
మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రకు సన్నద్ధం కావాలని ఆ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 25న వీరఘట్టం మండలంలోని కెల్ల గ్రామానికి పాదయాత్ర చేరుకోనుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజా సంకల్ప యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ రెండో వారంలో శ్రీకాకుళానికి యాత్ర చేరుకుంటుందని, ఆ సమయంలో ఘన స్వాగ తం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జగన్ రాక సందర్భంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేద్దామని కా ర్యకర్తలను ఉత్సాహపరిచారు. పాదయాత్ర చరిత్రగా నిలిచిపోవాలని సూచించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ఎన్నికల షె డ్యూల్ ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని ధర్మాన తెలిపారు. జగన్ పాదయాత్ర కూడా జనవరి 10న ఇచ్ఛాపురంలో ముగిం చే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం వెళ్లని గ్రామాలకు తర్వాత మరో యాత్ర ద్వారా జగన్ వెళ్తారని చెప్పారు. ప్రజా సంకల్ప పా దయాత్రలో కమిటీలు కీలక పాత్ర పోషిం చాలని సూచించారు. సోషల్ మీడియాను కూడా సమర్థంగా వాడాలని సూచిం చారు. టీడీపీ అవినీతిని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో యు వజన విభాగపు నాయకులు ధర్మాన రామ్‌మనోహర్ నాయుడు, పార్టీ నాయకులు ఎంవీ పద్మావతి, హనుమంతు కిరణ్, డీసీఎంఎస్ గొండు కృష్ణమూర్తి, అంబటి శ్రీనువాసరావు, చల్లా రవికుమార్, అంధవరపు సూరిబాబు, మార్పు ధర్మారావు, అల్లు లక్ష్మీనారాయణ, సాధు వైకుంఠం, పీఏసీఎస్ గొండు కృష్ణ, బరాటం రామశేషు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.