
విజయనగరం:జగనన్న ముఖ్యమంత్రి కావాలని రోజూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ చినమేరంగి గ్రామానికి చెందిన ముదిలి ప్రత్యూష చెప్పింది. ఆయన తప్పక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ రూ.పది విలువైన 20 నోట్లను దండగా చేసి జగన్ మెడలో హారంగా వేసింది. అన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి అక్క.. ప్రతి చెల్లికి మంచి చేస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.