సీఎం చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. తుపాన్ వస్తుందని తెలిసినా తమను గాలికి వదిలేసి వెళ్లిపోయారని, చంద్రబాబు కంటే నీచమైన వ్యక్తి ప్రపంచంలోనే ఉండడని ప్రజలంతా మండిపడుతున్నారని చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శనివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు మనస్తత్వం గురించి ఓ పెద్దాయన చెప్పిన విషయాలను వెల్లడించారు.