‘ఆయన పాలనెప్పుడు ముగుస్తుందా అని చూస్తున్నారు’ | YSRCP MP YV Subba Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 5 2018 4:43 PM | Last Updated on Wed, Dec 5 2018 4:44 PM

YSRCP MP YV Subba Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తణుకు/పశ్చిమగోదావరి : నాలుగు సంవత్సరాల టీడీపీ అరాచక పాలనలో ప్రజలందరూ విసిగి పోయారనీ, చంద్రబాబు పాలనెప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వడానికే తమ నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారని అన్నారు. గత 13 నెలలుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌కు తెలుగుదేశం పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలు చెప్తున్నారని అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని సుబ్బారెడ్డి అన్నారు.

తణుకులో జరిగిన కార్తీక వన సమారాధన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని మండిపడ్డారు. ‘ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే ప్రజలకు ఉపయోగపడాలి. కానీ, ఏపీలో పచ్చ చొక్కా లీడర్లు దోచుకోవడానికే పథకాలు తెస్తున్నారు’అని విమర్శలు గుప్పించారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement