
చిత్తూరు: రాష్ట్రంలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారాన్ని దుర్వినియోగం
చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఉమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 11 నుంచి ఇప్పటి వరకు 14 లక్షల ఓట్లను తొలగించారన్నారు.
చంద్రబాబు తీరుతో రాజ్యాంగం అపహాస్యమవుతోందన్న ఉమ్మారెడ్డి... చంద్రబాబు బడ్జెట అంతా అంకెల గారడీనే అని విమర్శించారు. ప్రత్యేక హోదాను నీరుగార్చి యూటర్న్ తీసుకుంది చంద్రబాబేనని ఆయన ధ‍్వజమెత్తారు. పోస్టు డేటెడ్ చెక్కులిచ్చి మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు డ్వాక్రా మహిళల రుణమాఫీ కాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment