
సాక్షి, నెల్లూరు: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. శనివారం నెల్లూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. దీక్షలో సుదీర్ఘంగా ప్రసంగించి దీక్షా వేదికపై ఉన్నారు. ఈ క్రమంలో డీహైడ్రేషన్‌తో ఒక్కసారిగా నీరసించిపోయి కళ్లు తిరగటంతో హుటాహుటిన పార్టీ నేతలు ఆయన్ను నెల్లూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి , పార్టీ గుంటూరు జిల్లా నేతలు లేళ్ల అప్పిరెడ్డి మేరుగ నాగార్జున, లావు శ్రీకృష్ణ దేవరాయులు, కావటి మనోహర్ నాయుడు తదితరలు ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. నెల రోజులగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఎండ తీవ్రతకు డ్రీహైడ్రేషన్‌కు లోనవడంతో అస్వస్థతకు గురయ్యారని, చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పినట్లు ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య తెలిపారు.