వ్యవసాయంపై అవగాహనలేని లోకేష్ మాట్లాడుతున్నారు.. | MLA Kakani Slams Lokesh On Talking Agriculture Without Any Knowledge On It | Sakshi
Sakshi News home page

వ్యవసాయంపై అవగాహనలేని లోకేష్ మాట్లాడుతున్నారు..

Published Tue, Jul 2 2019 4:58 PM | Last Updated on Tue, Jul 2 2019 6:15 PM

MLA Kakani Slams Lokesh On Talking Agriculture Without Any Knowledge On It - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: నెల రోజుల పాలనలో ఎన్నో ప్రజా ప్రయోజన నిర్ణయాలను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. పాదయాత్ర సమయంలో ఆయన ఏవైతే హామీలను ఇచ్చారో.. అవి అమలు చేస్తున్నారని సర్వేపల్లి ఎం.ఎల్.ఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నదీ జలాలను సద్వినియోగ  పర్చుకునేందుకు తెలంగాణా ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన కారణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనను చూసి ఓర్వలేక టిడిపి నేతలు ఆరోపణలు  చేస్తున్నారు. భద్రత పై చంద్రబాబు గగ్గోలు పెట్టడం సరికాదు. ఆయనకు నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భద్రతను కల్పిస్తోందన్నారు. వ్యవసాయం పై కనీస అవగాహన లేని లోకేష్ మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement