
జగన్‌ను కలిసిన పీఎంపీ అసోషియేషన్ జిల్లా ప్రతినిధులు
విజయనగరం :ఎన్నో ఏళ్ల నుంచి పీఎంపీ డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో రోగులకు ప్రథమ చికిత్స అందిస్తూ సేవలను అందిస్తున్నాం. జిల్లా మొత్తం దాదాపు 15వేల మంది పీఎంపీ డాక్టర్లుగా కొనసాగుతున్నాం. మమ్మల్ని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మా కోసం జీవో 425ను విడుదల చేసి వృత్తి పరంగా శిక్షణ అందించేలా చేశారు. సర్టిఫికెట్లు కూడా అందించి మాకు పీఎంపీ డాక్టర్లుగా ప్రత్యేక గుర్తింపును కూడా రాజన్న ఇస్తామన్నారు.
దురదృష్టావవత్తు అదే సమయంలో వైఎస్ చనిపోయారు. అప్పటి నుంచి మా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. తరువాత జరిగిన పరిణామాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మేమంతా శిక్షణ పొంది ఉన్నాం... మాకు సర్టిఫికేట్లను ఇప్పించడయ్యా అని ఎన్ని సార్లు వేడుకున్నా పట్టించుకోలేదు.. మా కోసం జీవో 465 నెంబర్‌ను తెరపైకి తెచ్చినా ఐఎమ్‌వోఒత్తిడితో అమలు కాకుండా చేశారు.. మన ప్రభుత్వం ఏర్పడ్డాక మా పీఎంపీ డాక్టర్ల సమస్యను పరిష్కరించాలన్నా...–పీఎంపీ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు