
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం కురుపాంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం సీమనాయుడువలస రాత్రిబస వద్ద ప్రారంభమై కురుపాం వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. అక్కడే బహిరంగ సభ ఉంటుందన్నారు. సీమనాయుడువలస రాత్రిబస వద్ద ఉదయం పాదయాత్ర ప్రారంభమై భట్లభద్ర, జోగిరాజుపేట, పూతికవలస వరకూ సాగుతుందని చెప్పారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజనవిరామానంతరం కాటందొరవలస క్రాస్ మీదుగా కురుపాం వరకు చేరుకుని ముగుస్తుందన్నారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం రాత్రిబస చేస్తారని పేర్కొన్నారు.
జిల్లాలో చివరి సభ
జిల్లాలో సెప్టెంబర్ 24న ప్రవేశించిన జననేత ఇప్పటివరకూ ఎనిమిది నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. జిల్లా లో చివరిదైన కురుపాం సభలో మంగళవా రం ప్రసంగించనున్నారు. సమీప గ్రామాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.