సీఆర్‌టీలను రెగ్యులరైజ్‌ చేయండన్నా... | Regularize For CRTs | Sakshi
Sakshi News home page

సీఆర్‌టీలను రెగ్యులరైజ్‌ చేయండన్నా...

Published Mon, Nov 19 2018 6:58 AM | Last Updated on Mon, Nov 19 2018 6:58 AM

Regularize For CRTs - Sakshi

విజయనగరం: అన్నా 15 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లుగా పని చేస్తున్నాం.  మమ్మల్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయలేదు. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా... బాబు వస్తే ఇంటికో జాబు అని చెబుతూ ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయిందన్నా ఈ టీడీపీ ప్రభుత్వం. మా పార్వతీపురం డివిజన్‌లో 361మంది సీఆర్‌టీలం ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి రాగానే సీఆర్‌టీలను రెగ్యులైజ్‌ చేసి, వేతనాలు సవరణ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నా... అని సీఆర్‌టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ. భాస్కరరావు, దొర, సంధ్యారాణి తదితరులు ప్రజాసంకల్పయాత్రలో జగన్‌మోహనరెడ్డిని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.– ఇ.భాస్కరరావు, సీఆర్‌టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,దొర, సంధ్యారాణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement