సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శనివారం కురుపాం నియోజకవర్గంలో పునఃప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రికే ఆయ న జియ్యమ్మవలస శిఖబడివద్ద ఏర్పాటుచేసిన రాత్రిబసకు చేరుకున్నారు. శనివారం ఉదయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలో గడచిన రెండు నెలలుగా పాదయాత్ర కొనసాగుతోంది. ఆయన్ను చూసిన ప్రతి పల్లె నిలువెల్లా పులకిం చింది. తొమ్మిది నియోజకవర్గాల్లో వేలాది బాధితులు తమ కష్టాలను కలబోసుకున్నారు. సమస్యలను నివేదించారు. వినతులు అందించారు. వారందరి వేదన కూలంకషంగా తెలుసుకుని మరికొద్ది రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందనిభరోసా కల్పిస్తున్నారు.
తొమ్మిది నియోజకవర్గాల్లోనూ జనసందోహం
ఇంతవరకు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఆయన ప్రసంగంతో ఉత్తేజితులయ్యారు. సెప్టెంబర్ 24న జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర మరో రెండు రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు చేరుకోనుంది. ఇన్నాళ్లూ తమలో కలసి మెలసి తిరిగిన జననేత జిల్లా దాటి వెళ్తున్నారని తెలుసుకున్న జనం భారంగానే ఆయనకు ఘన వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు.
నేటి ప్రజాసంకల్పయాత్ర ఇలా....
జననేత జగన్‌మోహన్‌రెడ్డి శనివారంనాటి పాదయాత్ర వివరాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. శనివారం ఉదయం 7.30 గంటలకు జియ్యమ్మవలస మండలం శిఖబడి క్రాస్ రాత్రిబస వద్ద ప్రారంభమై తురకనాయుడువలస వరకు సాగుతుందన్నారు. శిఖబడి క్రాస్ వద్ద ప్రారంభమై బి.జె.పురం, గెడ్డతిరువాడ మీదుగా ఇటికకు చేరుకుంటుందని చెప్పారు. అక్కడి నుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం కుందర తిరువాడ క్రాస్, చినకుదమ క్రాస్ మీదుగా తురకనాయుడువలసకు చేరుకుని అక్కడ రాత్రి బసచేస్తారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment