సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ‘మానవత్వమే నా మతం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో చోటు చేసుకున్న పలు మానవీయ ఘటనలు, ఆ సందర్భంగా అప్పుడు వైఎస్ జగన్ చూపిన దృక్పథంతో పాటు, ఆయన చిన్నతనం నుంచి ప్రదర్శించిన మానవీయ కోణాలను ఆవిష్కరింప చేస్తూ గాంధీపథం పక్షపత్రిక ఒక ప్రత్యేక పుస్తకం ప్రచురించింది. ‘మానవత్వమే నా మతం’ అన్న పేరుతో ప్రచురించిన ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా గాంధీపథం పక్షపత్రిక ఆ పుస్తకం ప్రచురించింది. (ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..)
చిన్ననాటి నుంచే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, పాదయాత్రలో ఒక వృద్ధురాలి చెప్పు తెగిపోతే సరిచేసి ఇవ్వడం ,ముఖ్యమంత్రిగా ఒక పోలీసు అధికారికి పతకం ప్రదానం చేస్తుండగా, అది జారిపోతే స్వయంగా ఒంగి తీసి ప్రదానం చేయడం, విశాఖ పర్యటనలో కొందరు విద్యార్థులు తమ సహచరుడి అనారోగ్యం గురించి ప్లకార్డులు ప్రదర్శిస్తే వెంటనే ఆగి, వారి సమస్య తెలుసుకుని ఆ విద్యార్థి వైద్య సహాయం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయడం.. వంటి పలు మానవీయకోణ విశేషాలను ‘మానవత్వమే నా మతం’ పుస్తకంలో పొందుపర్చినట్లు గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ తెలిపారు. (జీవితకాల మధుర‘యాత్ర’)
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, ముఖ్యమంత్రి సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు)ఆర్ ధనంజయ్ రెడ్డి, గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ పద్మజ పాల్గొన్నారు. (ఏపీ వ్యాప్తంగా ‘ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు’)
Comments
Please login to add a commentAdd a comment