
ప్రజా సంకల్పయాత్ర బృందం: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించటమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నియోజకవర్గంలోని పార్వతీపురం మండలం కోటవానివలస వద్ద ఆయన ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమని తెలుసుకున్న చంద్రబాబు ప్రతిపక్ష నేతను తుదముట్టించేందుకు తెగబడుతున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో జరిగిన రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాశీస్సులతో జగన్ యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రజల దీవెనలే జగన్‌కు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.