
శెట్టిబలిజలను ఉద్దేశించి మాట్లాడుతన్న జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజా సంకల్పయాత్ర బృందం: శెట్టిబలిజ కులస్తుల అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని శెట్టి మహానడు రాష్ట్ర కన్వీనర్ కుడుపూరు సూర్యనారాయణరావు కోరారు. మాజీమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో సూర్యనారాయణరావు తన కార్యకర్తలతో కలిసి జియ్యమ్మవలస మండలం శిఖబడి క్రాస్ వద్ద ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉందన్నారు.
శెట్టిబలిజ సామాజిక వర్గంలో చాలా పేదవారు ఎక్కువగా ఉన్నారని.. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే శెట్టిబలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జననేత దృష్టికి తీసుకువచ్చారు. దీనికి జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ ప్రతి సామాజికవర్గానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి, కుడిపూడి బాబు, యూత్ రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, గుత్తుల శ్రీను, రాష్ట్ర నాయకులు గుబ్బల తులసికుమార్, గెద్దాడ వేంకటేశ్వరరావు, పితాని ప్రసాద్, విజయనగరం గౌరవ అధ్యక్షుడు గండిబోయిన ఆది, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సూరిబాబు,తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment