patapatnam
-
పాతపట్నంలో కొత్త రచ్చ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం తెలుగుదేశం పార్టీలో మరోసారి రచ్చ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి ఎంపిక సర్వే కలకలం రేపుతోంది. ఐవీఆర్ఓఎస్, ఎస్ఎంఎస్ పేరుతో జరుగుతున్న అభిప్రాయ సేకరణలో ఏది వాస్తవమో, ఏది నకిలీయో తెలియదు గాని రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. టిక్కెట్ ఆశిస్తున్న కలమట వెంకట రమణ, మామిడి గోవిందరావు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీరి మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాహాబాహీకి దిగుతున్నాయి. ఇద్దరికన్నా నోటాకే ఎక్కువ అభిప్రాయాలు అధిష్టానం చేస్తుందో, ప్రైవేటు ఏజెన్సీలు చేస్తున్నాయో తెలియదు గానీ అభిప్రాయ సేకరణ పేరుతో నియోజకవర్గంలో రచ్చ నడుస్తోంది. ఒకసారి వెంకటరమణ, గోవిందరావు, కలమట సాగర్ పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా.. మామిడికి ఎక్కువ సానుకూలత ఉన్నట్టు వారిలో వారే ప్రచారం చేసుకున్నారు. మరోసారి వెంకటరమణ, గోవిందరావు నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా ఇద్దరి కన్న నోటాకే ఎక్కువ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంకోసారి జరిగిన అభిప్రాయ సేకరణలో మామిడి కన్న కలమటకు ఎక్కువ మద్దతు వచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. తాజాగా గోవిందరావు ప్రస్తావన లేకుండా వెంకటరమణ, జనసేన నాయకుడు గేదెల చైతన్య, నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరిగిందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ మరోవైపు గోవిందరావు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై గోవిందరావు తనపై ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాతపట్నం పోలీసు స్టేషన్లో కేసు పెడతానని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. తమకు అనుకూలంగా వస్తే అసలైన సర్వే అని, వ్యతిరేకంగా వస్తే ఫేక్ సర్వే అని రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నాయి. కుమ్ములాటలు కొత్తకాదు.. పాతపట్నం టీడీపీలో కుమ్ములాటలు కొత్త కాదు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లిపోయింది. తరచూ పార్టీలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, వంశధార నిర్వాసితుల పరిహారాన్ని మింగేయడమేన కాకుండా ప్యాకేజీ కోసం ఎమ్మెల్యేగా ఉండి పార్టీ ఫిరాయించారని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణపై గోవిందరావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. దానికి ధీటుగా గోవిందరావుపై వెంకటరమణ వర్గం అంతే విమర్శలతో తిప్పికొడుతున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో భూదందాలు చేశారని, ఆ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని, పార్టీ పెద్దలంతా తన వెనకే ఉన్నారంటూ గోవిందరావుపై విమర్శలు చేస్తున్నారు. -
నేడు పాతపట్నంలో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. -
ఉద్దానం ఫేజ్–2కు రెడీ
సాక్షి, అమరావతి: దశాబ్దాల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా సురక్షిత తాగునీరు అందించనుంది. ఇందుకోసం రూ.265 కోట్లతో ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. తద్వారా పాతపట్నం, మెలియపుట్టి, హిరమండలం, కొత్తూరు, లక్ష్మీనరసపేట మండలాల పరిధిలోని 448 నివాసిత ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు మూడున్నర లక్షల మందికి తాగునీటి ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిపోతాయి. ఉద్దానం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో కొన్ని ప్రమాదకర లోహాలు కారణంగానే ఆ నీటిని తాగే అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ సమస్య పరిష్కారానికి గత చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలు చెబుతూ కాలక్షేపం చేస్తే.. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడునెలలకే రూ.700 కోట్లతో పలాస, ఇచ్ఛాపురం రెండు మున్సిపాలిటీలతో పాటు ఆ ప్రాంతంలోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే ఉద్దానం ఫేజ్–1 రక్షిత మంచినీటి పథకానికి 2019 సెప్టెంబరు 6న ప్రభుత్వం మంజూరు చేసింది. 2020 ఆరంభంలోనే పనులను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ పనులు 90 శాతానికి పైగా పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనికి అనుసంధానంగా ఇప్పుడు ఆ ప్రాంతంలోని మరో ఐదు మండలాల ప్రజలకు కూడా తాగునీరు అందించే పథకానికి ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఆ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం ఫేజ్–2 పనుల టెండరు డాక్యుమెంట్ ప్రస్తుతం జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలనలో ఉంది. మే 4 వరకు అభ్యంతరాల స్వీకరణ అనంతరం జ్యుడీషియల్ ప్రివ్యూ తుది ఆమోదం అనంతరమే టెండర్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆర్డబ్యూఎస్ అధికారులు ‘సాక్షి’కి వివరించారు. ‘హిరమండలం’ నుంచి నీటి తరలింపు.. ఉద్దానం మొదటి దశ, రెండో దశ మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఉద్దానానికి అతి సమీపంలో ఉండే బహుదా, మహేంద్రతనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతుండడంవల్ల అక్కడ ప్రజలు తిరిగి బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి ఉంటుందేమోనని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో కొంత అదనపు ఖర్చయినా ఏడాది పొడవునా నీరు అందించే అంశంపై దృష్టిపెట్టింది. దీంతో ఉద్దానానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేసి, అక్కడి ప్రజలకు ఏడాది పొడువునా తాగునీరు అందించాలని సంకల్పించింది. ఇప్పుడు రెండో దశ ప్రాజెక్టులో కొన్ని ప్రాంతాలకు కూడా నేరుగా రిజర్వాయర్ నుంచే తాగునీటి సరఫరాకు ఏర్పాట్లుచేశారు. హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని, అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ఫేజ్–1 ద్వారా ఆ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం రెండో దశ ప్రాజెక్టుకు 0.291 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నారు. వచ్చే 30ఏళ్లలో పెరిగే జనాభాకు తగ్గట్లుగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. -
అయ్యో పాపం.. పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి
పాతపట్నం/సారవకోట: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్ష రాస్తూ బూరాడ కార్తీక్ (16) అనే విద్యార్థి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం ధర్మలక్ష్మిపురం పంచాయతీ దాసుపురం గ్రామానికి చెందిన కార్తీక్ పాతపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం వసతి గృహంలో అస్వస్థతకు గురై వాంతులు రావడంతో తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్ వార్డెన్ బి.వైకుంఠరావు పాతపట్నం సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. చికిత్స అందించాక విశ్రాంతి తీసుకోవాలని సూపరింటెండెంట్ బాలకృష్ణ విద్యార్థికి సూచించారు. అయితే పరీక్షకు సమయమవుతోందని చెప్పిన కార్తీక్ ఆస్పత్రి నుంచి నేరుగా పాతపట్నం బస్టాండ్ వద్ద ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత స్పృహ తప్పడంతో ఇన్విజిలేటర్లు, సిబ్బంది కలిసి పాతపట్నం సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు సూపరింటెండెంట్ బాలకృష్ణ తెలిపారు. మెదడుకు సంబంధించిన సమస్యతో కార్తీక్ మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. తల్లిదండ్రులు బూరాడ శ్యామ్‌సుందరావు, కుమారి, తమ్ముడు దినేష్‌లు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్ఐ మహమ్మద్ అమీర్ ఆలీ ఆస్పత్రికి చేరుకుని వైద్యుడు బాలకృష్ణతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామం దాసుపురం పంపించారు. స్పృహ తప్పిన మరో విద్యార్థిని పాతపట్నం కోర్టు కూడలిలో ఉన్న ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష రాస్తున్న తూలుగు ధనలక్ష్మి అనే విద్యార్థి స్పృహ తప్పిపోయింది. వెంటనే ప్రిన్సిపాల్ ఎం.ఆంజనేయులు విద్యార్థినిని సీహెచ్‌సీకి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. కడుపు నొప్పి వస్తోందని వైద్యులకు చెప్పడంతో సూపరింటెండెంట్ కె.బాలకృష్ణ చికిత్స అందించారు. చికిత్స అందించిన అనంతరం విద్యార్థిని స్వగ్రామం హిరమండలంలోని ధనుపురం పంపించినట్లు వైద్యుడు తెలిపారు. -
అష్ట దిగ్భందంలో పాతపట్నం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో పాతపట్నంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు అవుతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం హుటాహుటీన శ్రీకాకుళం బయల్దేరారు. జిల్లాలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో మంత్రి ఆళ్ల నాని ఆదివారం ఉదయం పది గంటలకు జిల్లా అధికారులు సమీక్ష జరుపుతారు. కాగా కరోనా అనుమానిత లక్షణాలున్న పాతపట్నం యువకుడికి జరిపిన పరీక్షల్లో నెగటివ్ వచ్చినా, అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ... కాంటాక్ట్ వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు. (ఏపీలో కొత్తగా 61 పాజిటివ్ కేసులు) ప్రయాణ చరిత్రతోనే అప్రమత్తం అనుమానితులుగా ఉన్న వారిలో తొలి వ్యక్తి ఢిల్లీ రైల్వేలో పనిచేస్తున్నారు. మార్చి 19న స్వస్థలానికి వచ్చారు. ఆయన ఆయన ప్రయాణించిన రైళ్లలో మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన వారు ఉన్నట్టు అనుమానం. అందుకనే అధికారులు అప్రమత్తమై హోం క్వారంటైన్లో పెట్టారు. 28 రోజులు దాటాక ఆ వ్యక్తి బయటికి రావడం మొదలు పెట్టారు. దీన్ని గమనించిన అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తగా పాతపట్నం సీహెచ్‌సీలో శాంపిల్స్ తీశారు. ట్రూనాట్ పరీక్షలు నిర్వహించగా ‘డిటెక్టెడ్ వెరీ లో’ అని వచ్చింది. పూర్తి స్థాయి నిర్ధారణ కోసం జెమ్స్‌లో స్వాబ్ తీసి కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వైరాలజీ ల్యాబ్‌కు గురువారం పంపించారు. (కరోనా : ప్రాణం తీసిన అభిమానం ) ఈ పరీక్షల్లో నెగటివ్ రావడంతో కొంత టెన్షన్ తొలగినా ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన మరో ముగ్గురికి కూడా ట్రూనాట్ కిట్ పరీక్షల్లో తనకు మాదిరిగానే ‘డిటెక్టెడ్ వెరీ లో’ అని వచ్చింది. దీంతో పూర్తి స్థాయి నిర్ధారణ కోసం వారి నుంచి స్వాబ్ తీసి కాకినాడ రంగరాయ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. శనివారం ఉదయానికి ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. మరోవైపు అనుమానితుల గ్రామాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. 27 గ్రామాలపై ఆంక్షలు అనుమానిత వ్యక్తులు సంచరించిన సీది, కాగువాడ గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న 27 గ్రామాలను అధికారులు దిగ్బంధం చేశారు. పాతపట్నం మండలంలోని సీది, తామర, తీమర, పాచిగంగుపేట, శోభ, రొంపివలస, రొంపివలస ఎస్సీ కాలనీ, పెద్ద సున్నాపురం, రొమదల, మాకివలస, కొరసవాడ, కాగువాడ, బూరగాం, పాతపట్నం, ప్రహరాజపాలెం, సీతారాంపల్లి, కోదూరు, బోరుభద్ర, శివరాంపురం, ఆర్‌ఎల్‌పురం, హిరమండలంలోని కల్లాట, కల్లాట కాలనీ, జిల్లేడుపేట, తంప, దనుపురం, సారవకోట మండలం నౌతల, కొత్తూరు మండలం జగన్నాథపురం గ్రామాల ను దిగ్బంధం చేశారు. కాగువాడ, సీది గ్రా మాల సరిహద్దులను పోలీసులు మూసివేశారు. ఈ రెండు గ్రామాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. పాతపట్నం నీలమణిదుర్గ కూడలి నుంచి సీదీ కూడలి, కమలమ్మకొట్టు కూడలి వరకు జాతీయ రహదారిని నిర్బంధించారు. నిత్యావసర సరుకులను అధికారులే డోర్ డెలివరీ చేస్తారు. పశువులకు దాణా సరఫరా చేస్తారు. మిగతా ముగ్గురి ఫలితాలు సానుకూలంగా వచ్చినట్టయితే ఆంక్షలు ఎత్తివేస్తారు. అనుమానిత వ్యక్తులతో కలిసి తిరిగిన సీది గ్రామానికి గ్రామానికి చెందిన 11 మంది, కాగువాడకు చెందిన ఏడుగురు, మాకివలస గ్రామానికి చెందిన నలుగురిని ముందస్తు జాగ్రత్తగా ఎచ్చెర్ల క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. -
శభాష్ రమ్య!
సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం) : సిక్కోలు విద్యార్థినికి అరుదైన గుర్తింపు లభించింది. వ్యవసాయరంగంలో చేసిన పరిశోధనకు గాను జవహర్లాల్ నెహ్రూ అవార్డు–2018 దక్కించుకుంది. పాతపట్నం మండలం బోరుబద్ర గ్రామానికి చెందిన అంధవరపు రాధిక రమ్య క్రాప్సైన్సు ఆధ్వర్యంలో ఐ కార్ ఫౌండేషన్ డే సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 16న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఐ కార్ డైరెక్టర్ జనరల్ మహాపాత్రో చేతుల మీదుగా గోల్డ్‌మెడల్, అవార్డు, రూ.50 వేల నగదు అందుకుంది. ఇంటర్నేషనల్ ఇక్రిశాట్(హైదరాబాద్)లో జెనిటిక్స్ అండ్ ఫ్లాంట్ బ్లీడింగ్ అనే అంశంపై(కొత్త రకాల వంగడాలు) పరిశోధన చేసినందుకు గాను ఈ అవార్డు వచ్చిందని రమ్య తెలిపారు. దేశం మొత్తమ్మీద ఈ అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రమ్య ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఈమె 1 నుంచి 5వ తరగతి వరకు బోరుబద్ర మండల పరిషత్ పాఠశాల, 6 నుంచి 10వ తరగతి వరకు పాతపట్నం విక్టరీ పాఠశాల, ఇంటర్మీడియెట్ విజవాడ శ్రీ చైతన్య కళాశాల, బీఎస్సీ అగ్రికల్చర్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ నైరా(ఆమదాలవలస), ఎంఎస్సీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యునివర్సిటీ, రాజేంద్రనగర్(హైదరాబాద్), పీహెచ్డీ బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదివారు. పీహెచ్‌డీలో జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్లీడింగ్( కొత్త రకాల వంగడాలు) అనే అంశంపై లాల్ అహమ్మద్ గైడ్ ఆధ్వర్యంలో పరిశోధనలు పూర్తిచేశారు. తండ్రి అంధవరపు రాజారావు రిటైర్డు ఉపాధ్యాయుడు. తల్లి వన జాక్షి పాతపట్నం మండలం బొమ్మిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. రమ్య భర్త కరిమి పృథ్వీకృష్ణ విజయనగరం గోషా ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యునిగా పనిచేస్తున్నారు. తండ్రి, భర్త ప్రోత్సాహం వల్లే వ్యవసాయంపై పరిశోధన చేశానని, శ్రమకు తగిన గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నానని రమ్య తెలిపారు. -
ఎండలు తాళలేక ఏనుగుల గుంపు..
సాక్షి, శ్రీకాకుళం: పాతపట్నం మండలంలోని కమలమ్మ కొట్టు సెంటర్ బ్రిడ్జి ఆవరణలో ఏనుగులు గుంపు సంచరిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నరసన్నపేట-పర్లాఖిమిడిల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అడవిలో నీటి కొరత, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏనుగులు మహేంద్రతనయ నది పరిసరాల్లో తిష్టవేసాయి. ఎండ ఉన్నంతసేపు నది నీటిలో జలకాలాడుతూ, ఆకలి అయినప్పుడు రోడ్డుపైకి చేరుకుంటున్నాయి. ఏనుగులు చర్యలను బట్టి ట్రాకర్స్, ఫారెస్ట్ గార్డులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఏనుగులు నదిలో విహారిస్తుండటం.. చుట్టుపక్కల సంచరిస్తుండటంతో వాటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఏనుగుల సంచారాన్ని ఉత్సాహంగా తిలకిస్తూ.. తమ ఫోన్లల్ వీడియోలు తీస్తున్నారు. అయితే, ఏనుగులను కవ్విస్తే ప్రమాదమని, వాటి సమీపంగా వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. -
టీడీపీలో తేలని పంచాయితీ
సాక్షి, పాలకొండ: నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విషయంలో ఇప్పటికీ పంచాయితీ తేలలేదు. నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కుమార్తె స్వాతిల మధ్య టికెట్ కోసం వర్గపోరు కొనసాగుతోంది. జయకృష్ణకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు మద్దతు అందిస్తుండగా, స్వాతికి ఇటీవలే పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్ వెన్నుదన్నుగా నిలిచారు. తల పట్టుకున్న పార్టీ అధిష్టానం టికెట్ కేటాయింపులో ఇప్పటికీ ఫోన్ సర్వేలపైనే ఆధారపడుతోంది. జయకృష్ణకు టికెట్ ఇస్తే తాము పార్టీకి పనిచేయమని పాలకొండ, వీరఘట్టం మండలాలకు చెందిన మండల స్థాయి నాయకులు చంద్రబాబు సమక్షంలోనే తేల్చారు. దీనికి తోడు చంద్రబాబుకు పలుమార్లు జయకృష్ణ తీరుపై ఫిర్యాదులు అందాయి. ఈ విషయాలను పరిగణనలోనికి తీసుకుని టికెట్ కేటాయించే పరిస్థితి లేదని జయకృష్ణ వ్యతిరేక వర్గం గట్టిగా చెబుతున్నారు. ఇక స్వాతి విషయంలో పార్టీలో చేరిన వారం రోజుల్లోనే టికెట్ ఎలా ఇస్తారని జయకృష్ణ వర్గం వాదిస్తోంది. దీంతో ఈ వ్యవహారం ముదిరింది. ప్రస్తుతం పాలకొండ టికెట్ విషయంలో కిషోర్‌చంద్ర దేవ్, కళా వెంకటరావుల మధ్య ఆధిపత్య పోరుకు తెరతీసింది. పార్టీ కార్యకర్తల్లో ఈ ఇద్దరి నేతల మధ్య ఎవరు పైచేయి సాధిస్తారని చర్చించుకుంటున్నారు... పాతపట్నం... పాతపట్నంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కలమటకు ఈసారి వింత పరిస్థితి నెలకొంది. అవినీతి ఆరోపణలతో ఈసారి టికెట్ కష్టంగా మారింది. అయితే దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామోహన్నాయుడు పట్టుతో టికెట్ రేసులో నిలిచారు. అధికారికంగా టికెట్ ప్రకటించక పోయినా వస్తుందన్న ప్రచారం జరిగింది. దీంతో పాతపట్నం నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలమటకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ పరిణామాలతో కంగుతిన్న చంద్రబాబు వెంటనే పాతపట్నం నాయకులను అమరావతి రావాలని కబురు పంపారు. మండల స్థాయి నాయకులకు నచ్చచెప్పే పనిని కింజరాపు కుటుంబం నెత్తిన పెట్టుకుంది. ఈ పరిణామాల మధ్య ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. -
చంద్రబాబు హయాంలో అన్నీ గోవిందా..
-
అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి శత్రుచర్ల
హైదరాబాద్: గెలుపే లక్ష్యంగా టీడీపీ బెరితెగిస్తోంది. ఓటుకు నోటు సూత్రాన్ని ఆ పార్టీ పక్కా ఫాలో అవుతోంది. టిడిపి నేత, తాజా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అడ్డంగా దొరికిపోయారు. విజయరామరాజు శ్రీకాకుళం జిల్లాలో స్వయంగా డబ్బు పంపకాలకు దిగారు. పాతపట్నం, ఎల్లంపేట మండలాల్లో ఒక్కొ గ్రామానికి 15 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయల చొప్పున 40 కుటుంబాలకు డబ్బు పంపించానని విజయరామరాజు స్వయంగా చెబుతూ దొరికిపోయారు. అంతేకాదు, డబ్బును అందజేయడంలో అనుచరులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పాతపట్నం శాసనసభ స్థానానికి టిడిపి తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శత్రుచర్ల ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు చూపే వీడియోని కూడా చూడవచ్చు. శత్రుచర్ల నిర్వాకంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయనేతలు చేయాల్సినది ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అల్లిమడుగు గ్రామంలో టీడీపీ వాళ్లు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. గ్రామంలోని ఎస్టీల దగ్గరికి వెళ్లి మీరు కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని, వాళ్ల దగ్గర ఓ బాండు, మరో వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకుంటున్నారు. సుమారు 50 మంది దగ్గర ఇలా సంతకాలు తీసుకున్నట్లు సమాచారం అందింది. మీడియా వాళ్లు అక్కడి రావడంతో టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి జారుకున్నారు. స్థానిక టీడీపీ అభ్యర్థే ఇలా సంతకాలు సేకరించారని తెలిసింది. దీనిపై ఆయన్ను సంప్రదించగా, ఎస్టీలు కాబట్టి మీరు కరెంటు బిల్లులు కట్టక్కర్లేదని, అసలు మీటర్లు లేని వాళ్లు తీసుకోవాలని చెప్పినట్లు బుకాయించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నేతల్లో ఓటమి భయం పెరిగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుకి ఆఖరి అస్త్రంగా మద్యం, డబ్బులు ఎరవేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తలారి ఆదిత్య ప్రచారంలో మద్యం ఏరులై పారుతోంది. ప్రచారానికి వచ్చిన వారికి ఫుల్లుగా మద్యం , డబ్బులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎన్.సి.వి.నాయుడు మద్యం పంపిణీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో తెలుగు తమ్ముళ్ళు మందుబాబులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి, బిజెపి కార్యకర్తలు యథేచ్ఛగా మద్యపానం చేశారు. వైన్ షాపును చుట్టుముట్టిన కార్యకర్తలు ఎగబడి మరీ మద్యం తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్లపైనే సేవించారు. ఇంకొందరైతే ఓ మేడపైకి ఎక్కి చక్కగా పార్టీ చేసుకున్నారు. బాబు ప్రచారానికి రాక ముందే మందులో తూగిన తెలుగు తమ్ముళ్ళకు కొందరు కమలం సోదరులు కూడా తోడయ్యారు. అంతా కలిసి విచ్చలవిడిగా మద్యం సేవించారు. ఆలస్యంగా ఆచంట వచ్చిన బాబు అక్కడి పరిస్థితి చూసి ఏమీ ప్రసంగించకుండానే జై తెలుగుదేశం అంటూ ముందుకు సాగారు. క్రమశిక్షణకు మారుపేరుగా తమకు తాము చెప్పుకునే తెలుగుదేశం కార్యకర్తలు ఇలా తమ నిజ స్వరూపం చూపడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
టీచర్లకు బడితెపూజ చేసిన విద్యార్థినులు
టీచర్లకు బడితెపూజ చేసిన విద్యార్థినులు శ్రీకాకుళం : దారి తప్పిన గురువులకు విద్యార్థినులు బడితెపూజ చేశారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పట్టలేని ఆవేశంతో ఊగిపోయారు. అంతే చేతికందిన వాటితో ఉపాధ్యాయులను చితక్కొట్టి వదిలారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. గత కొంతకాలంగా డ్రాయింగ్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ తమను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వారి ఆగడాలు ఎక్కువ కావటంతో, ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోడంతో తామే రంగంలోకి దిగి ఇద్దరినీ చిత్తుగా కొట్టారు. విద్యార్థినులకు తోడు వారి కుటుంబ సభ్యులు కూడా ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కీచక టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. -
పాతపట్నంలో మరో ప్రజా ప్రస్థానం 1st August 2013
-
పాతపట్నంలో మరో ప్రజా ప్రస్థానం 31st july 2013