పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో రాచమల్లు మాట్లాడారు.