గిరిజన ఉత్పత్తుల స్టాల్‌ను సందర్శిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజా సంకల్పయాత్ర బృందం: అటవీ ప్రాంతంలో లభించే ఫలసాయంతో పాటు పోడు వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ ఉన్నా జీవనం కష్టంగానే ఉందని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేశారు. జీసీసీ గిరిజన ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జియ్యమ్మవలస మండలం అలువాడ జంక్షన్ వద్ద పోడు వ్యవసాయం చేసే గిరిజనులు ఏర్పాటుచేసిన స్టాల్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు కె. దీనమయ్య, జి. గిరిబాబు, ఆర్. సత్తిబాబు, ఎన్. వెంకటరా వు, టి. కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు ఆరిక జగన్నాథం, తదితరులు మాట్లాడుతూ, ఎత్తైన కొండల్లో తాము చింతపండు, జీడి, తదితర పంటలు సేకరిస్తునే...
మరోపక్క ఆలు బియ్యం, సామ బియ్యం, కొర్ర బియ్యం, జొన్నలు, రాగులు, గంటెలు సాగు చేస్తున్నామన్నారు. సామ, ఆలు, కొర్ర బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా కొనుగోళ్లుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 36 రకాల ఉత్పత్తులను పండిస్తే జీసీసీ కేవలం 2 రకాల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తుందనీ, అదీ అరకొరగానేనని వాపోయారు. తాము సేకరించిన చింతపండును జీసీసీ కిలో రూ.20 చొప్పున కొనుగోలు చేస్తుంటే అదే చింత పండును హెరిటేజ్ వంటి సూపర్‌మార్కెట్లలో కిలో రూ.180 లెక్కన విక్రయిస్తున్నారని తెలిపారు. అలాగే సుగంధ ద్రవ్యాలు, ఆరోగ్యానికి ఉపయోగపడే ఉత్పత్తులు సేకరిస్తున్నా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాయని జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు కోల్ట్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలన్నీ సావదానంగా విన్న జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఎనిమిది గంటలే పని..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ సెక్టార్‌లో కూడా 8 గంటలే పనివిధానం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ ఉద్యోగులను ఆయా యాజమాన్యాలు వేధిస్తున్నాయి. ప్రతిఏటా డీఎస్సీ తీసి నిరుద్యోగులను ఆదుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. వైఎస్సార్‌సీసీ అధికారంలోకి రాగానే అన్నివర్గాలకూ మేలు చేయాలి. – గంధవరపు రాంబాబు, బిత్తరపాడు
బిల్లులు ఇవ్వలేదు..
మరుగుదొడ్డి నిర్మించుకుంటే బిల్లులు ఇస్తానన్నారు. సుమారు రూ. 20 వేలు అప్పు చేసి మరుగుదొడ్లు కట్టా. ప్రభుత్వం 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కాని ఒక్క రూపాయి కూడా అందలేదు.
– బాలసింగి రాధమ్మ,ఎం. అలువాడ
Comments
Please login to add a commentAdd a comment