
జననేతకు గోడు వినిపిస్తున్న వృద్ధురాలు అన్నమ్మ
విజయనగరం : నాకు మందూ,వెనుకా ఎవ్వరూ లేదు. వృద్ధాప్య పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా న్యాయం చేయలేదు. 80 సంవత్సరాల వయసున్న నేను ఏ పని చేసుకోగలను. జన్మభూమి కమిటీ సభ్యులు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. మీ నాన్న హయాంలో రెండొందల రూపాయల పింఛన్ అందేది. మళ్లీ నీవు ముఖ్యమంత్రి అయితే నాలాంటి అభాగ్యులకు న్యాయం జరగుతుంది.
– పల్లెరుక అన్నమ్మ, శిఖవరం