మమ్ముట్టి
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని, ఎనలేని జనాదరణను సొంతం చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ వంటి పథకాలకు పాదయాత్రలో ఎలా అంకురార్పణ జరిగిందనే విశేషాలను చాలా అర్థవంతంగా మహి చూపించారని కూడా వీక్షకులు అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు మరోసారి ఆ మహానేతను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం కానుంది. ‘యాత్ర’ చిత్రం ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘స్టార్‌మా’ చానెల్‌లో ప్రదర్శితం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment