
జగన్‌మోహనరెడ్డి వద్ద గోడు వెళ్లబోసుకుంటున్న మౌనిక
విజయనగరం :అన్నా.. మా నాన్న డొల్లు గౌరినాయుడు తోటపల్లి హోమియోపతి ఆస్పత్రిలో సుమారు 25 సంవత్సరాలుగా స్వీపర్‌గా పనిచేశాడు. నెలకు రూ.75 వేతనం దగ్గర నుంచి 750 రూపాయల వరకు పనిచేశాడు. 2006లో ఆరోగ్యం బాగోలేక విధులకు హాజరుకాలేకపోయాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వెళ్తే విధుల్లోకి తీసుకోలేదు. అమ్మ, నేను, చెల్లి తండ్రి సంపాదనపైనే ఆధారపడి ఉన్నాం. చదువుకోవడానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. ఎమ్మెల్యే లెటర్ తీసుకెళ్లినా ఉద్యోగం ఇవ్వలేదు. నువ్వు ముఖ్యమంత్రి కాగానే మా నాన్నకు ఉద్యోగం ఇప్పించన్నా..– డొల్లు మౌనిక, తోటపలి