vanchana garjana
-
జగన్ సీఎం అయితేనే ప్రత్యేక హోదా సాధ్యం
గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డిని 2019లో ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరులో గురువారం జరిగిన వంచనపై గర్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ మాట మేరకు సంవత్సరం పదవీకాలం ఉండగానే ఐదుగురు వైఎస్సార్ సీపీ ఎంపీలు పదవికి రాజీనామా చేశారన్నారు. టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చి, సమస్యలపై ప్రశ్నిస్తా అని నాలుగున్నరేళ్లు గడిపేసిన పవన్ కల్యాణ్ జగన్మోహన్రెడ్డి పారిపోయాడనడం అవివేకమన్నారు. పారిపోవటం, భయపడటం, వెన్ను చూపటం వైఎస్ జగన్ రక్తంలో లేదన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 2019 ఎన్నికల్లో ఒక్కడిగా పోటీ చేసే దమ్మున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి అన్నారు. తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని, కాగితం ముందు పెట్టినా చదవటం రాని లోకేష్ క్యామిడీ యాక్టర్‌కు ఎక్కువ, సీరియస్ యాక్టర్‌కి తక్కువ అని అన్నారు. తన స్థాయిని తెలుసుకుని జగన్‌ను విమర్శించాలన్నారు. రాష్ట్రంలో 1.75 కోట్ల నిరుద్యోగులు ఉంటే నాలుగున్నర ఏళ్ల తర్వాత 12 లక్షల మందికి మాత్రమే అది కూడా రూ.1,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారన్నారు. నిరుద్యోగ భృతి ద్వారా ఇచ్చే రూ.1,000 సెల్ఫోన్లు కొనుగోలు చేసి జల్సాలు చేయరాదని లోకేష్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అయిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఎన్ని కుతంత్రాలు చేసినా సాగవన్నారు. అధికార పార్టీ నాయకులు వైఎస్సార్ కార్యకర్తలపై చేస్తున్న అరాచకాలకు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులకు చక్రవడ్డీతో చెల్లిస్తామన్నారు. ‘వంచనపై గర్జన’లో బొమ్మిరెడ్డి వెంకటగిరి: గుంటూరులో గురువారం జరిగిన వంచనపై గర్జనలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంచనపై గర్జన కార్యక్రమంలో ప్రజల నుంచి విశేషంగా స్పందన రావడం హర్షణీయమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా, విభజన హమీలను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం అయ్యారన్నారు. -
చంద్రబాబు గోత్రం ద్రోహం-భూమన
-
రాజీనామాలు చేస్తే ఎగతాళి చేశారు
-
బీజేపీతో లాలూచీపడి ప్రజలను వంచించారు
-
9న గుంటూరులో వంచన పై గర్జన సభ
-
చంద్రబాబు గద్దె దిగేదాకా నల్ల కండువా ధరిస్తా
-
అనంత ఆర్ట్స్ కాలేజీలో జులై 2న వంచనపై గర్జన
-
అనంతలో వైఎస్ఆర్సీపీ వంచనపై గర్జన
-
30న హోదా కోసం అనంతలో వంచనపై గర్జన
-
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డికి అస్వస్థత
సాక్షి, నెల్లూరు: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. శనివారం నెల్లూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. దీక్షలో సుదీర్ఘంగా ప్రసంగించి దీక్షా వేదికపై ఉన్నారు. ఈ క్రమంలో డీహైడ్రేషన్‌తో ఒక్కసారిగా నీరసించిపోయి కళ్లు తిరగటంతో హుటాహుటిన పార్టీ నేతలు ఆయన్ను నెల్లూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి , పార్టీ గుంటూరు జిల్లా నేతలు లేళ్ల అప్పిరెడ్డి మేరుగ నాగార్జున, లావు శ్రీకృష్ణ దేవరాయులు, కావటి మనోహర్ నాయుడు తదితరలు ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. నెల రోజులగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఎండ తీవ్రతకు డ్రీహైడ్రేషన్‌కు లోనవడంతో అస్వస్థతకు గురయ్యారని, చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పినట్లు ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య తెలిపారు. -
ముగిసిన వైఎస్సార్సీపీ ‘వంచనపై గర్జన’ దీక్ష
-
ముగిసిన ‘వంచనపై గర్జన’ దీక్ష
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ముగిసింది. నవ నిర్మాణ దీక్ష పేరుతో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు వంచనపై నెల్లూరు వీఆర్ కళాశాల గ్రౌండ్లో శనివారం వైఎస్సార్ సీపీ నేతలు గర్జన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వంచించిందని వైఎస్సార్ సీపీ నేతలు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలతో పాటు హోదా అంశాన్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.2019 ఎన్నికలలో టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ...నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని అన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను ఉక్కుపాదంతో అణిచివేసిన చంద్రబాబు ఇవాళ హోదా అంటూ కూనిరాగం తీస్తూ మరోసారి ప్రజలను వంచించేందుకు తయారవుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైఎస్ జగన్ నేతృత్వంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని దేశానికే చాటిచెప్పిన నాయకుడు జగన్ అన్నారు. గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వనరులను తాకట్టు పెట్టడమే కాకుండా.. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు దోచేశారన్నారు. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, చంద్రబాబు పాలనను కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
జగన్ అంటే చంద్రబాబుకు భయం ఎందుకు ?
-
‘చంద్రబాబు దోచేస్తారు.. లోకేష్ దాచేస్తారు’
సాక్షి, నెల్లూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దోచుకో-దాచుకో పథకం సాగుతోందని వైఎస్సార్సీసీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తండ్రి చంద్రబాబు దోచేస్తుంటే.. ఆయన తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ దాచేస్తున్నారని కోలగట్ల ఆరోపించారు. శనివారం నెల్లూరులో వైఎస్సార్సీసీ ఆధ్వర్యంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు గొప్ప నటుడని ఆయనతో మహా నటుడు సినిమా తీయాలన్నారు. రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ బాత్రూం నుంచి రాహూల్ బెడ్రూంలోకి.. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బాత్రూం నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయధ్యక్షుడు రాహుల్‌ల్ గాంధీ బెడ్రూంలోకి వెళ్లాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమన్నారు. నవనిర్మాణ దీక్ష పేరుతో కొత్త డ్రామా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లు ఏపీ ప్రజలను మోసం చేసిన అనంతరం ఇప్పుడు హోదా రాగం అందుకుని బీజేపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
జగన్ పోరాటంతోనే చంద్రబాబు హోదాపై మాట మార్చారు
-
ప్రత్యేకహోదాని భూస్థాపితం చేసింది చంద్రబాబే
-
చంద్రబాబు తెలుగుజాతికి చేసిన ద్రోహాన్ని మర్చిపోలేం
-
మోదీ చంద్రబాబును మోసం చేయలేదు.. కానీ!
సాక్షి, నెల్లూరు : ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబును మోసం చేయలేదని.. ఈ ఇద్దరు నేతలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ఈ విషయంలో ఎందుకు వెనుకాడుతోందని అంబటి ప్రశ్నించారు. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు మోసపూరిత వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షకు విశేష స్పందన వస్తోంది. వంచనపై గర్జన దీక్షలో అంబటి మాట్లాడుతూ.. టీడీపీ-బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీతో వైఎస్సార్సీపీ కలిసే ప్రసక్తే లేదని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు కావాలనే వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉండటం మన ఖర్మ అని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తెలుగుజాతికి చేసిన ద్రోహాన్ని అంత తేలికగా మర్చిపోలేమన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు సొంతమని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదని, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిన అక్రమకేసుల్లో ఇరికించేందుకని పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీకి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి, ప్రత్యేక హోదా సాధన జననేత వైఎస్ జగన్ వల్లే సాధ్యమని ఎంపీ మేకపాటి వివరించారు. మొదటినుంచీ హోదా కోసం పోరాడుతున్నది వైఎస్సార్‌సీపీనేనని ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. హోదా కోసం పార్లమెంట్లో 13సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టామని, కానీ కొందరు కుట్రలు చేసి తీర్మానం చర్చకు రాకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏపీకి ఎందుకూ పనికి రాలేదన్నారు. మా రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. టీడీపీ-బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఏపీ ప్రజలకు అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమతో పాటు టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయాలని కోరినా.. చంద్రబాబు మాత్రం ఆ విషయంలో ముందుకు రాలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పెంపు కోసమే చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరిగారని, కానీ ఇప్పుడు నవనిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరతీశారని ఏపీ సీఎంపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. -
‘టీడీపీ-బీజేపీలు కలిసి వంచించాయి’
-
‘చంద్రబాబు పాలనను కూకటివేళ్లతో పెకలించాలి’
సాక్షి, నెల్లూరు : నవనిర్మాణ దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారంటూ వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలను మరింతగా వంచించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది వైఎస్సార్‌సీపీనేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీకి హోదా కోసం ఢిల్లీ నగర వీధుల్లో ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని కొనియాడారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రగతిశీలి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు దోచేశారని భూమన ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, చంద్రబాబు పాలనను కూకటివేళ్లతో పెకలించడానికి సిద్ధం కావాలంటూ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘టీడీపీ-బీజేపీలు కలిసి వంచించాయి’ ‘ఏపీ ప్రయోజనాల కోసం రాజీనామాలు చేశాం. ప్రత్యేక హోదా ఇవ్వండి, లేని పక్షంలో మా రాజీనామాలు అమోదించాలని’ వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ అహంకారి అని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసమర్ధుడని.. అందుకే ఏపీకి సంజీవని లాంటి హోదా రాలేదని తెలిపారు. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు మోసపూరిత వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో వైఎస్సార్సీపీ ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టింది. ఈ గర్జన దీక్షలో వరప్రసాద్ మాట్లాడుతూ.. హోదా రాకపోవడానికి 40 శాతం కేంద్ర తప్పిదాలు కారణమైతే, 60 శాతం అసమర్ధుడైన చంద్రబాబు నాయుడే కారణమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని టీడీపీ, కేంద్రంలోని బీజేపీ కలిసి ఏపీని వంచించాయని ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు మరో మోసానికి సిద్ధపడ్డారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడంలో చంద్రబాబే ప్రధాన అడ్డంకి అని మండిపడ్డారు. చంద్రబాబు చేసే మోసాలను చూడలేక, ప్రజలను చైతన్యం చేసేందుకే ‘వంచనపై గర్జన’ దీక్షను వైఎస్సార్సీపీ చేపట్టిందని బొత్స తెలిపారు. -
వంచన దీక్ష!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : నవ నిర్మాణదీక్ష పేరుతో జిల్లా కేంద్రంలోని టవర్‌క్లాక్ వద్ద శనివారం హడావుడి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏటా ఇలా ప్రచార ఆర్భాటం చేస్తోంది. అధికారం చేపట్టిన కొత్తలో ‘నవనిర్మాణదీక్ష’ చేస్తే కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, రాష్ట్రాభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు మరింత బాధ్యత గుర్తు చేసేలా, ఉత్సాహం నింపేందుకు చేస్తున్నారని అంతా భావించారు. కానీ పాలకులు మాత్రం ఏటా ఈ దీక్ష చేస్తూనే ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేడు చేయబోయే దీక్ష ఐదేళ్ల ప్రభుత్వానికి ఆఖరిది కానుంది. ఈ క్రమంలో ఇన్నేళ్లుగా చేసిన దీక్షల సారాంశం ఏమిటి..? వీటి వల్ల జిల్లా అభివృద్ధిలో పురోగతి కన్పించిందా..? ప్రజాప్రతినిధుల్లో బాధ్యత పెరిగిందా..? ప్రజా సమస్యలపై అధికారులు చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారా..? జిల్లా అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాయా..? అన్న చర్చ జిల్లాలో నడుస్తోంది. రాష్ట్రంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతం అనంతపురం జిల్లా. ఇదే క్రమంలో టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాల్లో ఇదీ ఒకటి. రెండు ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే స్థానాలు, పది మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులకే ప్రజలు పట్టంకట్టారు. ఇలాంటి జిల్లాపై టీడీపీ ప్రభుత్వం ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపాలి..? ప్రజాప్రతినిధులు మరెంత బాధ్యతాయుతంగా మెలగాలి..? కానీ నాలుగేళ్ల ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తే జిల్లాకు తీరని ద్రోహం చేశారనేది స్పష్టమవుతోంది. ఎకరాకు నీళ్లివ్వలేని మంత్రులు, ప్రజాప్రతినిధులు చంద్రబాబు గొప్పతనంపై ఏటా నవనిర్మాణదీక్షల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఊదరగొడుతున్నారు. కానీ నాలుగేళ్లల్లో జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు ఇవ్వలేని అసమర్థమంత్రులుగా పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, గతంలో మంత్రిగా చేసిన పల్లె రఘునాథరెడ్డి మిగిలిపోయారని జిల్లా వాసుల తీవ్రంగా విమర్శిస్తున్నారు. 2012 నుంచి జిల్లాకు కృష్ణాజలాలు వస్తున్నా..ఫేజ్–1 80 శాతం, ఫేజ్–2లో 75 శాతం పనులే పూర్తయ్యాయి. ఏటా 25–30 టీఎంసీల జలాలు వస్తున్నా.. నాలుగేళ్లలో ఎకరా పొలం తడపలేదు. డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని 2015లో ప్రభుత్వం జీఓ 22 జారీ చేయడంతో పనులు నిలిచిపోయాయి. కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలనే లక్ష్యం మినహా ‘అనంత’ రైతుల వేదన ప్రభుత్వానికి పట్టలేదు. హంద్రీ–నీవా ద్వారా జిల్లాలోని చెరువులకు నీళ్లిచ్చామని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పులు చెప్పుకుంటూ గంగపూజలు చేస్తున్నారు. కనీసం ఆ చెరువుల కింద ఆయకట్టుకైనా సాగునీరు ఇచ్చారా..? వారి గుండెమీద చేయివేసుకుని ప్రశ్నించుకుంటే సమాధానం లేని పరిస్థితి. రైతులకు సాగునీరివ్వాలని ఎమ్మెల్యేలంతా సీఎం వద్దకు వెళ్లి కనీసం ప్రతిపాదన కూడా చేయలేని దౌర్భాగ్యపరిస్థితి. దీనస్థితిలో మున్సిపాలిటీలు ‘అనంత’ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని పది మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో నాలుగేళ్లలో ఒక్క ఇళ్లూ నిర్మించలేదు. హిందూపురం, తాడిపత్రి, గుత్తితో పాటు దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ తాగేందుకు నీళ్లు సరఫరా చేయలేదు. సీఎం బావమరిది బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 90 శాతం ప్రజలు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ హామీ నీటిమీద రాతే అయ్యింది. అలాగే డ్రైనేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. అనంతపురం కార్పొరేషన్లో పరిస్థితి మరో ఘోరంగా ఉంది. నాలుగేళ్లలో రూ.85 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో నగరంలో డివైడర్లు, కొన్నివార్డుల్లో బాగున్న డ్రైనేజీ కాలవల స్థానంలో కొత్త కాలవల నిర్మాణం చేపట్టడం మినహాయిస్తే తక్కిన నిధులతో ఎలాంటి అభివృద్ధి జరిగిందో పాలకవర్గమే చెప్పాలి. పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి. కనీస మౌలిక సదుపాయాలు లేక జనం అల్లాడిపోతున్నారు. కనీసం ఇళ్లు కూడా మంజూరు చేయకపోవడంతో ఏటా జన్మభూమి సభల్లో అర్జీలిచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతేడాది జిల్లాకు కొన్ని ఇళ్లు మంజూరైన బిల్లుల పెండింగ్‌తో క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి. ఇచ్చిన హామీలదీ అదే పరిస్థితి రాజధాని ప్రకటన సమయంలో ‘అనంత’ అభివృద్ధికి తనదీ భరోసా అంటూ అసెంబ్లీ సాక్షిగా కొన్ని హామీలు గుప్పించారు. ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం నిర్మిస్తామన్నారు. ఇది ఏర్పాటై ఉంటే సామాన్యుడి ఆరోగ్యానికి భరోసా దక్కేది. దీన్ని రాజధాని ప్రాంతానికి తరలించారు. ‘అనంత’ను స్మార్ట్‌సిటీ చేస్తానన్నారు. ఎలా ఉందో అందరికీ తెలుసు..! టెక్స్‌టైల్‌పార్క్, ఫుడ్‌పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ క్లస్టర్, నూతన పారిశ్రామిక నగరం, పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల తయారీ పరిశ్రమ నిర్మిస్తామన్నారు. వీటితో పాటు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఎక్కడా వీటి అమలుకు ఉపక్రమించలేదు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇక పదినెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చనపుడు, జిల్లా ప్రజల బాగోగులు పట్టనప్పుడు... ఏటా ‘నవనిర్మాణదీక్ష’ పేరుతో సత్యదూరమైన ప్రసంగాలు చేయడం, ప్రజలను మోసం చేయడం భావ్యమా..? అని రాజకీయపార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వేదికపై ప్రజాప్రతినిధులు ప్రసంగించి ఇంటికెళ్లిన తర్వాత ఆత్మవిమర్శ చేసుకున్నా.. నాలుగేళ్లలో జిల్లాను ప్రభుత్వం ఎలా విస్మరించిందో స్పష్టమవుతోందని పరిశీకులు చెబుతున్నారు. నవనిర్మాణ దీక్షను ‘వంచన దీక్ష’గా వైఎస్సార్సీపీతో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీ లు, బీజేపీ విమర్శిస్తున్నాయి. నేటి నుంచి ‘నవనిర్మాణ దీక్ష’ అనంతపురం అర్బన్: జిల్లాలో శనివారం నుంచి ఈ నెల 8 వరకు ‘నవనిర్మాణ దీక్ష’ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ జిల్లా యంత్రాగం సిద్ధం చేసింది. నవ నిర్మాణ దీక్ష నిర్వహణకు సంబంధించి 14 నియోజవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ జి.వీరపాండియన్ ఉత్తర్వులను శుక్రవారం జారీ చేశారు. ప్రత్యేక అధికారులు వీరే :అనంతపురం నియోజకవర్గానికి ఆర్డీఓ మలోల, రాప్తాడుకు ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, గుంతకల్‌కు ఎఫ్ఎస్ఓ గాయత్రిదేవి, తాడిపత్రికి సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్, రాయదుర్గానికి హౌసింగ్ పీడీ సెల్వరాజ్, ధర్మవరానికి ఆర్డీఓ విశ్వనాథ్£Š , శింగనమలకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటనారాయణమ్మ, కళ్యాణదుర్గానికి ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, హిందూపురానికి సెరికల్చర్ జేడీ సుబ్బరామయ్య, కదిరికి ఆర్డీఓ రామమోహన్, మడకశిరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, పెనుకొండకు ఆర్డీఓ రామమూర్తి, పుట్టపర్తికి డీఎఫ్ఓ చంద్రశేఖర్‌ను నియమించారు. -
నెల్లూరులో వంచనపై గర్జన
-
‘గర్జన’కు సిద్ధం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వంచనపై గర్జన దీక్షకు సర్వం సిద్ధమైంది. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం సాగిస్తోంది. పోరాటం తీవ్రమైన తరుణంలో రాష్ట్ర ప్రజల బలమైన ఆకాంక్షగా మారింది. ఈ క్రమంలో పోరాటాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరితం ఉద్ధృతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు, రిలే నిరహార దీక్షలు, వంటావార్పు, విభిన్న రీతుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూరాజీలేని పోరాటం సాగిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో శనివారం నెల్లూరు వేదికగా వంచనపై గర్జన దీక్ష పేరుతో రాష్ట్రస్థాయి దీక్ష నిర్వహిస్తున్నారు. నగరంలోని వీఆర్సీ గ్రౌండ్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గర్జన దీక్ష జరగనుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తరలివచ్చిన నేతలు ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ నేతలు పెద్ద సంఖ్యలో నెల్లూరుకు తరలివచ్చారు. వీఆర్సీ గ్రౌండ్లో దీక్షా స్థలిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే నగరంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయకులు నాలుగేళ్ల క్రితం తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇస్తామని ఎన్నికల సభలో హామీలు ఇచ్చారు. తీరా అధికారంలో వచ్చాక దాన్ని పక్కన పెట్టేశారు. హోదా కాదు ప్యాకేజ్ అంటూ బీజేపీతో నాలుగేళ్లు జతకట్టిన టీడీపీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి చివరకు పదవులకు కూడా రాజీనామా చేశారు. ఈ రాజకీయ పరిణామాల క్రమంలో ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో వంచనపై గర్జన దీక్ష నిర్వహించారు. దీని కొనసాగింపుగా నెల్లూరు నగరంలో శనివారం దీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో టీడీపీ, బీజెపీలు కలిపి ప్రజలను వంచించిన వైనాన్ని గర్జన దీక్ష ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ప్రజలను చైతన్యపరచటమే లక్ష్యంగా దీక్ష నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన నేతలు వీఆర్సీ గ్రౌండ్లో దీక్షకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. 250 మంది నేతలు కూర్చొనేందుకు వీలుగా వేదికను సిద్ధం చేశారు. అలాగే ఐదువేల మంది కార్యకర్తలకు సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎండతీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇతర జిల్లాల నుంచి తరలివచ్చే వాహనాల కోసం వీఆర్సీ గ్రౌండ్‌తో పాటు లా కళాశాల ప్రాంగణంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పార్టీ రీజినల్ కో–ఆర్టినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ముఖ్య నేత బొత్స సత్యనారాయణ ఏర్పాట్లు పరిశీలించారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి దీక్ష ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కు మార్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రె డ్డి, పార్టీ నేతలు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. -
2న నెల్లూరులో ‘వంచన గర్జన’
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నెల్లూరులో జూన్ 2న నిర్వహించే ‘వంచన గర్జన’కు జిల్లా నుంచి అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మోసపూరిత విధానాలు, విభజన హామీలు అమలు చేయని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘వంచన గర్జన’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరులోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో శనివారం 9 గంటలకు నిర్వహించే నిరసన దీక్షలో నలుపు రంగు దుస్తులు ధరించి పాల్గొనాల్సి ఉందని తెలిపారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిరసన దీక్ష కావడంతో పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. -
వంచనపై వైఎస్సార్సీపీ గర్జన