
విజయనగరం: చదువుకోవాలన్న ఆశ ఉన్నా ఓసీ కావడంతో ఆటంకంగా ఉందన్నా.. అంటూ జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన జి.శృతి ఆవేదన వ్యక్తం చేసింది. ఓసీ విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి ఉపకార వేతనాలు అందించకపోవడంతో ఉన్నత చదువుకు దూరమౌతున్నారన్నా అని తెలిపింది. ఓసీల్లోనూ చాలామంది పేదలున్నారు.. ఆడబిడ్డలను చదివించలేక, వివాహాలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.