tekkili
-
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ టెక్కిలి
-
బాబు నవగ్రహాలను కంట్రోల్ చేస్తున్నానని మాట్లాడుతున్నాడు
-
రెండు వ్యాన్లు ఢీ: ఒకరు మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద శనివారం వేకువ జామున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా పది మంది స్వల్పంగా గాయపడ్డారు. టెక్కలి మండలం చిన్నకేదారికి చెందిన పెళ్లి బృందం వ్యాను0 పాతపట్నం మండలం కోడూరు నుంచి వస్తుండగా మలుపులో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో వ్యాను ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాను డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పెళ్లి వ్యానులోని దాదాపు 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని టెక్కలి ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యాన్ డ్రైవర్ వైజాగ్‌కు చెందిన వాడని తెలుస్తోంది. -
బస్సు- లారీ ఢీ : 15 మందికి గాయాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... టెక్కిలి నుంచి ఇచ్చాపురం వెళ్తున్నబస్సు నర్సాపురం జంక్షన్ వద్ద ఆగింది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్తానికులు స్పందించి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (టెక్కలి)