దమననీతిపై మండిపాటు కురుపాం నియోజకవర్గంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అవస్థలను, సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. సభలో దీర్ఘకాలిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరిని తూర్పరబట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ హయాంలో కురుపాం నియోజకవర్గంలో ప్రజలకు వేల సంఖ్య లో ఇళ్లు మంజూరు చేసి గిరిజనంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామానికి ఐదు, ఆరు ఇళ్లు మంజూరు చేసి ప్రజా సంక్షేమానికి పాతర వేస్తున్నారన్నారు. రైతన్న కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయటంలో జాప్యం చేస్తూ దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ... అన్నదాతలను అప్పులపాలు జేస్తున్నారన్నారు. వ్యవసాయానికి ఉచితంగా తొమ్మిది గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఏడు గంటలు కాదు కాదా... పగటి పూట కూడా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఉచితంగా ఇవ్వాల్సిన కరెంటుకు లేనిపోని కారణాలు సృష్టించి నెలకు రూ.300లు చొప్పున బిల్లులు జారీ చేస్తోందని జియ్యమ్మవలస మండలంలో రైతుల పడుతున్న అవస్థలను ప్రస్తావించారు. మహానేత వైఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తయిన తోటపల్లి ప్రాజెక్టును మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వమని దుయ్యబట్టారు. ప్రాజెక్టు సమీపంలో ఉన్న గ్రామాల్లో భూముల రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మహానేత హయాంలో నిర్మించిన జంఝావతి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంలో ఒడిశాతో చర్చిం చాలన్న కనీస జ్ఞానం లేని పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇంకా గుమ్మిడి గెడ్డ మిని రిజర్వాయర్, పూర్ణపాడు –లాబేసు వంతెన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాన్‌తో నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు అరకొర పరిహారాన్ని కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకోవటంపై ధ్వజమెత్తారు. పల్లెపట్టున ప్రగతికాముకుడు ఎన్నాళ్లుగానో జననేతకోసం ఎదురుచూస్తున్న పల్లెవాసులు... ఆయన రాగానే ఎంతో ఆదరంగా స్వాగతం పలికారు. తమ చెంతకొచ్చిన నేతతో బాధలు చెప్పుకుని సాంత్వన పొందారు. 302వ రోజైన మంగళవారం జియ్యమ్మవలస మండలం సీమన్నాయుడువలస క్రాస్ నుంచి బట్లభద్ర, జోగిరాజుపేట పూతికవలస, కాటందొరవలస క్రాస్, కురుపాం వరకూ సాగింది. ఈ సందర్భంగా పలువురు అపన్నులు తమ కష్టాలను జననేత దృష్టికి తీసుకువచ్చారు. తిత్లీ తుఫాన్లో నష్టపోయిన అరటి పంటకు బీమా మొత్తాన్ని చెల్లించకుండా కంపెనీ మోసం చేసిందని జియ్యమ్మవలస మండలానికి చెందిన రైతులు వాపోయారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పూర్తిగా ఇవ్వలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు... సెకండ్ ఏఎన్ఎంలుగా పని చేస్తున్న తమకు రావాల్సిన వేతనాల్లో కోత విధిస్తున్నారని పలువురు ఏఎన్ఎంలు తెలిపారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు గ్రామాల్లో గుర్తింపు ఇవ్వాలని కోరారు. జగన్ వెంట నడిచిన సైన్యం పాదయాత్రలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కురుపాం, సాలూరు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, రాచమళ్లు శివప్రసాద్‌రెడ్డి, రాయలసీమ పశ్చిమ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు, విజయనగరం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, బెల్లాన చంద్రశేఖర్, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, బొబ్బిలి, పార్వతీపురం, కాకినాడ రూరల్, సత్యవేడు సమన్వయకర్తలు శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, కురసాల కన్నబాబు, ఆదిమూలం, అరకు పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, అనంతపురం పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బి.గిరిజమ్మ, రాష్ట్ర కార్యదర్శి పోరేటి నరసింహారెడ్డి, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, కురుపాం ఎంపీపీ ఇందిరా కుమారి, తదితరులు పాల్గొన్నారు. -
నేటి ప్రజాసంకల్ప యాత్ర ఇలా..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం నాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కురుపాంలోని రాత్రిబస వద్ద ప్రారంభమై జియ్యమ్మవలస మండలం శిఖబడిక్రాస్ వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. కురుపాం నుంచి జియ్యమ్మవలస మండలం దాసరిపేట, తాళ్ళడుమ్మ, చినమేరంగి, అల్లువాడ వరకూ సాగుతుందని చెప్పారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం పెదతుంబలి, చినతుంబలి, జోగులడుమ్మ మీదుగా శిఖబడి క్రాస్ వరకు చేరుకుని ముగుస్తుందన్నారు. అక్కడే రాత్రిబస చేస్తారని పేర్కొన్నారు. -
బీమా పేరిట నిండా ముంచారు....
ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌కు ప్రజలు దారి పొడవునా తమ సమస్యలను చెబుతూనే ఉన్నారు. నాలుగున్నరేళ్ల తెలుగుదేశం పాలనలో అన్ని విధాల నష్టపోయామని పేర్కొంటున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల వారు తమ బాధలను జగన్ వద్ద చెబుతూ కన్నీరు పెడుతున్నారు. మీరు సీఎం అయ్యాక మా కష్టాలు తీర్చాలంటూ వేడుకొంటున్నారు. ప్రజాసంకల్పయాత్ర బృందం: బీమా కంపెనీతో అధికారుల చేతులు కలిపి సమావేశాలు నిర్వహించి మరీ ప్రీమియం వసూలు చేశారు. ఇటీవల తిత్లీ తుపానుకు అరటి పంట దెబ్బతింటే బీమా సమయం మించిపోయిందని మమ్మల్ని నిండా ముంచారంటూ కురుపాం నియోజకవర్గంలోని 61 మంది రైతులు జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. ప్రజాసంకల్పయాత్ర 302 రోజు మంగళవారం జియ్యమ్మవలస మండలం పరజపాడు గ్రామానికి చెందిన రైతులు గుంట్రెడ్డి అప్పలనాయుడు, రామకృష్ణ నాయుడు, పెదవెంకట నాయుడు, శంబంగి పరమేశ్ నాయుడు తదితరులు కలసి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్ష నేత జగన్ ఎదుట వివరించారు. జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాలకు చెందిన 61 మంది రైతులు ఎకరాకు రూ.వేల చొప్పున హార్టీకల్చర్ అధికారుల ద్వారా ప్రీమియంను అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాకు చెల్లించామన్నారు. మొత్తంగా రూ. 4లక్షలకు పైగానే ప్రీమియం వసూలు చేశారని సంవత్సరం పాటు అరటి పంటకు బీమా కింద చెల్లించాలని రైతులకు అధికారులు సమావేశాలు నిర్వహించి మరీ కట్టించారని రైతులు చెప్పారు. వాతావరణ ఆధారిత పంటల బీమా 17–18 కింద ప్రీమియం చెల్లించాక మాకు అధికారులు కూడా రశీదులు ఇచ్చారని, ఇటీవల తిత్లీ తుపానులో అరటి మొత్తం ధ్వంసం అయినా పరిహరం ఇవ్వలేదని వాపోయారు. అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడు పరిహారం గూర్చి అడిగితే మొహం చాటేస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్ అధికారులను అడిగితే శాటిలైట్ ద్వారా సర్వే చేస్తామని ఒకసారి, మా పైవాళ్లను అడగండని మరో సారి సంబంధం లేని మాటలాడుతున్నారని వాపోయారు. కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. చివరకు అన్నదాత కోర్టులకు కూడా వెళ్లాల్సి వస్తుందని జగన్ వద్ద వాపోయారు. -
బిల్లులు ఇవ్వలేదు...
విజయనగరం :అన్నా మాది బిత్తరపాడు గ్రామం. మా గ్రామం తోటపల్లి బ్యారేజీలో పోయింది. మాకు వేరే చోట స్థలాలు ఇచ్చారు. మేం అక్కడ ఇల్లు కట్టుకోడానికి పునాదులు వేసుకున్నాం. ఐదు సంవత్సరాలవుతున్నా మాకు పునాదుల బిల్లులు కూడా రాలేదు. దీంతో మేం పాత గ్రామంలోనే ఉన్నాం. నీరు ఎక్కువైతే మా గ్రామం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండడంతో భయాందోళనలకు గురవుతున్నాం. అధికారులకు చెబితే గ్రామం ఖాళీ చేసేమంటున్నారు. మాకు ఇల్లు నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోతే ఎక్కడకు పోతామన్నా. మీరు అధికారంలోకి రాగానే మమ్మల్ని ఆదుకోవాలన్నా... -
ఉద్యోగులను ఆదుకోవాలి..
విజయనగరం: పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నా... గిరిజన సంక్షేమ శాఖలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులకు జీవో నెం 3 ప్రకారం ఉద్యోగాలు వెంటనే కల్పించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న 361 మంది సీఆర్టీలను రెగ్యులర్ చేయాలి. పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న 55 పాఠశాలల్లో సుమారు 17వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, వసతిగృహ సిబ్బంది లేరు. దినసరి వేతనాలపై సుమారు 25సంవత్సరాలుగా పనిచేస్తున్న 29మందిని జీవో 212 ప్రకారం రెగ్యులర్ చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడందు. మీరు అధికారంలోకి రాగానే పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. –గిరిజన సంక్షేమ శాఖ టీచర్స్‌యూనియన్ సభ్యులు, సీఆర్టీలు -
నిరుద్యోగ సమస్య తీర్చాలి
విజయనగరం :మీరు సీఎంగా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అంతా మోసం, దగా. మాయమాటలు చెబుతూ మమ్మల్ని మోసం చెస్తూ ఐదేళ్ల పాటు పబ్బం గడుపుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారో చూస్తాం.. మేం అంతా మీ వెనుక ఉన్నాం. మిమ్మల్ని గెలిపించుకొవాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు తండ్రి బాటలొ నడిస్తారన్న నమ్మకం మాకుంది.–దేవాతి జోజో నిరుద్యోగ సమస్య తీర్చాలి మా గ్రామాల్లో యువతీ, యువకులు అంతా డిగ్రీలు పూర్తి చేసి ఉన్నాం. ఎవ్వరికీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నాం. మా గ్రామాల్లో పాఠశాలలు లేకపోయినా దూరప్రాంతాల్లో హాస్టళ్లలో ఉండి కష్టపడి చదువుకున్నాం. అయినా ఫలితం లేకుండా పోతుంది. మా జిల్లాలో కొత్త పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నా. మీరు అధికారంలోకి రాగానే జిల్లాలో కొత్త పరిశ్రమలు తేవడంతో పాటు, మూత పడిన పరిశ్రమలను తెరిపించి, మా గిరిపుత్రులకు చేరువలో స్కిల్ డెవలప్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నా... –వంగల దేవి, ముదుల శిరీష -
అన్నా మీరే ఆదుకోవాలి
విజయనగరం :అన్నా మా గ్రామాలను మీరే ఆదుకోవాలి. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కిచ్చాడ, వన్నం, పులిగుమ్మి, రామకృష్ణాపురం, పట్టాయదొరవలస గ్రామాల మహిళలు పూతికవలస వద్ద జగన్‌ను తమ సమస్య చెప్పారు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. బస్సు కాదు కదా...ఆటో కూడా రావడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలి. –వన్నాం గ్రామ మహిళలు -
గుమ్మడి గెడ్డపై రిజర్వాయరు నిర్మించాలన్నా...
ఏటా పంట పొలాలు మునిగిపోతున్నాయి... దళాయిపేట గ్రామానికి ఓ వైపు నాగావళి, మరోవైపు గుమ్మడిగెడ్డ ఉన్నాయి. నీరు ఎక్కువగా వస్తే మా పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. గ్రామానికి ఆనుకొని కరకట్ట పనులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో గ్రామంలోకి నీరు వచ్చేస్తోంది. నాగావళికి ఆనుకొని 50 ఎకరాలు, గుమ్మడిగెడ్డకు ఆనుకొని వంద ఎకరాల్లో ఏటా వరి, జొన్న సాగు చేస్తుంటాం. ఏటా జూలై నుంచి అక్టోబరు వరకు మా పంట పొలాలు ముంపునకు గురై పొలాల్లో ఇసుక మేటలు వేస్తోంది. ఇది ఆర్థిక సమస్యగా మారింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్ట పరిహారం అందడం లేదు. మీరు అధికారంలోకి రాగానే పరిశీలించి ఆదుకోవాలి. –గొంగాడ రాము, దళాయిపేట గుమ్మడి గెడ్డపై రిజర్వాయరు నిర్మించాలన్నా... గుమ్మడిగెడ్డపై రిజర్వాయరు నిర్మించి ఆదుకోవాలి. గుమ్మడిగెడ్డ నీటిని వట్టిగెడ్డకు మళ్లించడంతో ఇబ్బందులకు గురవుతున్నాం. గుమ్మడి గెడ్డపై రిజర్వాయరు ఏర్పాటు చేయాలి. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడ రిజర్వాయరు కడితే ప ది వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మీరు అధికారంలోకి రాగానే రిజర్వాయరు కట్టి ఆదుకోవాలి.–పలు మండలాల రైతులు -
ఇబ్బందులు పడుతున్నామన్నా...
విజయనగరం :అన్నా మా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. కొమరాడ మండలంలో గుణిత తిలేసుపంచాయతీలో సవర గుణద, తిలేసు, ఎగువ గుణద, చిన్నిడి, దిగువ గుణద గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. తాగునీరు సౌకర్యం లేదు. గ్రామాల్లో ఉన్న బావి నీరే తాగుతున్నాం. ఎండాకాలం నీరు లేకపోవడంతో గెడ్డలో నీరు తెచ్చుకుని తాగాల్సి వస్తుంది. గ్రామంలో ఎక్కువ మంది తరచూ రోగాల బారిన పడుతున్నాం. ఇళ్లు కూడా మంజూరు చేయడంలేదన్నా. మీరు అధికారంలోకి రాగానే మా గ్రామాలకు రహదారి సౌకర్యం, తాగునీటి కుళాయిలు, ఇళ్లు మంజూరు చేయాలి.–బిడ్డిక సోమారావు,మండంగి రాజారావు, మండంగి వెంకటేష్, రామారావు -
సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు...
విజయనగరం :ఎన్నో ఏళ్ల నుంచి పీఎంపీ డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో రోగులకు ప్రథమ చికిత్స అందిస్తూ సేవలను అందిస్తున్నాం. జిల్లా మొత్తం దాదాపు 15వేల మంది పీఎంపీ డాక్టర్లుగా కొనసాగుతున్నాం. మమ్మల్ని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మా కోసం జీవో 425ను విడుదల చేసి వృత్తి పరంగా శిక్షణ అందించేలా చేశారు. సర్టిఫికెట్లు కూడా అందించి మాకు పీఎంపీ డాక్టర్లుగా ప్రత్యేక గుర్తింపును కూడా రాజన్న ఇస్తామన్నారు. దురదృష్టావవత్తు అదే సమయంలో వైఎస్ చనిపోయారు. అప్పటి నుంచి మా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. తరువాత జరిగిన పరిణామాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మేమంతా శిక్షణ పొంది ఉన్నాం... మాకు సర్టిఫికేట్లను ఇప్పించడయ్యా అని ఎన్ని సార్లు వేడుకున్నా పట్టించుకోలేదు.. మా కోసం జీవో 465 నెంబర్‌ను తెరపైకి తెచ్చినా ఐఎమ్వోఒత్తిడితో అమలు కాకుండా చేశారు.. మన ప్రభుత్వం ఏర్పడ్డాక మా పీఎంపీ డాక్టర్ల సమస్యను పరిష్కరించాలన్నా...–పీఎంపీ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు -
సీపీఎస్ రద్దు చేయాలి...
విజయనగరం :2004 సెప్టెంబర్ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ సీపీఎస్ విధానం ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ విధానం ద్వారా పది శాతం బేసిక్ మరియు డీఏలతో పాటు ప్రభుత్వం ఇస్తున్న మ్యాచింగ్ గ్రాంట్‌ను కూడా ఆ ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ అకౌంట్‌కు ఎలాంటి భద్రత లేదు. షేర్ మార్కెట్ షరతులకు లోబడి ఈ ఖాతా నిర్వహణ జరుగుతుంది. ఈ విధంగా ప్రతీ ఏడాది ఎన్ఎస్డీఎల్కు సుమారు 800 కోట్లకు పైగా మ్యాచింగ్ గ్రాంట్ వేస్తున్నారు. ఈ విధానం ఇటు ఉద్యోగికి, అటు ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం, కార్పొరేట్ శక్తులకు ధారబోసే విధంగా ఉంది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు భద్రతను కల్పించాలి. –ఎం.సీతన్న, నిమ్మక మాధవరావు, ఆర్.రమేష్, పత్తిక చంద్రమోహన్, సీపీఎస్ ఉద్యోగులు -
సంక్షేమ పాలనకు స్వాగతం పలుకుదాం
ప్రజాసంకల్పయాత్ర బృందం :రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, మాఫియాలు, మోసాలతో సాగుతున్న పాలనకు చరమగీతం పాడి జననేత జగన్మోహన్ రెడ్డి అందించే సంక్షేమ పాలనకు స్వాగతం పలుకుదామని వైఎస్సార్ సీపీ నాయకులు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలుద్దామని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుకుందామన్నారు. ‘నవరత్నాలతో’ జీవితాలు బాగుచేసుకోవాలంటూ ప్రజలకు సూచించారు. కురుపాంలో మంగళవారం జరిగిన ప్రజాసంకల్పయాత్ర సభ జనంతో పులకించిపోయింది. దారి పొడవునా గిరిజనులు తమ సమస్యలు ఏకరువుపెట్టారు. నాలుగున్నరేళ్లుగా పడుతున్న ఇబ్బందులను వినిపించారు. త్వరలోనే సంక్షేమ పాలన వస్తుందని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయంటూ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు భరోసా ఇచ్చారు. ఎవరితోనైనా పోటీకి రెడీ వైఎస్సార్ సీపీ అధినేత రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పులి వెందుల నుంచి మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కురుపాం వరకూ వేలకిలోమీటర్లు పాదయాత్రగా వచ్చారు. మేం కూడా ఏజెన్సీ ప్రజల కోసం, వైఎస్సార్సీపీ పార్టీ కోసం ఎవరినైనా ఎదిరిస్తాం. ఎవరితోనైనా పోటీకి దిగుతాం. టీడీపీ నిరంకుశ పాలనను కూకటి వేళ్లతో పెకిలించడానికి సిద్ధమవుతున్న జగనన్నతో కలసి ఆ పార్టీ నాయకుల అహంకారాన్ని కూల్చేస్తాం. – శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు టూరిజం ప్రాజెక్టును పక్కన పెట్టేశారు.. కురుపాం ప్రాంతంలో గిరిజన గ్రామాల మధ్య అక్కడి వనరులతో మెడికో టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన చేసి దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆదేశించారు. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం దీనికి పూర్తిగా మంగళం పాడింది. గిరిజన సంక్షేమం కోసం పోడు వ్యవసాయం చేసుకునే వేలాది కుటుంబాలకు పట్టాలు అందజేసిన ఘనత స్వర్గీయ వై.ఎస్. రాజశేఖరరెడ్డిదే. చంద్రబాబు నాయుడిది అంతా సొంత కుటుంబ పాలన. ఏ తప్పులూ చేయకపోతే సీబీఐ వద్దని ఎందుకు జీఓలు విడుదల చేశారు? – బొత్స ఝాన్సీ లక్ష్మి,మాజీ ఎంపీ, విజయనగరం అన్ని బహిరంగ సభలకూ జనాదరణ జిల్లాలో జననేత జగన్మోహన్ రెడ్డి ప్రసంగించిన అన్ని బహిరంగ సభలకూ జనం పోటెత్తారు. జిల్లాలో చివరి బహిరంగ సభకు కూడా అత్యంత జనాదరణ చూపిన ప్రజలు మేమంతా జగనన్న వెంట ఉన్నామని నిరూపించారు. జిల్లాలో జగన్ పర్యటనకు జననీరాజనాలు పలుకుతున్నారు. జగనన్నపై హత్యాయత్నం చేస్తే జనమంతా మా ఊపిరి ఉన్నంత వరకూ మేమున్నామంటూ వెన్నంటి నిలుస్తున్నారు. – అలజంగి జోగారావు,పార్వతీపురం సమన్వయకర్త ట్రైకార్ రుణాలన్నీ టీడీపీ కార్యకర్తలకే... ఐటీడీఏ అధికారులు, పాలక వర్గం గిరిజన ఎమ్మెల్యేల సలహాలు తీసుకుని గిరిజనులకు సంక్షేమాన్ని అందించేవి. ఇప్పుడు ఐటీడీఏ నిధులన్నీ కైంకర్యం చేస్తున్నారు. ట్రైకార్ రుణాలన్నీ టీడీపీ కార్యకర్తలకే ఇస్తున్నారు. ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. జీసీసీని నిర్వీర్యం చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో ఏటా లక్ష క్వింటాళ్ల చింతపండు కొనుగోలు చేయొచ్చు. కానీ దళారులతో కుమ్మక్కవుతున్నారు. చంద్రబాబు మద్దతుతో ఆర్పీ భంజ్‌దేవ్ వంటి వారు గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే గిరిజనసంక్షేమం పట్టాలెక్కుతుంది.– పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు పెద్దల సాయం లేకున్నా... మాకు పెద్దల సాయం లేకపోయినా గిరిజనుల అభిమానం ఉంది. కార్యకర్తల ప్రేమానురాగాలున్నాయి. జిల్లా నాయకుల మద్దతు ఉంది. అన్నింటికీ మించి జననేత జగనన్న ఆశీస్సులున్నాయి. ఎంతో మంది ప్రలోభపెట్టినా కట్టెకాలేవరకూ వైఎస్సారే సీపీయే మా పార్టీ. జగనన్నే మా నాయకుడు. ఈ కురుపాం గడ్డ వైఎస్సార్ కుటుంబానికి అడ్డా. ఏ గిరిజన గూడెంలో అయినా మా అందరి గుండెల్లో అయినా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కొలువుతీరి ఉన్నాడు. ఆయన హయాంలో ఎంతో సంక్షేమం పొందిన ఈ ప్రాంతం జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉంది. – పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే, కురుపాం జననేత పాలనలో సమస్యల పరిష్కారం గిరిజనులకు వైద్యం, విద్య, సాగు, తాగునీరు సమృద్ధిగా అందాలంటే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలి. ఆయన సీఎం కావాలంటే మనమంతా సైనికుల్లా పనిచేయాలి. అప్పుడే అందరి కష్టాలు తీరుతాయి. అందరి సమస్యలూ పరిష్కారమై రాజన్నరాజ్యం మళ్లీ వస్తుంది. గిరిజన సమస్యలు పరిష్కారమవుతాయి. సంక్షేమ పాలన అందుతుంది. ఆనందమయ జీవితం లభిస్తుంది. – జి.మాధవి,అరకు పార్లమెంటరీ సమన్వయకర్త -
అసాంఘిక కార్యక్రమాల సూత్రధారి బాబే
విజయనగరం,ప్రజా సంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో జరిగే ప్రతీ అసాంఘిక కార్యక్రమానికీ, అవినీతికీ, దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం సీమనాయుడుపేటలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో పా ల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని భూముల్లో చెరకు తోటలు కాల్చివేసినప్పటి నుంచి తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలపెట్టడంలో బాబు పాత్ర ఉందని ఆరోపించారు. కానీ ఆ ఘటనలన్నింటినీ వైఎస్సార్సీపీపై నెట్టేసి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వీటిపై విచా రణ చేపట్టిన పోలీసులు చెరకు తోటలను ఆహుతి చేసిన వారి వెనుక టీడీపీ నాయకులే ఉన్నారన్న విషయం తేలటంతో దిక్కుతోచక కొందరు అమాయక రైతులపై కేసులు పెట్టించే దుర్మార్గపు చర్యకు ఒడిగట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ రైతులు నిర్దోషులుగా పోలీసులు తేల్చటంతో పాటు ఘటన వెనుక టీడీపీ నాయకులే ఉన్నారన్న నిర్ధారణ కావటంతో కేసులు మూసివేసే చర్యలు చేపడుతున్నారన్నారు. చంద్రబాబునాయుడు తన స్వార్థం కోసం ఎంతటివారిపైనైనా సంఘ విద్రోహులుగా ముద్ర వేసేయగలరని ఆరోపించారు. తుని వద్ద రైలు తగలబడిన ఘటనలో రాయలసీమకు చెందిన గూండాలు ఉన్నారంటూ ప్రజలను మభ్యపెట్టి మూడేళ్లు కావస్తున్నా సీబీఐ, సీఐడీ సంస్థలతో విచారణ జరిపించినా ఇంత వరకు ఒక్క దోషినీ పట్టుకోలేకపోయారన్నారు. ఈ ఘటన వెనుక ప్రధాన దోషి కూడా చంద్రబాబేనని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలినా కిమ్మనడం లేదన్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో కూడా సహాయం కోసం ప్రశ్నించిన బా«ధితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ముద్ర వేసి కేసులు పెట్టిన సంఘటనలను గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వైఎస్సార్ సీపీలో చేరికలు ప్రజా సంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం సీమనాయుడువలసలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్వతీపురం పట్టణానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి జననేత పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో పట్టణానికి చెందిన పారిశ్రామిక వేత్త ప్రభాకరరెడ్డి, హరికృష్ణరాజు, జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీ పాలకమండలిలో సామాజిక వాదులకూ చోటివ్వాలి
ప్రజా సంకల్పయాత్ర బృందం: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో రాజకీయ, సీని ప్రముఖులకు ప్రాధాన్యం తగ్గించి ఉత్తమ సామాజిక వాదులకు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు స్థానం కల్పించాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, హిందూ ధర్మ ప్రచారకుడు కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలో గల సీమనాయుడుపేటలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆమె ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మంచి వ్యక్తిత్వం కలిగిన వారు చాలా మంది ఉన్నారని, అటువంటి వారికి స్థానం కల్పిస్తే హిందూజాతి మొత్తం వైఎస్సార్సీపీ వెంట ఉంటుందన్నారు. ప్రస్తుతం అస్తవ్యçస్తమైన సంఘటనలు చూస్తున్న నేపథ్యంలో రాజకీయ, సినీ ప్రముఖులకు ప్రాధాన్యం తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు పూర్తిగా ఉండకూడదన్నది తమ అభిమతం కాదని, పది మందిలో ఒక రాజకీయ వేత్త ఉంటే సరిపోతుందన్నారు. పాలక మండలికి ధార్మిక సేవాసమితిగా నామకరణం చేయాలన్నారు. టీటీడీ దేవస్థానంలో 25 కిలోమీటర్ల దూరం వరకు మద్యం అమ్మకాలు నిషేధాన్ని పక్కాగా అమలు చేయటం ఆ ప్రాంతంలో పవిత్రతను కాపాడే నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ అజెండాలో పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఆలయ పరిషత్ పరిరక్షణ ద్వారానే పునరుద్ధరణ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. దేశంలో కేంద్రబిందువుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి సంస్కరణలు, చక్కనైన ఉద్ధరణ జరిగినపుడే మొత్తం దేశంలోని అన్ని ఆలయాలు అదే మార్గంలో ముందుకు వెళతాయని పేర్కొన్నారు. అందుకనే టీటీడీ దేవస్థానంలో సంస్కరణలు తీసుకువచ్చే విధంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు చేపట్టాలని కోరానన్నారు. గిరిజన నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి జగన్‌ను కోరిన గిరిజన ఐక్య వేదిక ప్రతినిధులు ప్రజాసంకల్పయాత్ర బందం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన నిరుద్యోగులు, యువతీ, యువకులు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు ఒ.రామ్మూర్తి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం పూతికవలస వద్ద మంగళవారం జగన్‌ను గిరిజన ఐక్యవేదిక ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో గిరిజన యువతీ, యువకులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను ఎంప్లాయ్మెంట్ ఆధారంగా భర్తీ చేయాలని, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. దూరవిద్య ద్వారా చదువుతున్న గిరిజన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 1348 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించాలని కోరారు. జననేతను కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి కూరాడ తిరుమల బాబ్జీ, ఉపాధ్యక్షుడు తేజే శ్వరరావు, ఆదివాసీ సంరక్షణ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ఆర్ఎస్ దొర తదితరులు పాల్గొన్నారు. -
కురుపాం విజయనగరం జిల్లా వైఎస్ జగన్ పాదయాత్ర
-
ముగిసిన 302వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
45 ఏళ్ళు పైబడిన అక్కచెల్లెమ్మలకు వైఎస్అర్ చేయూత
-
వైఎస్ జగన్‌ను కలిసిన జీఎంవలస మండలం మహిళలు
-
అడుగులో అడుగు వేస్తూ..
పాలకొండ రూరల్/రాజాం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరువలో ఉన్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి చేరుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరగనున్న పాదయాత్రకు సంబంధించి మట్లాడారు. సిక్కోలు వాసులు జననేత రాక కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని తెలిపారు. ఇరు నియోజకవర్గాల్లో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యలు ప్రస్తావిస్తూనే తమ సమస్యలపై స్థానికులకు భరోసా కల్పించాలని ఆయనను కోరారు. -
ఉప్పొంగిన జగనాభిమానం
సాక్షిప్రతినిధి విజయనగరం: ఆ వచ్చినది జగనన్న... అదే రాజన్న బిడ్డ. అందుకే ఆయన్ను చూడాలని పల్లెవాసులు పరితపించిపోయారు. మహానేత సమయంలో పొందిన లబ్ధితో ఎన్నో కుటుంబాలు కుదుటపడ్డాయి. ఎన్నో బతుకులు బాగుపడ్డాయి. కానీ దురదృష్టం గడచిన నాలుగున్నరేళ్లుగా వీరిని పట్టించుకునేవారే కరువయ్యారు. వీరి గోడు వినేవారే కానరాకుండా పోయారు. అందుకే తమవద్దకు వస్తున్న ఆ జననేతను కలవాలని... తమ బాధలు విన్నవించాలని... ఆయన భరోసాతో సాంత్వన పొందాలని కోరుకుంటున్నారు. ఆ ఆశతోనే జననేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వారి అభిమానానికి ముగ్దుడైన జగనన్న వారి కష్టాలు సావధానంగా విన్నా రు. తొందరలోనే మంచి జరుగుతుందని ఆశపడుతున్నారు. చిన్నారికి అక్షరాభాస్యం చేసిన జననేత పాదయాత్రలో వై.ఎస్.జగన్‌ను కలసిన కృష్ణవేణి అనే మహిళ తన కుమార్తెకు అక్షరాభ్యాసాన్ని చేయించాలని కోరారు. ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న జననేత అక్షరాలను దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. పాదయాత్రలో అనేక చోట్ల పలువురు తల్లులు తమ బిడ్డలను ఆశీర్వదించాలని కోరుతూ జననేత చేతిలో పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. జగన్ కనిపించలేదని ఓ చిన్నారి ఏకంగా ఏడ్చేస్తుంటే జగన్ దగ్గరకు తీసుకుని స్వయంగా ఆ పాప కంటి నుంచి చెంపలపై జారుతున్న నీటిని తుడిచారు. దారిపొడవునా జనాదరణ జననేత జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర రోజురోజుకూ జన హృదయాలకు దగ్గరవుతోంది. 301వ రోజైన సోమవారం కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ నుంచి పాదయాత్ర ప్రారంభించి తోటపల్లి క్రాస్, నందివానివలస, గిజబ మీదుగా దత్తివలసకు చేరుకున్నారు. అక్కడ భోజన విరామానంతరం జియ్యమ్మవలస మండలంలోని గవరంపేట, పెదమేరంగి జంక్షన్ మీదుగా సీతంనాయుడువలస వద్ద ఏర్పాటు చేసిన రా త్రి బస వద్దకు చేరుకుంది. దారిపొడవునా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు ఎదురేగి ను దుట విజయ తిలకం దిద్ది హారతులు పట్టారు. గిజబ గ్రామానికి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యే క శిబిరంలో తిత్లీ తుపాన్ బాధితులు తమకు పరిహారాన్ని అరకొరగా అందజేశారని జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోగా..గ్రామ శివారుల్లో తుఫా న్‌తో నష్టపోయిన అరటిపంటను జననేత పరిశీ లించారు. స్థానిక మహిళా రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. పాదయాత్రలో వినతుల వెల్లువ యాత్రలో దారిపొడవునా అనేక సమస్యలపై వినతులు అందిస్తూనే ఉన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు తమ సమస్యలను ప్రస్తావించారు. నాలుగేళ్లపాటు అన్యాయం చేసి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏమాత్రం అనుభవం లేని వ్యక్తికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారని చెప్పారు. అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న మైదాన ప్రాంత గిరిజన సమస్యలను పరిష్కరించడం లేదని వాపోయారు. భారీ ప్రాజె క్టు తమ చెంతనే ఉన్నప్పటికీ తమ భూములకు మాత్రం నీరందడం లేదని పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. రిజర్వాయర్ నిర్మాణానికి భూములిచ్చినా తమకు తగిన పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాను బాధితుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు వెళ్లిన జననేతకు అరటి రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నేలకొరిగిన చెట్లను తొలగించడానికే ఎకరాకు రూ.30వేలు ఖర్చవుతుందనీ, ప్రభుత్వం మాత్రం రూ.12 వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గవరంపేట వద్ద తిరుమల సాయి విద్యానికేతన్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రైవేటు స్కూళ్లలోని నిరుపేదలకు కూడా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేయాలని కోరారు. అలుపెరగని బాట సారి వెంట: పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజ యనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమ న కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి విశ్వరూప్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కమలాపురం, మంగళగిరి, కురుపాం, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళా వతి, కంబాల జోగులు, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరుకు, విజయనగరం, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, బెల్లాన చంద్రశేఖర్, గుడివాడ అమర్నా«థ్, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, విశాఖ తూర్పు,పార్వతీపురం, పాతపట్నం నియో జకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణయాదవ్, అలజంగి జోగారావు, రెడ్డి శాంతి, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, కురుపాం ఎంపీపీ ఎ.ఇందిరాకుమారి, అరకు పార్లమెంటరీ జిల్లా విద్యార్థి విభా గం రాష్ట్రకార్యదర్శి చెట్టి వినయ్, అరకు పార్లమెం టరీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు తడబరికి సురేష్‌కుమార్, పంచాయతీరాజ్ విభాగం మంగళగిరి జిల్లా అధ్యక్షుడు డి.వేమారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎల్ఎమ్ మోహన్‌రెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరినఅరుకు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలం దత్తివానివలస వద్ద సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పార్టీ అరుకు నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి ఫల్గుణ ఆధ్వర్యంలో 14 మంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు జననేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికి పార్టీ కండువాలు వేసిన జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
నేడు కురుపాంలో బహిరంగసభ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం కురుపాంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం సీమనాయుడువలస రాత్రిబస వద్ద ప్రారంభమై కురుపాం వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. అక్కడే బహిరంగ సభ ఉంటుందన్నారు. సీమనాయుడువలస రాత్రిబస వద్ద ఉదయం పాదయాత్ర ప్రారంభమై భట్లభద్ర, జోగిరాజుపేట, పూతికవలస వరకూ సాగుతుందని చెప్పారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజనవిరామానంతరం కాటందొరవలస క్రాస్ మీదుగా కురుపాం వరకు చేరుకుని ముగుస్తుందన్నారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం రాత్రిబస చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో చివరి సభ జిల్లాలో సెప్టెంబర్ 24న ప్రవేశించిన జననేత ఇప్పటివరకూ ఎనిమిది నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. జిల్లా లో చివరిదైన కురుపాం సభలో మంగళవా రం ప్రసంగించనున్నారు. సమీప గ్రామాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరికలు
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు వచ్చి చేరుతున్నారు. అరకు నియోజకవర్గంలోని అరకువేలీ, హుకుంపేట, అనంతగిరి మండలాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని దత్తివలస వద్ద సోమవారం మధ్యాహ్న భోజన విరామ శిబిరం వద్ద ఆ మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీ పి.చిన్నగంగులు, మాజీ వైస్ సర్పంచ్ బి.దేవయ్యదొర, మాజీ సర్పంచ్‌లు జి.మధునాయుడు, పి.శివలతో బాటు పి.పైడితల్లి, పి.అప్పారావు, ఆర్.రమేష్, పి.రాజుబాబులు అరకు నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో చేరారు. అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామానికి చెందిన ఏపీ గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రేగం మత్యలింగం తన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్టీసీను నిర్వీర్యం చేసే యత్నాలు అడ్డుకోవాలి ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని విశాఖ రీజియన్ ఏపీఎస్ ఆర్టీసీ, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూ నియన్ ప్రతినిధులు ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలోని కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని సీమనాయుడువలస వద్ద సోమవారం సాయంత్రం జగన్‌ను కలిశారు. వైఎస్సార్సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి నేతృత్వంలో విశాఖ రీజియన్ వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నడింపల్లి క్రిష్ణం రాజు, విశాఖ జిల్లా అధ్యక్షుడు జీఎం నాయుడు, కార్యదర్శి బిఎల్.రావ్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు టీఎస్.రావు, సంయుక్త కార్యదర్శి ఎన్ఎన్.రావ్లు ఆర్టీసీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికులకు భద్రత కల్పిం చేలా పోరాటం చేయాలని కోరారు. ఇప్పటికే ఆర్టీసీలో కీలక విభాగాలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఔట్ సోర్సింగ్ విధానంలో ఆర్టీసీలో నాణ్యత లేని విధి నిర్వహణలు జరుపుతున్నారని తెలిపారు. కారుణ్యనియామకాల కోసం 1200 కార్మిక కుటుంబాలు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదన్నారు. గతంలో దివంగత మహానే వైఎస్సార్ ఆర్టీసీ అప్పులన్నీ మాఫీ చేసి ఆర్టీసీకి రూ.400 కోట్లు రాయితీలు కల్పించారని గుర్తుచేశారు. 5 శాతం టాక్స్ తగ్గించడంతో ఆర్టీసీ అభివృద్ధి బాటలో నడిచిందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని జగన్‌కు విన్నవించారు. -
రైతులతో ప్రత్యక్ష చర్చకు రండి
ప్రజా సంకల్పయాత్ర బృందం: హత్యాయత్నం జరిగిన తరువాత మొట్టమొదటి సారిగా పార్వతీపురంలో జరిగిన ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజా నీకాన్ని చూసి ఓర్వలేక జిల్లా మంత్రి సుజయ్ ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలం దత్తివానివలస వద్ద ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడారు. సీతానగరం ప్రాంతంలో ఉన్న ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం రైతులకు చెల్లించాల్సిన బిల్లులపై పలుమార్లు ప్రగల్భాలు పలకడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 14 మండలాల్లో చెరకు రైతులుండగా.. వారికి యాజమాన్యం బకాయిలు చెల్లించాలని చెబుతుంటే.. బకాయిలు చెల్లించేశారంటూ రైతులను అడగమనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి సుజయ్ అదే మాటకు కట్టుబడి రోజు, సమయం చెబితే బకా యిలు రావాల్సిన రైతులను తీసుకువచ్చి నిజం నిరూపిస్తామన్నారు. బకాయిలు నిజంగా తీర్చారో లేదో రైతులే చెబుతారన్నారు. టీడీపీ పాలనలో వ్యవస్థలు నాశనం అవుతున్నాయన్నారు. గతంలో సీబీఐ కావాలని చెప్పిన టీడీపీ నాయకులు ఈ రోజు సీబీఐ రాష్ట్రంలో విచారణ జరపకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అవినీతి కేసుల్లో జగన్ ఇరుక్కున్నారంటూ చెబుతున్న మంత్రి 2014 ఎన్నికల్లో అదే జగన్మోహన్రెడ్డిని పక్కన పెట్టుకుని బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. మీరింకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీ–ఫారంతో గెలిచిన పదవిలోనే కొనసాగుతున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణాపాఠం చెబుతారన్నారు. -
నామినేటెడ్ పోస్టు కేటాయించలేదు..
ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది గిరిజనులున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ తమకు కనీసం నామినేటెడ్ పోస్టు కూడా కేటాయించలేదని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు జింకల జయదేవ్ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం తోటపల్లి క్రాస్ వద్ద సోమవారం కలిసి గిరిజనుల సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైదాన ప్రాంత గిరిజనులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వీరిని ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలున్నప్పటికీ గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.బీటెక్, డిగ్రీలు చేసిన గిరిజన నిరుద్యోగులు ఖాళీగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌ప్లాన్ నిధులు గిరిజనులకే ఖర్చు చేసే విధంగా చట్టం చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రతి జిల్లాలో గిరిజన భవనాలు నిర్మించడంతో పాటు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జననేతను కలిసిన వారిలో గిరిజన సంక్షేమ సేవా సంఘ అధ్యక్షులు పొన్నాల లక్ష్మణరావు, తదితరులున్నారు. -
టీడీపీ పాలనపై వ్యతిరేకత
విజయనగరం : ప్రజా సంకల్పయాత్ర బృందం: నాలుగున్నరేళ్ల టీడీపీ రాక్షస పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత నెలకొందని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ క్రాస్ వద్ద సోమవారం ఆమె మాట్లాడుతూ, సంక్షేమ పథకాల కోసం అర్హులైన పేదలు కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పింఛన్ల కోసం ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావంలో ఉన్నారన్నారు. తిత్లీ తుఫాన్ వల్ల నియోజకవర్గ పరిధిలోని పలువురు అరటి రైతులు నష్టపోయారన్నారు. అయితే నాలుగేళ్ల కిందట హుద్‌హుద్ సమయంలో ఇచ్చిన పరిహారాన్నే ఇప్పుడు ఇవ్వడం తగదని తెలిపారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిన పోయిన నేపథ్యంలో పరిహారం పెంచాల్సిన అవసరం లేదా అనిప్రశ్నించారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు 11 నెలల తర్వాత పరిహారం అందించిన ప్రభుత్వం... ప్రజా సంకల్పయాత్ర కురుపాం నియోజకవర్గంలోకి వస్తుందనే విషయం తెలుసుకుని టీడీపీ నాయకులు హడావిడిగా పరిహారం అందించారన్నారు. ఆదుకోవాలయ్యా... నా భర్త సూరయ్య మూడేళ్ల కిందట కూలి పనికి వెళ్లి విద్యుదాఘాతానికి గురై అవిటివాడిగా మారాడు. నేనే కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. నా కొడుకు గౌరీశంకర్ బీఈడీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేసి ఆదుకోవాలని జగన్‌బాబును కోరాను.– చౌడువాడ పద్మ, నందివానివలస పరిహారం ఊసే లేదు... మాది నందివలస. ఎస్సీ కాలనీలో 60 కుటుంబాలుంటున్నాయి. 35 సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. మమ్మల్ని తోటపల్లి బ్యారేజీ నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇంతవరకు మాకు ఎటువంటి పరిహారం అందలేదు. ఎన్నిసార్లు వినతులిచ్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరాను.– సామంతుల బుజ్జి నందివలస ఎస్సీ కాలనీ మోసపోయాం... చంద్రబాబును నమ్మి మోసపోయాం. నేను, నా భర్త ముసలి వాళ్లమయ్యాం. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నాడు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మాం. ఎక్కడా ఉద్యోగాలు తీయలేదు. కనీసం రెండు వేల రూపాయలు ఇస్తామన్నాడు. ఇంతవరకు ఒక్క పైసా కూడా నా కొడుక్కి ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మాలాంటి వారిని ఆదుకోవాలి.– సామంతుల నారాయణమ్మ,నందివానివలస -
గుర్తింపు లేదు..
విజయనగరం : పార్వతీపురం డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో సుమారు 300 మంది పాస్టర్లున్నా ఎటువంటి గుర్తింపు లేదు. పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గురగుబిల్లి, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, బలిజిపేట మండలాల్లో పాస్టర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, పాస్టర్స్‌కు పక్కా గృహాలు, మందిర నిర్మాణాలకు స్థలాలు కేటాయించాలని కోరుతూ వినతి అందించాం. ఆయన ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరుగుతుంది. – బి. శ్రీనివాసరావు, డి. మోహన్‌రావు, యహోవా షమ్మా డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు -
ప్రయోజనం కల్పించండి
విజయనగరం :ప్రైవేటు స్కూళ్లలో చదివే పేద విద్యార్థులెంతో మంది ఉన్నారు. వారికి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు పాఠశాలల్లో కూలీల పిల్లలు కూడా చదివించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వారికి ఈ అవకాశాలు కనుమరుగయ్యాయి. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ అవకాశాలు కల్పించాలి. – తిరుమల సాయి విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు -
పెద్ద దిక్కును కోల్పోయా..
విజయనగరం : అన్నా.. క్యాన్సర్ వ్యాధితో నెల రోజుల కిందట నా భర్తను కోల్పోయాను. ముగ్గురు పిల్లలతో బతుకుబండి లాగించలేకపోతున్నా. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది.– తుమరాడ జయమ్మ,నందివానివలస -
‘తిత్లీ’తో నష్టపోయాం..
విజయనగరం :అన్నా.. తిత్లీ తుఫాన్ వల్ల పూర్తిగా నష్టపోయాం. ఎకరాకు సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వచ్చింది. ప్రభుత్వం మాత్రం ఎకరాకు 12 వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది.కనీసం పెట్టుబడి కూడా రాలేదు. మండలంలోని 320 ఎకరాల్లో అరటిపంట నాశనమైతే ఒక్క మా గ్రామంలోనే 120 ఎకరాల్లో పంట పోయింది. మీరు ముఖ్యమంత్రి కాగానే మాలాంటి వారిని ఆదుకోవాలి.– గిజబ రైతులు రుణాలు ఇవ్వడం లేదన్నా.. అన్నా.. నేను పూర్తి వికలాంగురాలిని. నా తండ్రి కూలి పనికి వెళ్లలేని పరిస్థితి. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. పెద్ద తమ్ముడు ఇంట్లో పరిస్థితి చూసి 10వ తరగతిలోనే చదువుమానేసి కూలి పనికి వెళ్తున్నాడు. రెండో తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు. నా కాళ్లమీద నేను నిలబడేందుకు ఎస్సీ కార్పొరేషన్‌కు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. కాని రుణం మంజూరు కాలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవ్వరూ న్యాయం చేయలేదు. నువ్వే ఆదుకోవాలన్నా..– డబ్బుకోట ఉషారాణి, తులసివలస -
అడ్డుకున్నారు...
విజయనగరం : నాకు మందూ,వెనుకా ఎవ్వరూ లేదు. వృద్ధాప్య పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా న్యాయం చేయలేదు. 80 సంవత్సరాల వయసున్న నేను ఏ పని చేసుకోగలను. జన్మభూమి కమిటీ సభ్యులు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. మీ నాన్న హయాంలో రెండొందల రూపాయల పింఛన్ అందేది. మళ్లీ నీవు ముఖ్యమంత్రి అయితే నాలాంటి అభాగ్యులకు న్యాయం జరగుతుంది. – పల్లెరుక అన్నమ్మ, శిఖవరం -
మా నాన్నకు ఉద్యోగం ఇప్పించన్నా..
విజయనగరం :అన్నా.. మా నాన్న డొల్లు గౌరినాయుడు తోటపల్లి హోమియోపతి ఆస్పత్రిలో సుమారు 25 సంవత్సరాలుగా స్వీపర్‌గా పనిచేశాడు. నెలకు రూ.75 వేతనం దగ్గర నుంచి 750 రూపాయల వరకు పనిచేశాడు. 2006లో ఆరోగ్యం బాగోలేక విధులకు హాజరుకాలేకపోయాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వెళ్తే విధుల్లోకి తీసుకోలేదు. అమ్మ, నేను, చెల్లి తండ్రి సంపాదనపైనే ఆధారపడి ఉన్నాం. చదువుకోవడానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. ఎమ్మెల్యే లెటర్ తీసుకెళ్లినా ఉద్యోగం ఇవ్వలేదు. నువ్వు ముఖ్యమంత్రి కాగానే మా నాన్నకు ఉద్యోగం ఇప్పించన్నా..– డొల్లు మౌనిక, తోటపలి -
చిన్నారికి అక్షయరాభ్యాసం చేసిన వైఎస్ జగన్
-
వైఎస్ జగన్‌ను కలిసిన క్షత్రియ సేవాసంఘం ప్రతినిధులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన గిరిజన సంక్షేమ సేవాసంఘం ప్రతినిధులు
-
రానున్నది రాజన్న రాజ్యమే
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): రాష్ట్ర ప్రజానీకం కొద్ది రోజులు ఓపిక పడితే తిరిగి రాజన్న రాజ్యం వస్తుందని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. జననేత, వైఎస్సార్సీపీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర ఆదివారం నాటికి 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసకున్నాయి. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పైడి వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో జగదాంబ కూడలిలో ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్‌చేసి, 300 బెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల చంద్రబాబు రాక్షస పాలనతో ప్రజలు విసిగివేసారిపోయారన్నారు. హత్యారాజకీయాలు, భూకుంభకోణాలు, అక్రమాలు, అవినీతి తారాస్థాయికి చేరాయని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలు, విద్యా, వైద్యం వంటివి సామాన్య, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డి అకుంఠిత దీక్ష, అవిశ్రాంత పరిశ్రమ, రాష్ట్ర ప్రజలమీద పాలనమీద ఆయనకు ఉన్న ఆలోచనలే రాష్ట్రానికి త్వరలో స్వర్ణయుగం తీసుకురానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ ఒక్కనాయకుడు చేయని విధంగా సుదీర్ఘమైన పాదయాత్రను జగనన్న చేస్తున్నారని కొనియాడారు. ఎండా, వానలను లక్ష్యపెట్టకుండా, కుటుంబానికి దూరంగా ఉంటూ, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగనన్న చేపట్టిన పాదయాత్ర ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. ఆనాడు దివంగతనేత వైఎస్ , తర్వాత షర్మిలమ్మ, ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని, ఒకే కుటుంబానికి చెందిన నేతలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సుదీర్ఘంగా పాదయాత్ర చేయడం ఎక్కడా జరగలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ , విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జాన్‌వెస్లీ, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మారోజు శ్రీనివాస్, నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండ రాజీవ్ గాంధీ, సనపల రవీంద్ర భరత్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సబీరా బేగం, నియోజకవర్గ అధికార ప్రతినిధి గుత్తుల నాగభూషణం, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బోనిదేవ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కనకల ఈశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఆదివిష్ణురెడ్డి, నియోజకవర్గం మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముజీబ్‌ఖాన్, వార్డు అధ్యక్షులు పీతల వాసు, దశమంతుల మాణిక్యాలరావు, నొల్లు పోతురాజు, మాసిపోగు రాజు, సంకాబత్తుల సన్యాసిరావు, సూరాడ తాతారావు, అలుపన కనకరెడ్డి, బత్తిన నాగరాజు, రంథి గోపి, తొట పద్మావతి, నీలాపు సర్వేశ్వరరెడ్డి, రామిరెడ్డి, జుబేర్, మైఖెల్‌రాజు, మహిళా అధ్యక్షురాలు నీలాపు లక్ష్మి, నగర కార్యదర్శులు పడాల విజయకుమార్, ఇల్లిపిల్లి శ్రీను, పార్లమెంట్ జిల్లా కార్యదర్శి అడప శివ, సంయుక్త కార్యదర్శి బెవర మహేష్, వార్డు యూత్ అధ్యక్షులు కోరాడ సురేష్, నొల్లు చంటి, కార్యదర్శి ఎస్.చంద్రశేఖర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాకర కనకరాజు, ఆకుల హజార్, వార్డు మైనారిటీ సెల్ అధ్యక్షుడు జమీల్, బీసీ సెల్ అధ్యక్షుడు ప్రధాన శత్రువు, ఎస్సీసెల్ అధ్యక్షుడు చెన్నాసాయి, మహిళా అధ్యక్షురాలు కాకి పద్మ, సేవాదళ్ అధ్యక్షుడు గొంప భాను, యూత్ అధ్యక్షుడు కోరుకొండ ప్రసాద్, మారోతి శ్రీను, వల్లి శ్రీను, పార్లమెంట్ జిల్లా సంయుక్త కార్యదర్శి రామకృష్ణ, నగర సంయుక్త కార్యదర్శి హరి, వార్డు యువజన విభాగం అధ్యక్షుడు సీహెచ్.అప్పలరాజు, నగర కార్యదర్శి అర్జిల్ల మసేను, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాసంకల్పయాత్ర చరిత్రాత్మకం ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): రాష్ట్ర ప్రజలతో మమేకమవుతూ వైఎఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని వైఎస్సార్‌ఎస్‌యూ విశాఖ పార్లమెంట్ విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 300 రోజుకు చేరుకున్న సందర్భంగా ఏయూలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆదివారం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఏడాదిగా ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల పక్షాన నిలుస్తూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర చరిత్రలో నిలుస్తుందన్నారు. మహానేతలోని లక్షణాలను పుణికిపుచ్చుకుని ప్రజలకోసం నిరతంరతం పరితపిస్తూ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా జగన్‌చేస్తున్న పాయదాత్రకు సంఘీభావం చెబుతున్నారన్నారు. దీన్ని నిలువరించాలని, అడ్డుకోవాలని చూస్తున్నా ప్రజల అండతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు బి.మోహన్ బాబు, కోటి రవికుమార్, ఎం.కళ్యాణ్, విద్యార్థి నాయకలు పి.సుధీర్ పాల్, క్రాంతి కిరణ్, రంజిత్, పవన్, రమేష్, శంకర్, నవీన్, నిషేక్, లీలాక్రిష్ణ, మని, అజయ్, విజయక్రిష్ణ, వినోద్, వెంకటేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
301వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కురుపాం(విజయనగరం): రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 301వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం కురుపాం నియోజకర్గంలోని తోటపల్లి రిజర్వాయర్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి తోటపల్లి క్రాస్, నందివానివలస, గిజబ, దత్తివలస, గవరమ్మపేట, పెదమేరంగి జంక్షన్ మీదుగా సీమనాయుడు వలస వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. -
25నే సిక్కోలు గడ్డపై తొలి అడుగు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అబద్ధపు హామీల అసలు రంగు బయటపెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు మాయోపాయాలను భగ్నం చేయడమే గాకుండా కష్టనష్టాల్లో ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల సంక్షేమ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈనెల 25వ తేదీన జిల్లాలో అడుగిడనుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సాగుతున్న ఈ పాదయాత్ర వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరఘట్టం మండలం మీదుగా జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలోకి రానుంది. ప్రజానేత జగన్‌కు అపూర్వ స్వాగతం పలకడానికి శ్రీకాకుళం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ పాదయాత్రఏర్పాట్లపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం సాయంత్రం శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ శ్రీకాకుళం–విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ సతీమణి విజయ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు తదితర నాయకులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది నవంబరు ఆరో తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టేసరికి ఉప్పెనలా మారిందన్నారు. కృష్ణా, గోదావరి బ్రిడ్జిలపై నుంచి సాగిన పాదయాత్రలో జనం పోటెత్తారని గుర్తు చేశారు. ఇలా రోజురోజుకు పెరుగుతున్న అమోఘమైన ప్రజాదరణను చూసే టీడీపీ పాలకులు ఓర్వలేకపోయారని అన్నారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే ఉత్తరాంధ్రలో సైతం వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ప్రజాసంకల్ప యాత్ర నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగిందని వివరించారు. అంతకుమించిన రీతిలో శ్రీకాకుళం జిల్లాలోనూ ధర్మాన, తమ్మినేని వంటి ఉద్ధండ నాయకుల నేతృత్వంలో విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే 2003లో నాటి ప్రతిపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్రకు శ్రీకాకుళం ప్రజలు నీరాజనం పట్టారని భూమన గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితోనే ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో జరిగే ప్రతి బహిరంగ సభనూ దిగ్విజయంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఇచ్ఛాపురంలో ముగింపు సభనూ విజయవంతం చేయడం ద్వారా దుష్టపాలకులపై సమరభేరి మోగించాలని పిలుపునిచ్చారు. తిత్లీ తుఫానుతో జిల్లాలో నష్టపోయిన బాధితులందర్నీ జగన్మోహన్రెడ్డి తప్పకుండా పరామర్శిస్తారని చెప్పారు. తండ్రి రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్‌ను ముఖ్యమంత్రిగా చేస్తే తమ కష్టాలు తీర్చుతాడని, కన్నీరు తుడుస్తాడని రాష్ట్ర ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఒక జిల్లాకు మించి మరొక జిల్లా పోటీ పడుతూ ఇప్పటివరకూ 12 జిల్లాల్లోనూ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైందని చెప్పారు. ఇంతటి ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు పన్నిన కుట్రలో భాగమే జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనని ఆరోపించారు. ఇలాంటి ఘోరాలను, కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని, పాదయాత్ర ఒక పార్టీ కార్యక్రమంలా గాకుండా ప్రతి ఇంటి పండుగలా నిర్వహించాలని శ్రేణులకు భూమన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కోసం జగన్ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు ఘట్టానికి శ్రీకాకుళం జిల్లా వేదిక కావడం గర్వకారణమన్నారు. చారిత్రాత్మకమైన ఈ పాదయాత్రను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జగన్ నాయకత్వ పటిమపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు అధికమవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను విజయవంతం చేయడం అందరి బాధ్యత అని అన్నారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ ప్రజలతో అనునిత్యం మమేకమై వారి సమస్యలు తెలుసుకుని, వాటిని తీర్చేందుకు జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన పాదయాత్రను విజయవంతం చేయాలని, ఆయన్ను ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని కోరారు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటివరకూ ఇచ్ఛాపురం వేదికగా ప్రారంభమైన లేదంటే ముగిసిన ఏ కార్యక్రమమైనా సరే అద్వితీయమైన విజయాలకు నాంది పలికాయని గుర్తు చేశారు. ప్రజాసంకల్పయాత్ర కూడా విజయవంతమవుతుందని, ఇది పార్టీ గెలుపునకు నాంది పలుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ ప్రోగ్రామ్స్ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, గొండు కృష్ణమూర్తి, అంబటి శ్రీనివాస్, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ, కేఎల్ ప్రసాద్, తమ్మినేని చిరంజీవినాగ్, పొన్నాడ రుషి, హనుమంతు కిరణ్‌కుమార్, పీస శ్రీహరి, పీస గోపి, దువ్వాడ శ్రీధర్, చల్లా అలివేలు మంగ, చల్లా మంజుల, టి.కామేశ్వరి పాల్గొన్నారు. 40 రోజుల పాటు పాదయాత్ర ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 25వ తేదీన వీరఘట్టం మండలం కెల్ల గ్రామం మీదుగా జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలి. మిగిలిన జిల్లాల్లో కన్నా వినూత్నంగా ఉండేలా చూసుకోవాలి. ఎన్నికల సమయం దగ్గరవుతోంది. జిల్లాలో 40 రోజుల పాటు పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో సగటున నాలుగు రోజుల పాటు ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా అధికంగా ఉండేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి.– ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ -
సంకల్పం రాస్తున్న చరిత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జనం కోసం వేసిన తొలి అడుగు వేలాది కిలోమీటర్లు దాటినా అలసిపోనంటోంది. ప్రజా క్షేత్రంలోకి వచ్చి వందల రోజులు గడిచిపోతున్నా ఆ అడుగు ముందుకే పడుతోంది. ఎందుకంటే ఆయన జగన్. జనం నుంచి.. జనం కోసం పుట్టిన నాయకుడై క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతున్న జననేత ప్రజా సంకల్పయాత్ర జిల్లాలోనే వరుస రికార్డులను నమోదు చేసుకుం టోంది. జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సం కల్పయాత్ర ఆదివారం నాటికి 300 రోజులు పూ ర్తి చేసుకుని మరో కొత్త చరిత్రను నమోదు చేసుకుంది. జననేత కురుపాం నియోజకవర్గంలో ప్రవేశించిన సమయంలో మూడొందల రోజుల ఘట్టా నికి గుర్తుగా మొక్క నాటి భారీ కేక్‌ను కట్ చేశారు. అనేక మైలురాళ్లు దాటి... వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయలో ప్రారంభమైన జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఇప్పటికే పలు మైలు రాళ్లను దాటింది. సెప్టెంబర్ 24న విజయనగరం జిల్లాలో అడుగిడిన రోజే ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలసలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. గుర్ల మండలం ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్లు, సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారు. తాజాగా ఆదివారం పాదయాత్ర ప్రారంభించి 300 రోజులు పూర్తి చేసుకోవటం ద్వారా మరో నూతన రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 124 నియోజకవర్గాలు, 8 కార్పొరేషన్లలో పర్యటించిన జగన్ 114 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు 42 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గంలో ఘన స్వాగతం పార్వతీపురం పట్టణ శివారుల నుంచి ప్రారంభమైన పాదయాత్ర కోటవానివలస, బంటువాని వలస, అడ్డాపు శీల, బాచి జంక్షన్ మీదుగా సీతారామపురం క్రాస్ వద్దకు చేరుకుంది. అడ్డాపుశీల వద్ద సెలూన్ షాపును సందర్శించి నిర్వహణ లో కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనానంతరం కురుపాం నియోజకవర్గంలోకి ప్రవేశించగా.. స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమా ర్తె శ్రావణితో పాటు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు జననేత జగన్‌కు ఘన స్వాగతం పలికారు. తమ ఆశల రేడు తమ నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్బంగా మందుగుండు సామాగ్రి పేల్చి సంబరాలు చేసుకున్నారు. పార్టీ రంగులతో సుందరంగా తీర్చిదిద్దన ఎండ్ల బండ్లతో రైతన్నలు ఆత్మీయ నేతకు సాదర స్వాగతం పలికారు. భోజన విరామ సమయంలో అరకు నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి ఫల్గుణ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ, టీడీపీ నాయకులు వైఎస్జగన్ సమక్షంలో పార్టీలో చేరగా... రాత్రి బస వద్ద రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో టీడీపీ , కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలు వురు నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. కష్టాలు వింటూ.. భరోసా కల్పిస్తూ: ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్మోహన్రెడ్డి ప్రజలు పడుతున్న కష్టాలు వింటూ... వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. పాదయా త్ర ప్రారంభంలో రెల్లి కులస్థులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న తమను ఆదుకోవాలని, ఉద్యోగ, ఉపాధి రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి పని చేస్తున్నప్పటికీ క్రమబద్ధీకరణకు నోచుకోకపోగా.. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో పార్టీ నాయకులు: పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, పార్వతీపురం, నెల్లిమర్ల నియోజకవర్గాల సమన్వయకర్తలు అలజంగి జోగారావు, పెనుమత్స సాంబశివరాజు, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, యువజన నేత ఈశ్వర్ కౌశిక్, ఏలూరు పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయిబాలపద్మ, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, నెల్లిమర్ల జెడ్పీటీసీ గదల సన్యాసినాయు డు, చిత్తూరు జిల్లా నాయకురాలు సామాన్య కిరణ్, రాజమండ్రి అర్బన్ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రా జు, కొవ్వూరు కో ఆర్డినేటర్ తానేటివనతి, గోపాలపురం కో ఆర్డినేటర్ వెంకటరావు, అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, కొవ్వూరు పట్టణ పార్టీ అధ్యక్షులు రుత్తల ఉదయ్‌భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. తోటపల్లి ప్రాజెక్టు కుడిప్రధాన కట్టపై యాత్ర మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 90 శాతం పనులు పూర్తి చేసుకున్న తోటపల్లి ప్రాజెక్టును ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదివారం తనివితీరా పరిశీలించారు. పాదయాత్రలో భాగంగా కురుపాం నియోజకవర్గం చేరుకున్న ఆయన సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవు గల ప్రాజెక్టు కుడి ప్రధాన కట్టపై పాదయాత్ర చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్థ్యంతో పాటు విడుదలవుతున్న నీటిద్వారా సాగవుతున్న విస్తీర్ణం వివరాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. రిజర్వాయర్‌లో వైఎస్సార్సీపీ ఫ్లెక్లీలతో బోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెలూన్ దీపాలు, బాణా సంచా వెలుగులతో ఆ ప్రాంతం పండగను తలపించింది. జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుని ఆదివారం మధ్యాహ్న భోజన విరామానంతరం కురుపాం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. -
నేటి ప్రజాసంకల్పయాత్ర ఇలా....
సాక్షిప్రతినిధి, విజయనగరం : వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారంనాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ రాత్రిబస వద్ద ప్రారంభమై జియ్యమ్మవలస మం డలం సీమన్నాయుడువలస వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. తోటపల్లి రిజర్వాయర్ రాత్రిబస నుంచి తోటపల్లి క్రాస్, నందివానివలస, గిజబ, దత్తివలస వరకూ సాగుతుందని తెలిపారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం జియ్యమ్మవలస మండలం గవరంపేట, పెదమేరంగి జంక్షన్, సీమనాయుడువలస వరకు సాగుతుందని, అక్కడే రాత్రి బస చేస్తారని వివరించారు. -
ప్రజా దీవెనలే జగనన్నకు రక్ష
ప్రజాసంకల్పయాత్ర బృందం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని ఆ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పార్వతీపురం మండలం కోటవానివలస వద్ద ఆయన ఆది వారం మాట్లాడారు. రా ష్ట్రంలో వైఎ స్సార్ సీపీ బలోపేతం కావడంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుసుకున్న చంద్రబాబు ప్రతిపక్ష నేతను తుదముట్టించేందుకు తెగబడుతున్నారని ఆరోపించారు. జగన్‌పై హత్యాయత్నంపై సీబీఐ విచారణ కోరుతున్న నేపథ్యంలో సీబీఐను రాష్ట్రంలోకి రాకుండా జీవో విడుదల చేశారని దుయ్యబట్టారు. ఇంతకంటే అరాచక, అవి నీతి పాలన ఎక్కడా ఉండదన్నారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న విషయం సామాన్యులు చర్చించుకుంటున్నారని చెప్పారు. ఒకప్పుడు సీబీఐ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు వద్దు అంటున్నారని ఎందుకో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్య మంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చారిత్రాత్మకంగా జరుగుతోందన్నారు. మూడు వేల కిలోమీటర్లు, 300 రోజులు విజయనగరం జిల్లాలో పూర్తి కావడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పా రు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయని తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో కూడా బహిరంగ సభకు ప్రజలకు బ్రహ్మరథం పట్టనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానం వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవటం ఖాయమన్నారు. -
కరువుకు కారణం టీడీపీయే...
ప్రజాసంకల్పయాత్ర బృందం: జిల్లాలో 26 మండలాల్లో కరువు ఏర్పడటానికి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నియోజకవర్గంలోని పార్వతీపురం మండలం కోటవానివలస వద్ద ఆయన ఆదివారం మాట్లాడారు. జిల్లాలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవటంతోనే 26 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాం లోనే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేకపోయిందన్నారు. తోటపల్లి కాలువ పనులు పూర్తికాకపోవటంతో రణస్థలం, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాలకు సాగునీరు అందటం లేదన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో చెరకు రైతులు బకాయిలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే సమస్యలు తీరుతాయని, సంక్షేమ పాలన ప్రజలకు అందుతుందన్నారు. ప్రజా సంకల్పయాత్ర 300 రోజులు పూర్తి చేసుకుని జిల్లాలో జరిగిన ఎనిమిది బహిరంగ సభలు విజయవంతమయ్యాయన్నారు. -
ప్రజా సంకల్పయాత్రతో టీడీపీకీ సమాధి
ప్రజా సంకల్పయాత్ర బృందం: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించటమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నియోజకవర్గంలోని పార్వతీపురం మండలం కోటవానివలస వద్ద ఆయన ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమని తెలుసుకున్న చంద్రబాబు ప్రతిపక్ష నేతను తుదముట్టించేందుకు తెగబడుతున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో జరిగిన రాజన్న రాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాశీస్సులతో జగన్ యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రజల దీవెనలే జగన్‌కు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. -
తోటపల్లి పేరు వింటే వైఎస్సార్ గుర్తుకొస్తారు...
ప్రజాసంకల్పయాత్ర బృందం: తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు పేరు చెప్పగానే కురుపాం నియోజకవర్గంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రైతులు, ప్రజలకు దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి గుర్తుకొస్తారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఆదివారం ఆమె మాట్లాడారు. లక్షలు ఎకరాలు సాగు చేస్తున్న రైతులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే తోటపల్లి ప్రాజెక్టును శరవేగంగా పనులు జరిపించిన ఘనత మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డిదే అన్నారు. ముఖ్యంగా కురుపాం నియోజకవర్గ ప్రజల, రైతులు గుండెల్లో దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. అందుకనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నియోజకవర్గంలోని అడుగు పెట్టగానే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపడుతున్న పాదయాత్ర కురుపాం నియోజకవర్గంలో 300 రోజులు పూర్తి చేసుకోవడం ఎంతో అదృష్టమని ఈ సంఘటన నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. ఈ నెల 20న కురుపాం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ ఉందని, ఆ సభకు నియోజకవర్గంలోని మహిళలు, రైతులు, ప్రజలు, యువత స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
కురుపాంలో వైఎస్సార్ జ్ఞాపకాలు పదిలం....
విజయనగరం , ప్రజాసంకల్పయాత్ర బృందం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశ రాజకీయ చరిత్రలోనే మరిచిపోలేని నేతగా కీర్తి పొందారని వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలో తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఆదివారం మాట్లాడారు. ముఖ్యంగా కురుపాం నియోజకవర్గంలో వైఎస్సార్ జ్ఞాపకాలు ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు సమయంలో ఎంతో మంది నిర్వాసితులకు ఇళ్లు కట్టించి ఇచ్చారని అన్నారు. వైఎస్సార్ జ్ఞాపకాలతోనే ఆయన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. కురుపాం నియోజకవర్గంలో పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
విజయనగరం ,ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతుండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆ పార్టీలను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేపడుతున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాజమండ్రి రూరల్‌కు చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మం డలం తోటపల్లి రిజర్వాయర్ వద్ద రాజమం డ్రి రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కోలమూరు పంచాయతీ పరిధిలో గల కుంతమూరుకు చెందిన టీడీపీ మాజీ అధ్యక్షుడు కంటిపూడి బలరామకృష్ణచౌదరి, కుంపల్లు గోపాలకృష్ణ, తోర్రేడు గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చుట్టూరి రామకృష్ణచౌదరి, జన్మభూమి కమిటీ సభ్యులు మానేపల్లి సుగుణ, టి.జయశ్రీ, బి.వెంకటరత్నం తదితరులు పార్టీలో చేరారు. -
సీఆర్టీలను రెగ్యులరైజ్ చేయండన్నా...
విజయనగరం: అన్నా 15 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా పని చేస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయలేదు. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా... బాబు వస్తే ఇంటికో జాబు అని చెబుతూ ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయిందన్నా ఈ టీడీపీ ప్రభుత్వం. మా పార్వతీపురం డివిజన్లో 361మంది సీఆర్‌టీలం ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి రాగానే సీఆర్టీలను రెగ్యులైజ్ చేసి, వేతనాలు సవరణ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నా... అని సీఆర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ. భాస్కరరావు, దొర, సంధ్యారాణి తదితరులు ప్రజాసంకల్పయాత్రలో జగన్మోహనరెడ్డిని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.– ఇ.భాస్కరరావు, సీఆర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,దొర, సంధ్యారాణ -
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఉంది..
విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: అన్నా నా పేరు లింగారెడ్డి వీరప్రతాపరెడ్డి. నేను వైఎస్సార్ కడప జిల్లా వీఎన్‌పల్లి మండలం, బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాను. మిమ్మల్ని సీఎంగా చూడాలని పాదయాత్ర ప్రారంభం నుంచి మీతోనే నడుస్తున్నాను. నాన్న గారి హయాంలో కూడా ఆయన వెంటే నడిచాను. సోదరి షర్మిలతో కూడా రాయలసీమలో నడిచాను. మీరు ముఖ్యమంత్రి కావడమే నా కోరిక అంటూ కురుపాం నియోజకవర్గంలోని ఉల్లిభద్ర వద్ద వీరప్రతాపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసారు.