హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి దానికి గత ప్రభుత్వమే కారణమని విషం కక్కుతోందని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటిపోయింది. ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ప్రతిదానికీ గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. ప్రజలు సూపర్ సిక్స్ ఎక్కడ అని ఎదురుచూస్తున్నారు. మహిళలకు,వృద్ధులకు చెప్పిన పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. నెగెటివ్ ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చేసింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామాల్లో పార్టీల పేరుతో దాడులు చేశారు. పోలవరం ఇపుడే నిర్మాణం జరుగుతుందనే భ్రమ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
..నాలుగు నెలల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను ఈనాడు, ఆంధ్ర జ్యోతి ఎక్కడ రాయలేదు. ప్రజాశక్తి పత్రికలో గత ప్రభుత్వ హయంలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని రాసింది. కూటమి ప్రభుత్వం మాత్రం 14 లక్షల కోట్లను గత ప్రభుత్వం అప్పు తెచ్చామని ప్రచారం చేస్తున్నారు. 2005లో మొదలుపెట్టిన పోలవరం పనులు ప్రారంభం కాగా.. ఇప్పుడు చంద్రబాబుతోనే ప్రారంభించినట్లు ప్రచారం చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. 2016సెప్టెంబర్ 8 వరకు పోలవరం పనులు చేయలేదు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పోలవరానికి 55 వేల కోట్లు అవసరం ఉండగా.. 20 వేల కోట్లకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పుకొని రావడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగలేదు.
..పోలవరం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన పనులను మేమే చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. 2014లో అధికారంలో ఉన్న టీడీపీ చేసిన పొరపాట్లను 2019లో అధికారంలో వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. పోలవరానికి 31 వేల 600 కోట్ల రూపాయలకు పెంచడానికి వైఎస్సార్‌సీపీ కృషి చేసింది. ఈ రోజు 12 వేల 500 కోట్ల రూపాయలు మంజూరు కావడం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనత. ఆ రోజు ప్రధాని, ఆర్థిక మంత్రి సహకారం, వైఎస్ జగన్ కృషి కారణంగానే పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి. నాలుగు నెలల్లో టీడీపీ ప్రభుత్వం ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment