తిట్లీ తుపాను వచ్చి దాదాపు రెండు నెలలు గడిచినా ప్రభుత్వం ఇంత వరకు రైతులకు పరిహారం అందజేయలేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తుపాను వల్ల రాష్ట్రంలో రూ.3,435 కోట్లు నష్టం వాటిల్లితే బాధితులకు 15శాతం డబ్బులు కూడా ఇవ్వని చంద్రబాబు.. ప్రచారం మాత్రం తారాస్థాయిలో చేసుకున్నారని విమర్శించారు. అసలు బాధితులను వదిలిపెట్టి గ్రామాల్లో లేని వ్యక్తులకు చెక్కులు ఇస్తున్నారని ఆరోపించారు.