
విజయనగరం : పార్వతీపురం డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో సుమారు 300 మంది పాస్టర్లున్నా ఎటువంటి గుర్తింపు లేదు. పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గురగుబిల్లి, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, బలిజిపేట మండలాల్లో పాస్టర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, పాస్టర్స్‌కు పక్కా గృహాలు, మందిర నిర్మాణాలకు స్థలాలు కేటాయించాలని కోరుతూ వినతి అందించాం. ఆయన ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరుగుతుంది.
– బి. శ్రీనివాసరావు, డి. మోహన్‌రావు, యహోవా షమ్మా డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు