
జగన్‌ని కలిసిన సవర గుణద గ్రామ యువకులు
విజయనగరం :అన్నా మా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. కొమరాడ మండలంలో గుణిత తిలేసుపంచాయతీలో సవర గుణద, తిలేసు, ఎగువ గుణద, చిన్నిడి, దిగువ గుణద గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. తాగునీరు సౌకర్యం లేదు. గ్రామాల్లో ఉన్న బావి నీరే తాగుతున్నాం. ఎండాకాలం నీరు లేకపోవడంతో గెడ్డలో నీరు తెచ్చుకుని తాగాల్సి వస్తుంది. గ్రామంలో ఎక్కువ మంది తరచూ రోగాల బారిన పడుతున్నాం. ఇళ్లు కూడా మంజూరు చేయడంలేదన్నా. మీరు అధికారంలోకి రాగానే మా గ్రామాలకు రహదారి సౌకర్యం, తాగునీటి కుళాయిలు, ఇళ్లు మంజూరు చేయాలి.–బిడ్డిక సోమారావు,మండంగి రాజారావు, మండంగి వెంకటేష్, రామారావు