
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్‌సీపీ అగ్రనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌కు నివాళులు అర్పించి ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ..భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఒక ఓటు మాత్రమే వేయాలని ఉంది కానీ ఇపుడు ఒక వ్యక్తికి గ్రామానికో ఓటు రాష్ట్రానికో ఓటు కలిగి ఉన్నారని అన్నారు.
చనిపోయిన వారికి కూడా ఓటు హక్కు కల్పిస్తున్నారని ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 50 లక్షల మంది చనిపోయిన వ్యక్తులకు కూడా మన ఏపీలో ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఎవరైనా కావాలని దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా అనేటటువంటి నాయకత్వం ఈనాడు తయారైందని పరోక్షంగా చంద్రబాబు నుద్దేశించి వ్యాఖ్యానించారు. వివక్ష లేకుండా సమాజాన్ని నిర్మించాలని ఆనాడు నాయకులు అనుకుంటే.. ప్రస్తుతం నాయకుల్లో మాత్రం వివక్షతో కూడిన ఆలోచనలు ఉండటం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ మరణించినా ఆయన ఆశయాలకు మరణం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment