ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించామని, అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు స్పష్టంగా వివరించి చెప్పామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదికిపైగా ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. 3600 కిలోమీటర్లకుపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్ర.. ప్రజాసంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంగా వైఎస్ జగన్ సాక్షి టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.