
సాక్షిప్రతినిధి, విజయనగరం : వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారంనాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ రాత్రిబస వద్ద ప్రారంభమై జియ్యమ్మవలస మం డలం సీమన్నాయుడువలస వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. తోటపల్లి రిజర్వాయర్ రాత్రిబస నుంచి తోటపల్లి క్రాస్, నందివానివలస, గిజబ, దత్తివలస వరకూ సాగుతుందని తెలిపారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం జియ్యమ్మవలస మండలం గవరంపేట, పెదమేరంగి జంక్షన్, సీమనాయుడువలస వరకు సాగుతుందని, అక్కడే రాత్రి బస చేస్తారని వివరించారు.