
జగన్‌మోహన్ రెడ్డిని కలసిన సీపీఎస్ ఉద్యోగులు
శ్రీకాకుళం ,వీరఘట్టం: ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, పదవీ విరమణ అనంతరం ఆర్థిక భరో సా లేక ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వీరఘట్టం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని విక్రం పురం సమీపంలో కలిసి వినతి పత్రం అందించారు. జిల్లాలో సుమారు 12 వేల మంది పైబడి ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ విధానంలో ఉన్నారని వీరి భవితకు ఈ విధానం వల్ల తీవ్ర ముప్పు వాటిల్లనుందని అన్నారు. వైఎస్సార్ సీపీతో ఈ విధానం రద్దు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.