ummareddy venkateswarulu
-
'ప్రజలతో మమేకం కావడం వైఎస్ కుటుంబానికే సాధ్యం'
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పూర్తయి మూడేళ్లయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్‌రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. దేశంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత వైఎస్ జగన్‌ది అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అన్ని వర్గాల ప్రజల కష్ట, నష్టాలు తెలుసుకున్న నాయకుడు జగన్. అందుకే సీఎం అయిన తర్వాత ప్రజామోదయోగ్యమైన పాలన చేస్తున్నారు. అందుకే పాదయాత్ర ముగిసి మూడేళ్లయినా జనం మర్చిపోలేదు' అని అన్నారు. చదవండి: ('ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది') మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా కోట్లమందిని జగన్ కలిశారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేసిన పాదయాత్ర ఒట్టి బూటకం. ప్రజలతో మమేకం కావడమనేది వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఆరోగ్యశ్రీ నుంచి పెన్షన్ల పెంపు వరకు ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల వారికీ పథకాలు అందిస్తున్న మనసున్న నేత సీఎం జగన్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన ఘనత జగన్‌ది అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎండ, వాన, చలి ఏదీ లెక్కచేయకుండా జనం సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. జనం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
కొత్త జాతీయ విద్యావిధానంతో సరికొత్త సమస్యలు
‘ఒకే దేశం ఒకే విద్య’ అనే ప్రాతిపదికన ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ‘కొత్త జాతీయ విద్యావిధానం 2020’ దేశవ్యాప్త చర్చకు దారితీయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం చట్టంగా రూపొందించనున్న ‘నూతన విద్యావిధానం’లో మేలు చేసే పలు సంస్కరణలకు చోటు కల్పించినప్పటికీ, వారసత్వంగా పీడిస్తున్న కీలక సమస్యలను పరిష్కరించే ప్రతిపాదనలు ఏవీ అందులో కనబడలేదు. రెండు దశల్లో 8వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలోనే విద్యార్థులకు విద్యను అందించాలని ప్రతిపాదించడం ఏ మేరకు ఆచరణాత్మకం అనే సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. విద్యనందించే బాధ్యత నుండి గత ప్రభుత్వాలు తప్పుకొన్న కారణంగా విద్య క్రమేపీ ప్రైవేటు రంగంలోకి జారిపోయింది. పోనీ, ఆ ప్రైవేటు రంగంలోనైనా సవ్యమైన విద్యనందిస్తున్నారా అంటే అందుకు స్పష్టమైన సమాధానం లభించదు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొన్ని విద్యా సంస్థలు కేవలం మార్కులు సాధించడమే విద్యార్థుల జీవిత లక్ష్యమన్నట్లుగా చీకటి కొట్టాల్లాంటి గదుల్లో ఉంచి విద్యార్థులపై ఒత్తిడి పెంచే విధానం మొదలై దాదాపు 3 దశాబ్దాలు దాటింది. కొత్తదనం ఏదీ? కొత్త విద్యావిధానంలో పాత సమస్యలను పరిష్కరించే విప్లవాత్మక మార్పులు ఉంటాయని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. ప్రస్తుతం ఉన్న 10+2+3 విధానాన్ని మార్పుచేసి 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టడం కొత్తదనంగా చూపుతున్నారు. ఈ మార్పు వల్ల ఇంటర్ కూడా పాఠశాల విద్య కిందికి వస్తుంది. పిల్లలకు 3 ఏళ్ల నుంచే కిండర్ గార్డెన్ (పూర్వ ప్రాథమిక విద్య) విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలనుకోవడం ఆహ్వానించదగినదే. అయితే, ఈ విద్యను బోధించే బాధ్యతను అంగన్వాడీలలో పనిచేసే ఆయాలకు అప్పగించి.. వారికి డిజిటల్, డిస్టెన్స్, డీటీహెచ్ పద్ధతులలో 6 నెలలపాటు శిక్షణ అందించాలనుకోవడం ఎంతవరకు ఆచరణాత్మకం? అంగన్వాడీ ఆయాలకు తగిన బోధనా అర్హతలు ఉండాలి కదా. ఇక, 6వ తరగతి నుంచే ఒకేషనల్ విద్యను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంలో ఎటువంటి సహేతుకత కన్పించదు. 9–10 సంవత్సరాల వయస్సు విద్యార్థులకు వృత్తి విద్యకు సంబంధించిన అంశాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస అంతగా ఉండదు. ఆసక్తిలేని అంశాలను వారిపై బలవంతంగా రుద్దితే అసలుకే మోసం వస్తుంది. 15 సంవత్సరాలు నిండిన తర్వాత పాలిటెక్నిక్, ఐటీఐ వంటి వృత్తి విద్య కోర్సులలో ప్రవేశిస్తున్న విద్యార్థుల సంఖ్య ఇప్పటికీ తక్కువ శాతంగానే ఉంది. పిన్న వయసులోనే వృత్తి విద్యను నేర్పినట్లయితే.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించాలన్న బలీయమైన కోరిక, పట్టుదల సడలిపోతుంది. కొత్త విధానంలో మాతృభాషలో లేదా స్థానిక భాషలో 5వ తరగతి వరకు విద్యాబోధన జరగాలని, రెండవ అంచెలో 8వ తరగతి వరకు దానిని పొడిగించాలని ప్రతిపాదించడం కచ్చితంగా పేద, మధ్య తరగతి వర్గాలవారి పిల్ల లకు నష్టం కలుగుతుంది. ఒకవైపు పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన అందించి.. వారికి ఉన్నత అవకాశాలు కల్పించాలన్న కోరిక 95% మంది బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రులలో బలంగా ఉన్న నేపథ్యంలో.. ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కొత్త విద్యావిధానంపై కేంద్ర ప్రతిపాదన ప్రతిబంధకంగా మారుతుంది. ఇంగ్లిష్ విద్యను పేద పిల్ల లకు దూరం చేయడం సమంజసం కాదు. ఇంగ్లిష్‌ను లేకుండా చేయడం అంటే మనల్ని మనం వెనక్కు నెట్టుకోవడమేనని ‘ఎం.సి. చాగ్లా’ ఏనాడో స్పష్టం చేశారు. రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉండే విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషలలోనే విద్యను బోధించాలని 1967లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినపుడు విద్యాశాఖ సహాయమంత్రిగా ఉన్న ఎం.సి. చాగ్లా దానిని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇంగ్లిష్ భాషపై వ్యతిరేకత దేనికి? భాషను జాతీయతా లక్షణంగా పరిగణించరాదని ఎంతోమంది విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఒక భాష.. అది హిందీ కావొచ్చు.. మరొకటి కావొచ్చు. దానిద్వారానే ప్రజ లలో దేశభక్తి కలుగుతుందనుకోవడం హేతుబద్ధత కాదు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌లో బోధన చేయాలన్న అంశానికి 95% మందికిపైగా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లో మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన జరపడం అన్నది మాతృభాషాభివృద్ధికి వ్యతిరేకం కాదు. కేంద్రం తెచ్చిన కొత్త విద్యావిధానంలో పాఠ్య ప్రణాళికల్లో మార్పు తెచ్చి ప్రాథమిక స్థాయి నుంచి పరిశోధన వరకు ప్రాచీన, సమకాలీన సంస్కృతులు, చరిత్రలకు సంబంధించిన అంశాలను చేరుస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కూడా వివాదాస్పదం కానుంది. జాతి మొత్తానికి సంబంధించి కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసి వాటిని పాఠ్యాంశాలుగా చేయడం వల్ల.. భవిష్యత్తులో ప్రాంతీ యంగా అనేక సమస్యలు ఉత్పన్నం కావడానికి ప్రస్తుతం కేంద్రం అనుసరించబోయే విధానం అనుచిత బీజాలు నాటినట్లవుతుంది కదా! ఇది దేశ సెక్యులర్, ప్రజాస్వామ్య వ్యవస్థలకు విఘాతం కలిగించవచ్చు, విభేదాలకు దారితీయవచ్చు. భారత రాజ్యాంగంలోని 254 అధికరణ ప్రకారం ‘విద్య’ ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి విద్యపై సమాన హక్కులు, బాధ్యతలు దఖలు పడ్డాయి. రాష్ట్రాలలో చేసే చట్టాలకు అనుగుణంగా చట్టాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. పాఠశాల విద్యకు సంబంధించి.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకొంటున్నాయి. అయితే, నూతన విద్యావిధానం చట్టంగా రూపొం దిన తర్వాత.. రాష్ట్రాలు తప్పనిసరిగా దానినే అనుసరించాల్సిన అనివార్యత ఏర్పడితే.. అది మరో దేశవ్యాప్త సమస్యగా మారవచ్చు. కేంద్రం ప్రకటించిన ఈ నూతన విద్యావిధానం ఇంకా ముసాయిదా రూపంలో ఉంది కనుక ఇందులో అనేక సమగ్ర మార్పులు, చేర్పులు చేయవచ్చు. అందుకు దీనిపై పార్లమెంట్లో విస్తృతమైన చర్చ జరగాలి. రాష్ట్రాల అభిప్రాయాలు కేంద్రం స్వీకరిం చాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. విస్తృత అంగీకారంతోనే కొత్త విద్యావిధానం విజయవంతం కాగలదు తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సరికొత్త సమస్యలకు బాటలు పరిచినట్లవుతుంది. వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
ఇంతకీ కాపులు ఓసీలా? బీసీలా?
హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కర్నూరు జిల్లా నంద్యాలలో న్యాయవాది అనిల్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ... హోదా కోసం ఎవరూ సూసైడ్ చేసుకోవద్దని కోరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడుతూ..అధికారం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ధర్మపోరాటం యాత్ర చేయాలనే ఆలోచన చంద్రబాబుకు నాలుగేళ్ల తొమ్మిది నెలల తర్వాత వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మొదటి నుంచి పోరాడుతుందన్నారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఢిల్లీ దీక్షకు జనాలను తరలించేందుకు అధికారులకు టార్గెట్లు పెట్టారన్నారు. నాడు హోదా అని ఉద్యమిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతానని హెచ్చరించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ డబ్బుతో దుబారా దీక్ష చేయబోతున్నారని విమర్శించారు. కాపులు ఓసీలా? బీసీలా? కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌పై అసెంబ్లీలో పెట్టిన బిల్లు చూస్తే ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని తేలిపోతుందని ఉమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కాపులను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 2014కు ముందు కాపులను బీసీలలో చేరుస్తానికి తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు...2017 డిసెంబర్ 1న మంజునాథ కమిషన్ వేశారని ఆయన గుర్తు చేశారు. ఆరు నెలల్లో నివేదిక కావాలని చెప్పి పలుమార్లు పొడిగింపు ఇచ్చి...చివరికి బలవంతంగా చైర్మన్ సంతకం లేకుండానే ఇద్దరు సభ్యుల నుంచి నివేదిక తీసుకున్నారన్నారు. మరి కాపులు ఓసీలా? బీసీలా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. అసెంబ్లీలో ఆ నివేదకను పెట్టి కాపులను బీసీలలో చేరుస్తున్నామని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన చంద్రబాబు...కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లలో కాపులకు సగం ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు బిల్లు పెట్టడం కాపులను మోసం చేయడమే అని అన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కాపులను బీసీలలో చేర్చాలనే ప్రతిపాదన ఏదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్రం తేల్చి చెప్పిందని ఉమ్మారెడ్డి వెల్లడించారు. ఎన్నికల ముందు జిమ్మికులు చేయడం బాబుకు అలవాటేనని అన్నారు. అయిదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇవ్వడానికి రాష్ట్రానికి అధికారం లేదన్నారు. కాపులను అటు బీసీలకు, ఇటు ఓసీలకు దూరం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ఆర్థిక వెనకబాటుతనం మీద మాత్రమే 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, కాపులకు 5శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తేగలరా అంటూ ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా సవాల్ చేశారు. -
ఇంతకీ కాపులు ఓసీలా? బీసీలా?
-
ఏపీలో 59లక్షల బోగస్ ఓట్లు: ఉమ్మారెడ్డి
చిత్తూరు: రాష్ట్రంలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సర్వేల పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఉమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 11 నుంచి ఇప్పటి వరకు 14 లక్షల ఓట్లను తొలగించారన్నారు. చంద్రబాబు తీరుతో రాజ్యాంగం అపహాస్యమవుతోందన్న ఉమ్మారెడ్డి... చంద్రబాబు బడ్జెట అంతా అంకెల గారడీనే అని విమర్శించారు. ప్రత్యేక హోదాను నీరుగార్చి యూటర్న్ తీసుకుంది చంద్రబాబేనని ఆయన ధ్వజమెత్తారు. పోస్టు డేటెడ్ చెక్కులిచ్చి మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు డ్వాక్రా మహిళల రుణమాఫీ కాలేదన్నారు. -
అంబేద్కర్ ఆశయాలకు బాబు తూట్లు: ఉమ్మారెడ్డి
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ అగ్రనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌కు నివాళులు అర్పించి ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ..భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఒక ఓటు మాత్రమే వేయాలని ఉంది కానీ ఇపుడు ఒక వ్యక్తికి గ్రామానికో ఓటు రాష్ట్రానికో ఓటు కలిగి ఉన్నారని అన్నారు. చనిపోయిన వారికి కూడా ఓటు హక్కు కల్పిస్తున్నారని ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 50 లక్షల మంది చనిపోయిన వ్యక్తులకు కూడా మన ఏపీలో ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఎవరైనా కావాలని దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అనేటటువంటి నాయకత్వం ఈనాడు తయారైందని పరోక్షంగా చంద్రబాబు నుద్దేశించి వ్యాఖ్యానించారు. వివక్ష లేకుండా సమాజాన్ని నిర్మించాలని ఆనాడు నాయకులు అనుకుంటే.. ప్రస్తుతం నాయకుల్లో మాత్రం వివక్షతో కూడిన ఆలోచనలు ఉండటం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ మరణించినా ఆయన ఆశయాలకు మరణం లేదన్నారు. -
ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సీబీఐని అనుమతించకుండా జీవో తీసుకువచ్చే పరిస్థితి ఎందుకు దాపురించిందని ప్రజలు చర్చించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ దాడులు చేయడానికి వచ్చిన వారికి భద్రత ఇవ్వలేమని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఈరోజు సీబీఐ దర్యాప్తు జరగకుండా ఏకంగా జీవో తెచ్చారని పేర్కొన్నారు. భయంతోనే ఇలా చేస్తున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ జీవోలో కొందరి వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. బ్యాంకుల్లో అవకతవకలు జరిగితే ఎవరు దర్యాప్తు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దానికేం సమాధానం చెబుతారు? రఫేల్ వివాదంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ కోరుతోంది.. మరి మీరు కూడా కాంగ్రెస్‌తోనే ఉన్నారు కదా.. దీనికేం సమాధానం చెబుతారని చంద్రబాబును ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.1995- 2018 మధ్య 13 ఏళ్ళ పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నారని.. కానీ ఈ 23 ఏళ్ల మధ్య ఎవరూ కూడా సీబీఐపై బ్యాన్ పెట్టలేదని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు కనబడకపోయినా ఈ జీవో ఎందుకు తెచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా రాష్ట్రంలో సీబీఐకి సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ.. ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని కేంద్ర సంస్థలు నిగ్గు తెలుస్తున్న వేళ.. ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ విషయంలో ఈ విధంగా వ్యవహరించడం పట్ల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. -
సీబీఐ దర్యాప్తు జరగకుండా జీవో తెచ్చారు
-
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డికి అస్వస్థత
సాక్షి, నెల్లూరు: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. శనివారం నెల్లూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. దీక్షలో సుదీర్ఘంగా ప్రసంగించి దీక్షా వేదికపై ఉన్నారు. ఈ క్రమంలో డీహైడ్రేషన్‌తో ఒక్కసారిగా నీరసించిపోయి కళ్లు తిరగటంతో హుటాహుటిన పార్టీ నేతలు ఆయన్ను నెల్లూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి , పార్టీ గుంటూరు జిల్లా నేతలు లేళ్ల అప్పిరెడ్డి మేరుగ నాగార్జున, లావు శ్రీకృష్ణ దేవరాయులు, కావటి మనోహర్ నాయుడు తదితరలు ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. నెల రోజులగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఎండ తీవ్రతకు డ్రీహైడ్రేషన్‌కు లోనవడంతో అస్వస్థతకు గురయ్యారని, చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పినట్లు ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య తెలిపారు. -
రైతుల నోళ్లు కొట్టి...భూసేకరణా?
-
రైతుల నోళ్లు కొట్టి...భూసేకరణా?
విజయవాడ : రైతుల నోళ్లు కొట్టి ...బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ భూ సేకరణను ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు పంటలు పండే భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా 33వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం...తాజాగా బలవంతపు భూ సేకరణ చేపట్టిందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. రైతులతో పాటు, కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం భూ సేకరణ ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందని, అయితే ఆ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోయినా...రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 166 జీవో తీసుకు వచ్చి భూముల సేకరిస్తోందని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గ్రామకంఠాల పేరుతో దానికొక నోటిఫికేషన్ ఇచ్చి రైతుల వద్ద నుంచి భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. ఈ చర్యలను ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు.