
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం నాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కురుపాంలోని రాత్రిబస వద్ద ప్రారంభమై జియ్యమ్మవలస మండలం శిఖబడిక్రాస్ వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. కురుపాం నుంచి జియ్యమ్మవలస మండలం దాసరిపేట, తాళ్ళడుమ్మ, చినమేరంగి, అల్లువాడ వరకూ సాగుతుందని చెప్పారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం పెదతుంబలి, చినతుంబలి, జోగులడుమ్మ మీదుగా శిఖబడి క్రాస్ వరకు చేరుకుని ముగుస్తుందన్నారు. అక్కడే రాత్రిబస చేస్తారని పేర్కొన్నారు.