326వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | YS Jagan PrajaSankalpaYatra 326th Day Begins | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 9:12 AM | Last Updated on Thu, Dec 20 2018 9:44 AM

YS Jagan PrajaSankalpaYatra 326th Day Begins - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 326వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం దుర్గమ్మ పేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లక్ష్మీపురం క్రాస్‌, సవరపేట క్రాస్‌, శివరాంపురం క్రాస్‌, సంతబొమ్మళి, బోరభద్ర క్రాస్‌, జగన్నాథపురం క్రాస్‌, వడ్డి తాండ్ర మీదుగా దండుగోపాలపురం వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement