టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద శనివారం వేకువ జామున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా పది మంది స్వల్పంగా గాయపడ్డారు. టెక్కలి మండలం చిన్నకేదారికి చెందిన పెళ్లి బృందం వ్యాను0 పాతపట్నం మండలం కోడూరు నుంచి వస్తుండగా మలుపులో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో వ్యాను ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాను డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పెళ్లి వ్యానులోని దాదాపు 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని టెక్కలి ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యాన్ డ్రైవర్ వైజాగ్‌కు చెందిన వాడని తెలుస్తోంది.