
విజయనగరం:ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలి. పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా విద్యార్థులకు ఎం.సెట్, ఐఐటీ, ఒలింపియాడ్, నీట్, తదితర పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నాం. ఉదయం ఏడు గంటల నుంచి 9 వరకు ఎటువంటి సెలవులు లేకుండా శిక్షణ ఇస్తున్నాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గురుకుల విద్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులను ఆదుకోవాలి.– కె. శ్రీధర్, జి. మురళీమోహన్, ఎం. హరిబాబు, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు