‘ఇసుక, మట్టి, బొగ్గు, కరెంట్ కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ భూముల్లో అవినీతి అక్రమాలు, కరువు, తుపాను, ఇసుక దోపిడీ, నిరుద్యోగం.. గత నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చింది ఇదే.. ఈ రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 330వ రోజు సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.