
జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు
విజయనగరం ,ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతుండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆ పార్టీలను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేపడుతున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాజమండ్రి రూరల్‌కు చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మం డలం తోటపల్లి రిజర్వాయర్ వద్ద రాజమం డ్రి రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కోలమూరు పంచాయతీ పరిధిలో గల కుంతమూరుకు చెందిన టీడీపీ మాజీ అధ్యక్షుడు కంటిపూడి బలరామకృష్ణచౌదరి, కుంపల్లు గోపాలకృష్ణ, తోర్రేడు గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చుట్టూరి రామకృష్ణచౌదరి, జన్మభూమి కమిటీ సభ్యులు మానేపల్లి సుగుణ, టి.జయశ్రీ, బి.వెంకటరత్నం తదితరులు పార్టీలో చేరారు.