Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Telangana Govt React On HCU Land Issue1
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హెచ్‌సీయూ యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమి అమ్మకం వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ క్లారిటీ ఇచ్చింది.నగరంలోని హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించారు. ఈ క్రమంలో..‘ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే. ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు. ఆ భూమి య‌జ‌మాని తామేన‌ని న్యాయ‌స్థానం ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థ‌కు 21 ఏళ్ల క్రితం కేటాయించిన‌ భూమిని న్యాయ‌పోరాటం ద్వారా ప్ర‌భుత్వం ద‌క్కించుకుంది. వేలం.. అభివృద్ధి ప‌నులు అక్క‌డ ఉన్న రాళ్లను దెబ్బ‌తీయ‌వు. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్‌) లేదు సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సీయూది కాదని తేలింది అని క్లారిటీ ఇచ్చింది. అలాగే, ‍విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు.. సెంట్రల్‌ యూనివర్సిటీలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇద్దరు పీహెచ్‌డీ స్కాలర్స్‌ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎర్రం నవీన్‌ కుమార్‌, రోహిత్‌పై 329(3), 118(10, 132, 191(3), 351(3) r/w 3(5) బీఎన్ఎస్‌ యాక్ట్‌ కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు పెట్టారు.

KSR Comment On Nara Lokesh Red Book2
Nara Lokesh: కోతి చేతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు..!

తెలుగుదేశం పార్టీ అబద్దాల ఫ్యాక్టరీగానే కాదు.. అహంభావం తలకెక్కిన పార్టీగా మారిపోయిందా! పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు చేసిన ప్రసంగాలు చూస్తే అలాగే అనిపిస్తోంది! అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఫీల్ కారు. ఇప్పుడు లోకేష్ కూడా అదేబాటలో పయనిస్తూ అబద్దాలు చెప్పడంలో తండ్రితో పోటీ పడుతున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. అబద్దాల వరకైతే ఒక రకంగా సరిపెట్టుకోవచ్చు. కాని తానొక యువరాజు అనుకుని అహంకారంతో నారా లోకేష్‌(Nara Lokesh) మాట్లాడుతున్న తీరు కచ్చితంగా ఆయన స్వభావాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబు నాయుడుకు లోపల అహం ఉన్నా, పైకి కనిపించకుండా నటిస్తూ, రెండు రకాలుగా ఆయనే మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. కానీ లోకేష్ మాత్రం అధికారంతో వచ్చిన కైపుతో మాట్లాడుతున్న వైనం పార్టీలోనే కాదు.. ప్రజలలో కూడా వెగటు పుట్టించే అవకాశం ఉంది. వీరి ఉపన్యాసాలకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ.. చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు చెప్పారని, లోకేష్ అధికార మదంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో లోకేష్ ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 👉విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ(TDP) ఏర్పడినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో చేరనే లేదు. పార్టీలోకి రావాల్సిందిగా మామ ఎన్‌టీఆర్‌, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరినా, అసలు తెలుగుదేశం పార్టీ మనజాలదని చెప్పారు. సినిమా వాళ్లను జనం ఆదరించరని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వంలో మంత్రి. పార్టీ అదేశిస్తే మామపై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికిన చరిత్ర ఆయనది. కానీ 1983 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయాయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠమెక్కిన మామ పార్టీలోకి రావడం చంద్రబాబుకు ఇబ్బంది రాలేదు. అప్పటి నుంచి పార్టీని ఒక ప్లాన్ ప్రకారం తన గుప్పెట్లోకి తెచ్చుకుని, చివరికి రామారావునే కూలదోసిన సంగతీ తెలిసిందే. 👉చివరి రోజుల్లో ఎన్టీఆర్‌ స్వయంగా చంద్రబాబును(Chandrababu) విలువలు లేని వ్యక్తి అని చెప్పిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చంద్రబాబు అంత దుష్టుడు లేడంటూ రామారావే వీడియో విడుదల చేశారు. ఆయన ఆకస్మిక మరణంతో చంద్రబాబు మాట మార్చేసి, ఆయన వారసత్వం తనదేనని ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలే తమ సిద్దాంతమని, ఆయన యుగపురుషుడు అంటూ కబుర్లు చెబుతూ వస్తున్నారు. కాలం గడిచే కొద్ది ఆ పేరు కనుమరుగవుతూ వచ్చింది. స్వోత్కర్ష పెరిగింది. పార్టీలోని ఇతర నేతలు, క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అబద్దాల కర్మాగారంగా మార్చడంలో విజయవంతం అయ్యారన్న అభిప్రాయం వివిధ వర్గాలలో వ్యక్తం అవుతుంటుంది. ఒక వర్గం మీడియాకు అవసరమైన వనరులను సమకూర్చి దానిని తన చెప్పుచేతలలో ఉండేలా చేసుకున్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఈ ఎల్లో మీడియా నిరంతరం శ్రమిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విజయవంతం అయ్యారు. మరికొన్ని సార్లు విఫలం అయ్యారు. వార్షికోత్సవంలో ఒకరినొకరు పొగుడుకుంటే పర్వాలేదు.కాని అదేదో పార్టీలో మొదటి నుంచి తానే ఉన్నట్లు, ఇప్పటికీ ఎన్టీఆర్‌ కాలం నాటి విలువలు కొనసాగిస్తున్నట్లుగా కబుర్లు చెప్పడమే అతిశయోక్తిగా ఉంటుంది. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు. పేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవాలని భావించేవారు. మాట ఇస్తే సాధ్యమైనంత వరకు ఆచరించి చూపాలని అనేవారు. అబద్దాలు చెప్పడానికి అంతగా ఇష్టపడేవారు కారు. అయితే పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటికి మంగళం పలికింది కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవం కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడితే, చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి 2023 లో నానా తంటాలు పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ఢిల్లీలో రోజుల తరబడి బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఎలాగైనా పొత్తు కావాలని కోరిన వైనం, పవన్ కళ్యాణ్‌ను బతిమలాడుకున్న తీరును గమనిస్తే, టీడీపీ ఆత్మగౌరవం ఎలా దిగజారిపోయింది తెలియడం లేదా! తన పార్టీలోకి ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావాలంటే రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్‌ నియమం పెట్టారు. చంద్రబాబేమో పూర్తిగా అందుకు విరుద్దం. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి తీసుకు వచ్చి, నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎన్టీఆర్‌ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 1994లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మద్య నిషేధం విధిస్తే, చంద్రబాబు ఆయనను పదవీచ్యుతుడిని చేసి మొత్తం రివర్స్ చేశారు. పోనీ వాటికైనా కట్టుబడి ఉంటారా ఉంటే అదేమీ లేదు. ఎన్నికలకు ముందు ఎక్కడలేని అబద్దాలు చెబుతారన్న విమర్శకు ఆస్కారం ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఏ రకంగా ఎగవేయాలన్న దాని కోసం ఎన్ని అసత్యాలైనా చెప్పడానికి వెనుకాడరని అనుభవాలు చెబుతున్నాయి. 2014 టర్మ్‌లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఏమి చేశారో అందరికి తెలుసు. 2024లో రికార్డు స్థాయిలో అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో అంతా గమనిస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్, తదితర హామీలు, అప్పుల గురించి ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారు! ఇప్పుడు ఏమి అంటున్నారు. 👉ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ అమలు చేయగలనని అనిపించిందట. అందుకే హామీలు ఇచ్చారట. కాని అధికారం వచ్చాక చేయడం కష్టమని తెలుస్తోందట. పదిహేనేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఈ మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా? ప్రజల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇంకొకటి అవుతుందా? ఒకసారి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటారు. మరోసారి స్కీములన్నీ ఇచ్చేస్తానని అంటారు. వేరొకసారి అప్పులు చేసి స్కీములు ఎలా ఇస్తామని ప్రజలనే ప్రశ్నిస్తారు. ఇలా అన్ని మాటలు ఆయనే చెబుతారు. కక్ష రాజకీయాలు చేయబోమని అంటారు. మళ్లీ ఆయనే తప్పు చేస్తే తాట తీస్తామని చెబుతారు. చంద్రబాబు పైకి కనీసం నటించనన్నా నటిస్తారు. కాని లోకేష్ ఏ మాత్రం మొహమాటం, పద్దతి ఏమీ లేకుండా అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కేవలం మాటలే కాదు.. ఆయన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు అంత మంచివాడిని కానని కూడా ప్రచారం చేసుకునేవారు. ఆయన కనిపెట్టిన రెడ్ బుక్ అనేది కోతికి కొబ్బరికాయ మాదిరిగా ఉంది. రెడ్‌బుక్‌ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నది, ఇష్టారాజ్యంగా వైసీపీ వారిపై కేసులు పెడుతున్నది, దౌర్జన్యాలు, విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నది తానేనని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. రెడ్ బుక్ అనగానే ఒకరికి గుండెపోటు వచ్చిందని, ఇంకొకరు బాత్ రూమ్ లో కాలు జారిపడ్డారని.. అర్థమైందా రాజా! అంటూ మాట్లాడిన తీరు ఆయనలోని అహంభావాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని, మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ కోసం ఎన్ని వ్యాధులు ఉన్నాయని కోర్టుకు చెప్పారని ప్రశ్నించారు. కేసులు రాగానే ఎక్కడ లేని వ్యాధులు చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయని అంబటి వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఆ స్కామ్‌లో మనీలాండరింగ్ జరిగిందని, చివరికి టీడీపీ ఆఫీస్ ఖాతాకు కూడా డబ్బు చేరిందని, అప్పట్లో సీఐడీ ఆధార సహితంగా చూపితే దానిని ఖండించలేక పోయారే!. దానికి తోడు ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి చంద్రబాబుకు రకరకాల జబ్బులు ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకుని బెయిల్ పొందారే! అదే ఆస్పత్రిలో ఇప్పుడు ఎవరైనా వైఎస్సార్‌సీపీ నేత చేరితే జబ్బు లేకపోయినా చేరినట్లవుతుందా? అదెందుకు!.. .. చంద్రబాబు అరెస్టు అయితే, పాదయాత్ర ఆపేసి మరీ లోకేష్ డిల్లీకి ఎందుకు పరుగులు తీశారు? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఏమని వేడుకున్నారు? ఇవన్ని వాస్తవాలే కదా. కాని జాక్ పాట్ మాదిరి అధికారం వచ్చింది కదా అని విర్రవీగితే లోకేష్ కే నష్టమని రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాంను టీడీపీనే రాష్ట్రపతి చేసినట్లు, ఇలా ఏవేవో డాంబికాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ రెడ్ బుక్ పేరుతో ప్రజలపైన ,ప్రతిపక్షంపై, ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడతామంటే ఎల్లకాలం వారి ఆటలు సాగవు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోకపోతే అదే రెడ్ బుక్ తన మెడకు చుట్టుకుంటుందన్న సంగతి లోకేష్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకే అంత మంచిది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

YS Jagan extends Ramzan greetings3
ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్‌ పండుగ సందర్బంగా వైఎస్‌ జగన్‌..‘ముస్లింలకు రంజాన్‌ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌’ అని అన్నారు.భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో క‌ఠిన‌మైన ఉప‌వాస దీక్ష‌లు ముగించుకుని ప్రేమ‌, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్ర‌తీక అయిన రంజాన్ పండుగ‌ను జ‌రుపుకుంటున్న ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025

IPL 2025, CSK VS RR: CSK Fangirl Reaction To Dhoni Dismissal Goes Viral4
RR VS CSK: చివరి ఓవర్‌లో ధోని ఔట్‌.. సీఎస్‌కే ఫ్యాన్‌ గర్ల్‌ రియాక్షన్‌ చూడండి..!

ఐపీఎల్‌ 2025లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చివరి వరకు పోరాడి 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 176 పరుగుల వద్ద ఆగిపోయింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని చెన్నైని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.Shimron Hetmeyer took a brilliant catch in the final over to dismiss MS Dhoni and potentially save the match for Rajasthan !! 👏👏#RRvCSK #RRvsCSK pic.twitter.com/AGhS9ZM2cU— Cricketism (@MidnightMusinng) March 30, 2025చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని తొలి బంతికే ఔటయ్యాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో హెట్‌మైర్‌ బౌండరీ లైన్‌ వద్ద అద్బుతమైన క్యాచ్‌ పట్టాడు. ఇది చూసి ధోనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ఫ్యాన్‌ గర్ల్‌ తట్టుకోలేకపోయింది. ఎంత పని చేశావు రా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. హెట్‌మైర్‌ పక్కనే ఉంటే ఆ అభిమాని చేతిలో తన్నులు తినుండే వాడు. ఈ ఫ్యాన్‌ గర్ల్‌ రియాక్షన్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. దీనిపై రకరకాల మీమ్స్‌ వస్తున్నాయి.Reaction of a Dhoni fan when Hetmyer took his catch! Thala for a reason! 🔥 pic.twitter.com/0RmHT4kfcw— Keh Ke Peheno (@coolfunnytshirt) March 31, 2025కాగా, ధోని ఔటైన అనంతరం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. ఈ మ్యాచ్‌లో ధోని సీఎస్‌కేను గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. రాయల్స్‌ సైతం ధోనికి బయపడుతూనే సందీప్‌ శర్మకు చివరి ఓవర్‌ ఇచ్చింది. అప్పటికే 10 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 16 పరుగులు చేసిన ధోని మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. Wake up babe new meme template just dropped #CSKvsRR #Dhoni pic.twitter.com/J5jMnZKp4W— Ganeshan (@ganeshan_iyer) March 30, 2025అయితే హెట్‌మైర్‌ డీప్ మిడ్ వికెట్ వద్ద అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి చెన్నై అభిమానుల ఆశలను అడియాసలు చేశాడు. ధోని ఔటైన వెంటనే సీఎస్‌కే ఓటమి ఖరారైపోయింది. నాలుగో బంతికి ఓవర్టన్‌ సిక్సర్‌ కొట్టినా ఎలాంటి ప్రయోజనం లేదు.ఛేదనలో సీఎస్‌కే ఆదిలోనే ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర వికెట్‌ కోల్పోయినా కెప్టెన్‌ రుతురాజ్‌ చక్కటి అర్ద సెంచరీతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే అతనికి మరో ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు. ఆఖర్లో జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) పోరాడినా ఫలితం లేదు. ఇన్నింగ్స్‌ మధ్యలో హసరంగ ప్రతి ఓవర్‌లో ఓ వికెట్‌ తీసి సీఎస్‌కేను దెబ్బకొట్టాడు. శివమ్‌ దూబే లాంటి భారీ హిట్టర్‌ కొన్ని ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండివుంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ దూబేను రియాన్‌ పరాగ్‌ అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.అంతకుముందు నితీశ్‌ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో రాయల్స్‌ 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్‌ ఇంకా భారీ స్కోర్‌ చేయాల్సింది. అయితే నితీశ్‌ను ఔట్‌ చేశాక సీఎస్‌కే బౌలర్లు నూర్‌ అహ్మద్‌ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-38-2) పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సీఎస్‌కే రన్‌రేట్‌ కూడా బాగా దెబ్బతినింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు మూడు మ్యాచ్‌ల్లో ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించిన ఎల్లో ఆర్మీ.. ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాయల్స్‌ చేతుల్లో పరాజయంపాలైంది.

YSRCP Ambati Rambabu Satirical Comments On CBN5
పవన్‌ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి

సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు చెప్పాలని డిమాండ్‌ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్‌. చంద్రబాబు పీ-4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్‌డ్‌ ఏప్రిల్‌ ఫూల్‌ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. సంపద ఏమైంది?. రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు. గత ప్రభుత్వ పథకాలను పాతరేశారు. కొత్త పథకాల ఊసేలేదు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారు. డబ్బులు ఉన్నోడికే మెడికల్‌ సీట్లు దోచిపెడుతున్నారు. నీతి, నిజాయితీకి మారు పేరు అంటే చంద్రబాబు ఎవరైనా నమ్ముతారా?. బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. పీ-4 అంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. పీ-4 పేరుతో కొత్త నాటకం..చంద్రబాబు నాయుడు పీ-4 పేరుతో కొత్త నాటకాన్ని ప్రారంభించాడు. పీ-4కు మార్గదర్శి బంగారు కుటుంబం అని కొత్త పేరు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు పీ-4 దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొత్తగా టోల్ గేట్లు పెడతానని చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామీణ ప్రాంత రోడ్డును చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేస్తున్నాడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటీకరణ చేశాడు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సంపద సృష్టిస్తానని చెప్పాడు. పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.పేదరిక నిర్మూలన కావాలంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకానీ కాంట్రాక్టర్లను, డబ్బులు ఉన్నవారిని, బడా బాబుల్ని పీ-4 పేరుతో వేదికపైన కూర్చోబెడితే పేదరికం పోదు. ఈ రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబుది, రెండోది పవన్ కళ్యాణ్‌ది. ఈ రెండు బంగారు కుటుంబాలే. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి అన్నాడు.. శ్రమదానం అన్నాడు అవన్నీ పోయాయి. ఇప్పుడు పీ-4 పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు.చంద్రబాబు నాయుడు నేనేం తప్పు చేయనని డప్పు కొట్టుకుంటున్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసేవన్నీ తప్పులే. ఎన్టీఆర్ దగ్గర పని చేశారని చంద్రబాబు చెప్తున్నాడు. ఆయన ఇందిరా గాంధీ దగ్గర పని చేశాడు.. ఎన్టీఆర్ పని పూర్తి చేశాడు. లోకేష్ లాంటి అసమర్ధుడిని ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉన్నవాళ్లు ఉన్నారు. ఎనిమిది లక్షల అరవై వేల మంది ట్యాక్స్‌ కట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్లని వాళ్లతో ఎలా అనుసంధానం చేస్తాడు?.పవన్‌ ప్యాకేజీ స్టారే..పవన్ కళ్యాణ్ నేను అసమర్థున్ని అని మనసులో మాట బయటపెట్టారు. పవన్ మాటలను జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆలోచించాలి. లోకేష్ డబ్బులు వసూలు చేసి పవన్‌కి ప్యాకేజీ ఇస్తున్నాడు. పేదల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను.. ఐటీ నేనే తెచ్చానని పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నాడు. డబ్బులు కోసం పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారు. పోలవరంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు వచ్చినా.. ఆయన మంత్రులను పంపించినా చర్చకు నేను సిద్ధం. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని ఎప్పటినుంచో అడుగుతున్నాను. కానీ, తెలుగుదేశం నాయకులు గానీ చంద్రబాబు గానీ.. ఎవరు సమాధానం చెప్పడం లేదు ఎందుకు?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు తెలిపి తక్కువ వల్లే పోలవరం ఆలస్యమైంది. పోలవరంపై చర్చకు ఎప్పుడైనా సిద్దమే. స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌సీపీదే. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ వేస్తారా? అని ప్రశ్నించారు.

Prithviraj Sukumaran Mother Mallika Comments On L2 Empuraan Issue6
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు.. లూసిఫర్‌పై 'పృథ్వీరాజ్' తల్లి

'ఎల్‌ 2: ఎంపురాన్‌' (L2 Empuraan) వివాదంపై మోహన్‌లాల్‌ (Mohanlal) ఇప్పటికే స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతూ ఆయన ఒక పోస్టు కూడా చేశారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక కూడా ఈ గొడవపై రియాక్ట్‌ అయ్యారు. లూసిఫర్‌ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.లూసిఫర్‌2 సినిమా విషయంలో తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు రావడాన్ని మల్లిక తప్పుబట్టారు. ఈ వివాదంపై మొదట తాను రియాక్ట్‌ కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఒక తల్లిగా తన కుమారుడి కోసం రియాక్ట్‌ కావాల్సి వస్తుందని ఆమె ఇలా అన్నారు. 'ఎల్‌ 2: ఎంపురాన్‌' తెర వెనుక జరుగుతున్న విషయాలన్ని నాకు తెలుసు. కానీ, నా కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కథనాలు క్రియేట్‌ చేస్తున్నారు. నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు. మోహన్‌లాల్‌, చిత్ర నిర్మాతలు ఎవరూ కూడా పృథ్వీరాజ్ మోసం చేసినట్లు చెప్పలేదు. మోహన్‌లాల్‌ నా సోదరుడితో సమానం. నా కుమారుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా ఆయనకు తెలియకుండానే కొందరు చేస్తున్నారు. చాలామంది కుట్రలు పన్ని నా కుమారుడిని బలిపశువును చేస్తున్నారు. నా కుమారుడు పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయడని బలంగా చెబుతున్నాను. ఈ మూవీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అందులో భాగమైన వారందరికీ బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే నిందలు వేయకూడదు. సినిమా కథను అందరూ చదివే కదా అందరూ ఆమోదించారు. సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు రచయిత కూడా ఎల్లప్పుడు పక్కనే ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆయనే మార్పులు చేసేవారు. సినిమా విడుదలయ్యాక కేవలం పృథ్వీరాజ్‌ను మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. మోహన్‌లాల్‌కు తెలియకుండా కొన్ని సీన్లు ఈ మూవీలో కలిపారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. సినిమా పూర్తి అయిన తర్వాత అందరూ చూసిన తర్వాతే విడుదల చేశారు. అందరి ఆమోదంతోనే మీ వద్దకు మూవీ వచ్చిందని గ్రహించండి. నా కుమారుడు ఎప్పటికీ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల జోలికి వెళ్లడు.' అని మల్లిక చెప్పుకొచ్చారు.2002 సమయంలో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలోని కొన్ని సీన్లు ఈ సినిమాలో చూపించారని కొందరు తప్పపట్టారు. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు అత్యంత కీరాతకంగా హత్య చేసి ఫైనల్‌గా అతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చూపించటం ఒక వర్గం వారికి నచ్చలేదు. దీంతో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి.

Donald Trump Says third Presidential Term IN USA7
రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్‌ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం ఓ న్యూస్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Waqf Bill Row: Muslims Protest On CM Chandrababu Double Game8
బాబు డబుల్‌ గేమ్‌.. సొంత ఇలాకాలో ఊహించని షాక్‌

చిత్తూరు, సాక్షి: ముస్లింల హక్కుల విషయంలో డబుల్‌ గేమ్‌ ఆడుతున్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. చంద్రబాబు నియోజకవర్గంలో, అదీ రంజాన్‌ పర్వదినాన ముస్లిం సోదరులు శాంతియుత నిరసనకు దిగారు. తమ సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్ల‌క్ష్యం చేస్తున్న చంద్రబాబు(Chandrababu).. ఇప్పుడేమో ర‌క్షించేవాడిలా నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పం(Kuppam)లో ఇవాళ నిరసన జరిగింది. నల్ల బ్యాడ్జిలు ధరించిన మరీ రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనంలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉంటూనే.. వక్ఫ్ సవరణ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇస్తుండడాన్ని వీళ్లంతా ఖండించారు. ఈ బిల్లు గనుక పార్ల‌మెంట్‌లో పాసైతే ముస్లిం స‌మాజం తీవ్రంగా న‌ష్ట‌పోతుంది అని ఆవేదన చెందుతున్నారు. ఇదీ చదవండి: వక్ఫ్‌ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందేముస్లిం స‌మాజం మొత్తం వ్య‌తిరేకిస్తున్న వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ‌ బిల్లు(Waqf Bill) విష‌యంలో రాష్ట్రంలో ఒక‌లా, ఢిల్లీలో మ‌రో ర‌కంగా చంద్రబాబు మాట్లాడుతుండడాన్ని రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ బిల్లు విష‌యంలో చంద్ర‌బాబు రెండు నాల్క‌ల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారని మండిపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. టీడీపీ మ‌ద్ధ‌తు మీద‌నే కేంద్రం ఆధార‌ప‌డి ఉందనేది విశ్లేషకుల మాట. అలాంటప్పుడు ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్య‌తిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వ‌ర‌కు వ‌చ్చి ఉండేది కాదన అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మరోప‌క్క బిల్లుకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన చంద్రబాబు.. తాజాగా జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వ‌క్ఫ్ ఆస్తుల‌ను ప‌రిర‌క్షిస్తున్నామ‌ని చెబుతుండడం మోసమేనన్నది కొందరి వాదన. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్‌ కుమార్‌లపై మజ్లిస్‌ అధినేత.. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారిని క్షమించబోమంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

Critical illness insurance for rare diseases9
అరుదైన వ్యాధులు వస్తే.. ఇదిగో ఈ ఇన్సూరెన్స్‌..

హీమోఫీలియా, మర్ఫాన్‌ సిండ్రోమ్‌ లాంటి అరుదైన వ్యాధులు కొద్ది మందికి మాత్రమే వస్తాయి. కానీ వాటి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది 7 వేల పైగా రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. ఇలాంటి వాటికి నాణ్యమైన చికిత్స దొరకడం కష్టంగానే ఉంటోంది.. అలాగే చికిత్స వ్యయాలు భారీగానే ఉంటున్నాయి.భారత్‌ విషయానికొస్తే 7 కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనాలున్నాయి. అవగాహనారాహిత్యం, వైద్యపరీక్షల వ్యయాలు భారీగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అంతగా లేకపోవడం వంటి అంశాల కారణంగా వారు సమయానికి సరైన చికిత్సను పొందలేకపోతున్నారు.ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) 4,001 అరుదైన వ్యాధులను గుర్తించింది. కానీ, 450 వ్యాధుల రికార్డులు మాత్రమే ఆస్పత్రుల్లో అధికారికంగా అందుబాటులో ఉంటున్నాయి. వైద్యపరీక్షలు, డేటా సేకరణపరమైన సవాళ్లను ఇది సూచిస్తోంది. 80 శాతం అరుదైన వ్యాధులు జన్యుపరమైనవే కాగా మిగతావి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్‌ లేదా పర్యావరణంపరమైన అంశాల వల్ల వస్తున్నాయి.50 శాతం పైగా అరుదైన వ్యాధుల లక్షణాలు ఎక్కువగా పిల్లల్లోనే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత ముందుగా వైద్యపరీక్షలు చేసి గుర్తించడం కీలకంగా ఉంటుంది. అరుదైన వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు, జీవిత కాల సంరక్షణ, కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మక చికిత్సలు కూడా అవసరమవుతాయి. అందుకే తగినంత బీమా కవరేజీ ఉండాలి. ఈ నేపథ్యంలో సాధారణ హెల్త్‌ ఇన్సూరెన్స్, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్ల మధ్య వ్యత్యాసాలు, వాటితో ఏయే ప్రయోజనాలు ఉంటాయో తెలియజేసేదే ఈ కథనం. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ అంటే.. సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ (సీఐ) స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స వ్యయాలకు మాత్రమే చెల్లించడం కాకుండా, వ్యాధి నిర్ధారణయినప్పుడు ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. దీన్ని చికిత్స వ్యయాల కోసం కావచ్చు, కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడం కోసం కావచ్చు, ఇతరత్రా ప్రత్యామ్నాయ చికిత్స కోసం కావచ్చు, పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.లూపస్‌ లేదా స్లెరోడెర్మాలాంటి అరుదైన ఆటోఇమ్యూన్‌ వ్యాధులకు సీఐ ప్లాన్‌తో ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. సాధారణంగా ముందస్తుగా నిర్ణయించిన వ్యాధుల కేటగిరీలకు మాత్రమే సీఐ ప్లాన్లు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ ఏదైనా అరుదైన వ్యాధికి కవరేజీ నుంచి మినహాయింపు ఉంటే, పాలసీదారుకు ఆర్థిక ప్రయోజనం దక్కదు. కవరేజీల్లో వ్యత్యాసం.. ఏది మెరుగైనది.. అరుదైన వ్యాధుల విషయంలో ప్రాథమిక ఆరోగ్య బీమా, హాస్పిటలైజేషన్, తక్షణ వైద్య వ్యయాలకు ఉపయోగపడుతుంది. డాక్టర్లను సంప్రదించడం, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేరడం, అవసరమైన ప్రొసీజర్లు మొదలైన వాటికి పాలసీ చెల్లిస్తుంది. అయితే, ఆదాయ నష్టం, దీర్ఘకాల సంరక్షణలాంటి పరోక్ష వ్యయాలకు కవరేజీనివ్వదు. మరోవైపు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ అనేది ఏకమొత్తంగా చెల్లిస్తుంది. దాన్ని పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.అయితే, సదరు వ్యాధి గురించి పాలసీలో ప్రస్తావిస్తేనే ఇది వీలవుతుంది. లేకపోతే కవరేజీ లభించదు. సాధారణంగా సీఐ పాలసీలు చాలా మటుకు అరుదైన వ్యాధులకు కవరేజీనివ్వవు. కాబట్టి ఆర్థిక భద్రత కోసం వాటిని మాత్రమే నమ్ముకోవడానికి ఉండదు. అరుదైన సమస్యలు ఉన్న వారు అధిక కవరేజీ ఉండే బేసిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీని కలిపి తీసుకుంటే ఆర్థికంగా భరోసాగా ఉంటుంది. అసాధారణ వ్యాధుల కోసం ఆర్థిక ప్రణాళిక.. అరుదైన వ్యాధులతో అధిక రిస్కులున్న వారు రెండు రకాల బీమాను తీసుకుంటే భరోసాగా ఉంటుంది. అధిక కవరేజీ ఉండే సాధారణ ఆరోగ్య బీమా పాలసీ, ఆస్పత్రి.. వైద్య వ్యయాలకు కవరేజీనిస్తుంది. ఇక క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ (ఒకవేళ తీసుకుంటే) వైద్యయేతర వ్యయాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. కవరేజీల్లో అంతరాలను తగ్గించుకునేందుకు టాప్‌ అప్‌ ప్లాన్లు, నిర్దిష్ట వ్యాధి సంబంధిత పాలసీల్లాంటివి పరిశీలించవచ్చు.రెగ్యులర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంటే.. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలనేవి హాస్పిటలైజేషన్‌ చార్జీలు, డాక్టర్ల కన్సల్టేషన్లు, వైద్య పరీక్ష ప్రొసీజర్లు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అలాగే ఆ తర్వాత తలెత్తే వ్యయాలకు కవరేజీనిస్తాయి. హంటింగ్టన్స్‌ డిసీజ్‌ లేదా రెట్‌ సిండ్రోమ్‌లాంటి నరాల సంబంధిత అరుదైన వ్యాధుల విషయంలో హాస్పిటలైజేషన్‌.. సపోర్టివ్‌ కేర్‌కి, జీవక్రియ సంబంధ గౌచర్‌ వ్యాధి లేదా ఫ్యాబ్రీ వ్యాధి, ఎంజైమ్‌ మార్పిడి థెరపీ కూడా కవరేజీ లభిస్తుంది. అయితే, సాధారణ పాలసీల్లో అన్ని రకాల అరుదైన వ్యాధులూ కవర్‌ కావు. కాబట్టి, జేబు నుంచి భారీగా పెట్టుకోవాల్సి వస్తుంది.అమితాబ్‌ జైన్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌

Meet Aishwarya Rai Bachchan Bodyguard Who Earns More Than Top MNC Executives10
ఐశ్వర్యరాయ్‌ బాడీగార్డ్‌ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి

సినీ తారల కీర్తి, సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. వృత్తిపరంగా వచ్చే ఆదాయంతో పాటు, ఎండార్స్‌మెంట్లు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా భారీ ఆదాయాన్నే సంపాదిస్తారు. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, క్రేజ్‌కి తోడు సహజంగానే అధిక భద్రత అవసరం ఉంటుంది. అందులోనూ సూపర్‌ స్టార్లకు మరింత రక్షణ అవసరం. వారి కుటుంబాలకు భద్రతాపరమైన ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ముఖ్యంగా స్టార్‌ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత భద్రతకోసం తమతోపాటు పాటు వచ్చే వ్యక్తిగత అంగరక్షకులపై భారీగా ఖర్చు పెడతారు. ఒక్కో సెలబ్రిటీ బాడీగార్డ్‌ (Bodyguard) సంపాదన కార్పొరేట్‌ కంపెఈ సీఈవోలకు మించి ఉంటుంది. మరి బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) బాడీగార్డ్‌ జీతం ఎంతో తెలుసా?బాలీవుడ్ ప్రపంచం గ్లామర్ , స్టార్‌డమ్‌తో నిండి ఉంటుంది. అందాల ఐశ్వర్యం ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె బయటికి అడుగుపెట్టినప్పుడల్లా నిరంతరం భారీ భద్రత అవసరం. సినిమాలు, రెడ్ కార్పెట్ ప్రదర్శనల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వరకు ఐశ్వర్య విశ్వసనీయ బాడీగార్డ్‌ శివరాజ్. ఆయన అందిస్తున్నసేవలకు నిదర్శనంగా గత కొన్నేళ్లుగా బచ్చన్ కుటుంబ భద్రతా బృందంలో కొనసాగుతున్నాడు. ఐశ్వర్యతో పాటు సినిమా సెట్‌లు, పబ్లిక్ ఈవెంట్‌లు , అంతర్జాతీయ పర్యటనలకు శివరాజ్‌ తోడు ఉండాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే శివరాజ్ కేవలం ఒక ప్రొఫెషనల్ గార్డు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి అంతకుమించిన ఆత్మీయుడు కూడా. 2015లో శివరాజ్ పెళ్లికి కూడా ఐశ్వర్య హాజరు కావడం విశేషం. ఐశ్వర్యతోపాటు ఆమె కుటుంబాన్ని రక్షించడంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అంతటి నమ్మకమైన అంగరక్షకుడు శివరాజ్‌ ఉంటే ఐశ్యర్య ఎక్కడ ఎలాంటి షోలకు, ప్రదర్శనకు వెళ్లినా నిశ్చింతగా ఉంటుందట. అంతటి నమ్మకస్తుడైన బాడీగార్డ్‌ శివరాజ్‌కు నెలకు దాదాపు 7 లక్షల రూపాయల వేతనం లభిస్తుందట. అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న పలువురు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల జీత ప్యాకేజీల కంటే ఈ మొత్తం ఎక్కువ. అంతేకాదు ఐశ్వర్య బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే వార్షిక ఆదాయం రూ. కోటి వరకు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.సెలబ్రిటీ బాడీగార్డ్‌గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా, ఆమె రక్షణ బాధ్యతను నిర్వర్తించడం కత్తిమీద సామే. ఈ రిస్క్‌లు , బాధ్యతల నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.1973, నవంబరు ఒకటిన పుట్టిన ఐశ్వర్య రాయ్ 1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. మోడల్‌గా, యాడ్‌ ఫిల్సింలో నటిస్తూ, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనేక హిట్‌ మూవీలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2007 ఏప్రిల్‌లో బాలివుడ్‌ హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడింది. వీరికి 2011, నవంబరులో కుమార్తె ఆరాధ్య పుట్టింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement