
ప్రజాసంకల్పయాత్ర బృందం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని ఆ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పార్వతీపురం మండలం కోటవానివలస వద్ద ఆయన ఆది వారం మాట్లాడారు. రా ష్ట్రంలో వైఎ స్సార్ సీపీ బలోపేతం కావడంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుసుకున్న చంద్రబాబు ప్రతిపక్ష నేతను తుదముట్టించేందుకు తెగబడుతున్నారని ఆరోపించారు. జగన్‌పై హత్యాయత్నంపై సీబీఐ విచారణ కోరుతున్న నేపథ్యంలో సీబీఐను రాష్ట్రంలోకి రాకుండా జీవో విడుదల చేశారని దుయ్యబట్టారు. ఇంతకంటే అరాచక, అవి నీతి పాలన ఎక్కడా ఉండదన్నారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న విషయం సామాన్యులు చర్చించుకుంటున్నారని చెప్పారు. ఒకప్పుడు సీబీఐ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు వద్దు అంటున్నారని ఎందుకో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్య మంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చారిత్రాత్మకంగా జరుగుతోందన్నారు.
మూడు వేల కిలోమీటర్లు, 300 రోజులు విజయనగరం జిల్లాలో పూర్తి కావడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పా రు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయని తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో కూడా బహిరంగ సభకు ప్రజలకు బ్రహ్మరథం పట్టనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానం వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవటం ఖాయమన్నారు.