301వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan Prajasankalpayatra 301th Day Started | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 19 2018 8:58 AM | Last Updated on Mon, Nov 19 2018 9:43 AM

YS Jagan Prajasankalpayatra 301th Day Started - Sakshi

సాక్షి, కురుపాం(విజయనగరం): రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 301వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం కురుపాం నియోజకర్గంలోని తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి తోటపల్లి క్రాస్‌, నందివానివలస, గిజబ, దత్తివలస, గవరమ్మపేట, పెదమేరంగి జంక్షన్‌ మీదుగా సీమనాయుడు వలస వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది.  

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement