![MLA Pushpa Srivani Slams TDP - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/22/ys5.jpg.webp?itok=w-9ez7X2)
ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత వల్లే కురుపాం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేశారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గ కేంద్రం శివారులో బుధవారం ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్రలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలను బిడ్డల్లా ఆదరించి అన్ని సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలు చేసిన ఘనత మహానేత వైఎస్సార్‌కే దక్కిందన్నారు.
అదే నమ్మకాన్ని ఆయన తనయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పట్ల చూపిస్తున్నారన్నారు. కురుపాంలో జరిగిన బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల వారికి అమలు చేసే సంక్షేమ పథకాల హమీలను ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజల కష్టాలను తీర్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment