
విజయనగరం :అన్నా మా గ్రామాలను మీరే ఆదుకోవాలి. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కిచ్చాడ, వన్నం, పులిగుమ్మి, రామకృష్ణాపురం, పట్టాయదొరవలస గ్రామాల మహిళలు పూతికవలస వద్ద జగన్‌ను తమ సమస్య చెప్పారు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. బస్సు కాదు కదా...ఆటో కూడా రావడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలి. –వన్నాం గ్రామ మహిళలు